S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/01/2016 - 00:34

బాల్కొండ, జూలై 31: బాల్కొండ మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గోదావరి నది ఒడ్డున జరుగుతున్న అంత్య పుష్కరాలను ఎండోమెట్ అసిస్టెంట్ కమిషనర్ సోమయ్య ఆదివారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా 1, 2, 3, 4పుష్కర ఘాట్లను పరిశీలించి, ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని ఆలయ ఇఒ గంగాధర్, చైర్మన్ సాగర్‌రెడ్డిలను ఆదేశించారు.

08/01/2016 - 00:34

బాల్కొండ, జూలై 31: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాల్వల్లో ఒకటైన లక్ష్మికాల్వకు వేల్పూర్ ఎంపిపి రజిత, జడ్పీటిసి విమలలు ఆదివారం ప్రత్యేక పూజలు చేసి నీటిని విడుదల చేశారు. లక్ష్మి కెనాల్‌కు నీటి విడుదల వల్ల బాల్కొండ, మోర్తాడ్, వేల్పూర్ మండలాల్లోని ఆయకట్టు రైతులకు పంటల సాగుకు చెరువులు నింపుకునేందుకు ఈ నీరు ఎంతగానో ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు.

08/01/2016 - 00:33

పిట్లం, జూలై 31: సమస్యల పరిష్కారం కోసం పట్టు విడవకుండా సెకండ్ ఎఎన్‌ఎంలు నిరవధిక ఆందోళనలు నిర్వహిస్తున్నా, ప్రభుత్వం స్పందించకపోవడంతో తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా ఈ నెల 18వ తేదీ నుండి పిట్లం ప్రభుత్వాసుపత్రి ఎదుట పిట్లం, నిజాంసాగర్ మండలాలకు చెందిన సెకండ్ ఎఎన్‌ఎంలు తమ న్యాయమైన డిమాండ్‌లను పరిష్కరించాలని దీక్షలు కొనసాగిస్తున్నారు.

08/01/2016 - 00:33

మోర్తాడ్, జూలై 31: ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో సంబంధిత మంత్రులను వెంటనే బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సుమీర్ అహ్మద్ డిమాండ్ చేశారు. మోర్తాడ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థులు ఐదు పర్యాయాలు ఎంసెట్ పరీక్ష రాశారని, మళ్లీ ప్రభుత్వ అసమర్ధత వల్ల మరోసారి పరీక్ష రాయమనడం సమంజసం కాదన్నారు.

08/01/2016 - 00:31

కొవ్వూరు, జూలై 31: గోదావరి అంత్య పుష్కరాలు ఆదివారం కొవ్వూరులో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. గోష్పాదక్షేత్రంలో అనేక మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. తెల్లవారుజాము నుండే యాత్రికులు గోష్పాద క్షేత్రానికి చేరుకున్నారు. ఉదయం తక్కువ సంఖ్యలో ఉన్నా రానురాను భక్తుల సంఖ్య పెరిగింది. అధికారుల అంచనాలకు మించి భక్తులు వచ్చి పుణ్యస్నానాలు చేశారు. సుమారు 25 వేల మంది స్నానాలు చేసినట్టు అంచనా.

08/01/2016 - 00:30

ఏలూరు, జూలై 31 : గోదావరి అంత్యపుష్కరాల ప్రారంభం రోజైన ఆదివారం జిల్లాలో కొవ్వూరు, సిద్ధాంతం, నరసాపురం, పోలవరం, ఇతర ప్రాంతాలలో ఏర్పాటుచేసిన స్నానఘట్టాలలో సుమారు 47 వేల మంది భక్తులు పుష్కర పుణ్యస్నానాలు ఆచరించారు.

08/01/2016 - 00:30

ఏలూరు, జూలై 31 : ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్ నిధులన్నీ కూడా ఒక్క రూపాయికూడా దుర్వినియోగం కాకుండా ఎస్‌సి, ఎస్‌టి ప్రాంతాల అభివృద్ధికి, వారి జీవన ప్రమాణాల పెంపుదలకే ఖర్చు చేస్తామని ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ అన్నారు. ఆదివారం స్థానిక ఇరిగేషన్ గెస్ట్‌హౌస్ వద్ద జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

08/01/2016 - 00:29

ఏలూరు, జూలై 31: ఎటువంటి విలువైన పనిచేస్తున్నా బీమా ఉందా, లేదా అని ఆరా తీసుకోవటం, లేకుంటే వెంటనే ఆ పని చేయటం సర్వసాధారణం. ఇక ఎక్కువగా నష్టాల బారినపడుతున్న వ్యవసాయంలో బీమా అవకాశం చేతికందే దూరంలో ఉన్నా అవగాహన, తగిన ప్రచారం కరువవటంతో ఇలాంటి బంగారంలాంటి అవకాశం కూడా మరో 48గంటల్లో రైతాంగం చేజారే పరిస్దితి కన్పిస్తోంది.

08/01/2016 - 00:29

ఏలూరు, జూలై 31: ఏలూరు రేంజ్ పరిధిలో 2007 బ్యాచ్‌కు చెందిన 28 ఎస్సైలకు సిఐలుగా పదోన్నతి లభించనుంది. మొత్తం ఈ బ్యాచ్‌లో 34మంది ఉండగా వీరిలో ఆరుగురు శాఖాపరమైన విచారణలు ఎదుర్కొంటున్నందున వారిని మినహాయించి మిగిలిన 28మందికి పదోన్నతి కల్పించనున్నారు. సోమవారం ఏలూరు రేంజ్ డిఐజి రామకృష్ణ ఈ జాబితా విడుదల చేస్తారని తెలుస్తోంది. ఈ జాబితాలో జిల్లాకు చెందిన ముగ్గురు ఎస్సైలకు పదోన్నతి లభించనుంది.

08/01/2016 - 00:28

లాస్ ఏంజిలిస్, జూలై 30: డోపింగ్ పరీక్షలో పట్టుబడి సస్పెన్షన్‌ను ఎదుర్కొంటున్న రష్యా స్విమ్మర్ నికిటా లొబిత్సెవ్ తనపై చర్య తీసుకోవడాన్ని సవాలు చేస్తూ అంతర్జాతీయ క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు (సిఎఎస్)ను ఆశ్రయించాడు. అతనితోపాటు, ఇదే సమస్యను ఎదుర్కొంటున్న మరో స్విమ్మర్ వ్లాదిమీర్ మొరోజొవ్ కూడా సిఎఎస్‌లో తన సస్పెన్షన్‌పై సవాలు చేశాడు.

Pages