S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/31/2016 - 22:27

భీమదేవరపల్లి, జూలై 31: పాడి పరిశ్రమ రైతులకు చేయూతగా నిలిచి వారిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ధ్యేయమని ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంకు అధ్యక్షుడు, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి పేర్కొన్నారు. ముల్కనూర్ స్వకృషి డెయరీ 14వ మహాసభ ఆదివారం డెయరీ ఆవరణలో జరిగింది. ఈసందర్భంగా దివంగత బ్యాంకు అధ్యక్షుడు అల్గిరెడ్డి విశ్వనాధరెడ్డి చిట్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

07/31/2016 - 22:26

పెద్దపల్లి రూరల్, జూలై 31: మండలంలోని సబ్బితం గ్రామ సమీపంలోని గౌరిగుండాల వద్ద గల జలపానికి సందర్శకుల తాకిడి పెరిగిపోయింది. సెలవు రోజు వస్తే చాలు జలపాతం వద్ద సందడి వాతవరణం నెటకొంటుంది. మీడియాతో పాటు సోషల్ మీడియాలో గౌరి గుండాల జలపాతం గురించి తెలుసుకున్న వారు చాలా మంది ఇక్కడి వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు.

07/31/2016 - 22:26

సిరిసిల్ల, జూలై 31: సామాజిక సేవల్లో ఉన్నత వర్గాలు భాగస్వాములు కావాలని, అపుడే సమాజం మరింత ముందుకు సాగుతుందని కరీంనగర్ ఎంపి బోయనపల్లి వినోద్‌కుమార్ అన్నారు. ఆదివారం సిరిసిల్ల పద్మనాయక కళ్యాణ మండపంలో శుద్దజల కేంద్రంను ఎంపి ప్రారంభించారు. వెలుమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దాతలు ఇచ్చిన విరాళంతో శుద్ధజల కేంద్రం ఏర్పాటు చేయగా, ఎంపి వినోద్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

07/31/2016 - 22:25

ధర్మపురి, జూలై 14: ధర్మపురి క్షేత్ర గోదావరి అంత్య పుష్కరాల ప్రారంభకులు గుంటూరు దత్త పీఠాధిపపతి అవధూత విశ్వయోగి విశ్వంజీ ఆదివారం ఉదయాత్పూర్వం ధర్మపురి దేవస్థానంలో ప్రత్యేక పూజాదికాల్లో పాల్గొన్నారు. దేవస్థానం పక్షాన ఎసి, ఇఓ సుప్రియ, ఆస్థాన వేద పడితులు రమేశ శర్మ, అర్చకులు, సిబ్బంది, పిఠాధిపతులకు ప్రభుత్వ పక్షాన ఆహ్వానం పలుకగా, దైవాభిషేక పూజల్లో పాల్గొన్నారు.

07/31/2016 - 22:25

ధర్మపురి, జూలై 31: దశాబ్దాల వలస పాలనలో తెలంగాణ అన్యాయానికి, వెనకబాటు తనానికి, నిర్లక్ష్యానికి గురైందని, తొలి ప్రభుత్వం బంగారు తెలంగాణ సాధన దిశగా కృషి చేస్తోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం ధర్మపురి క్షేత్రంలో గోదావరి అంత్య పుష్కరాల ప్రారంభం సందర్భంగా ఈటల మాట్లాడుతూ తెలంగాణలో 80 శాతం గోదావరి, 69 శాతం కృష్ణానది ప్రవహిస్తున్నాయన్నారు.

07/31/2016 - 22:24

సైదాపూర్, జూలై 31: మండలంలోని వెన్నంపల్లి పంచాయతీ పరిధి లస్మన్నపల్లి గ్రామానికి చెందిన గూటం లస్మమ్మ (104) అనే శతాధిక వృద్ధురాలు అనారోగ్యంతో ఆదివారం మృతి చెందింది. కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన ప్రకారం..గత రెండు రోజులుగా అస్వస్థతకు గురై మృతి చెందినట్లు వారు తెలిపారు.

07/31/2016 - 22:24

కరీంనగర్ టౌన్, జూలై 31: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా బర్తీ చేయనున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. 37,400 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా, వీరి కోసం 63 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిమిషం నిబందనను ఖచ్చితంగా అమలు చేయగా, ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించలేదు.

07/31/2016 - 22:21

ములుగు, జూలై 30 : మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణంలో ప్రభుత్వం భూ సేకరణ చట్టాన్ని తుంగలో తొక్కి రైతులకు నష్టం చేకూరుస్తుందని తెలంగాణ అడ్వకేట్ జెఎసి కన్వినర్, కో కన్వినర్ చన్నారెడ్డి, ప్రహల్లాద్‌లు పేర్కొన్నారు.

07/31/2016 - 22:21

నిజామాబాద్, జూలై 30: తెలంగాణ జిల్లాల వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు వచ్చి చేరుతుండడంతో ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గడిచిన రెండు సంవత్సరాల నుండి తీవ్ర వర్షాభావం వల్ల నీటి నిల్వలను సంతరించుకోలేకపోయిన ఎస్సారెస్పీలోకి, ఈ ఏడాది సీజన్ ఆరంభం నుండే వరద జలాల చేరిక ప్రారంభమై ప్రాజెక్టు నీటిమట్టం క్రమేణా పెరుగుతోంది.

07/31/2016 - 22:21

నిజామాబాద్, జూలై 30: గోదావరి అంత్య పుష్కరాలు ఆదివారం నుంచి ప్రారంభం కానుండగా, కనీస సదుపాయాలు కల్పించే విషయమై అధికారులు నామమాత్రంగానైనా చర్యలు చేపట్టకపోవడం పట్ల భక్తుల్లో ఒకింత అసంతృప్తి వ్యక్తమవుతోంది. సరిగ్గా ఏడాది క్రితం జరిగిన గోదావరి మహా పుష్కర ఏర్పాట్లను చూసి పులకించిన వారంతా, ప్రస్తుతం అధికార యంత్రాంగం నిస్తేజ వైఖరిని చూసి ఉసూరుమంటున్నారు.

Pages