S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/31/2016 - 23:52

జోగిపేట, జూలై 31: కూడిపల్లి మండలం బండపోతుగల్, తదితర ప్రాంతాల్లో అతిసార వ్యాధి సోకిన రోగులు జోగిపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం విధితమే. కాగా ఈ వ్యాధి ఆస్పత్రి నుంచి జోగిపేట పట్టణవాసులకీ వ్యాపించింది. ఆదివారం నాడు ఒకేరోజు జోగిపేట పట్టణానికి చెందిన 8 మంది రోగులు అతిసార వ్యాధి సోకి జోగిపేట ఆస్పత్రిలో చేరారు.

07/31/2016 - 23:52

నవ్యాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టుబడులకోసం విదేశాల్లో విపరీతంగా పర్యటిస్తు న్నారు. ఇప్పటికే ఆయన సింగపూర్‌ను చాలా సార్లు సందర్శించారు. జపాన్, చైనా, రష్యాలతో పాటు సెంట్రల్ ఆసియా రిపబ్లిక్‌లైన కజకిస్తాన్, కిర్జిస్తాన్, ఉజ్బెకిస్తాన్, టుర్క్‌మెనిస్తాన్, తజకిస్తాన్ వంటి పేద దేశాల్లో కూడా పర్యటించారు. కజకిస్తాన్ జనాభా కోటీ డెబ్బయ లక్షలు.

07/31/2016 - 23:51

మెదక్ రూరల్, జూలై 31: ఒంటిపై కిరోసిన్ పోసుకొని బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని మంబోజిపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. కుటుంబీకుల కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బుడగ జంగం రాజు, దుర్గ దంపతుల కూతురు స్వప్న (17) ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. చదువుమానేసి ఇంటి వద్దనే ఉంటున్న స్వప్న అప్పటి వరకు తల్లితో మాట్లాడుతూనే తల్లి ఇంటి నుండి బయటకు వెళ్లగానే ఆత్మహత్యకు పాల్పడింది.

07/31/2016 - 23:51

నంగునూరు, జూలై 31: ఇంటింటా స్వచ్ఛమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జడ్పి వైస్ చైర్మన్ సారయ్య అన్నారు. ఆదివారం మండలంలోని మగ్దుంపూర్‌లో మిషన్ భగీరథ పైపులైన్ పనులను ప్రారంభించి మాట్లాడారు. గతంలో వేసిన పైపులకు కాలం చెల్లిందని, మరమ్మత్తులు చేయడం వల్ల ఇంటింటా నీరు అందడం లేదన్నారు. ఇది గమనించిన టిఆర్‌ఎస్ సర్కార్ మిషన్ భగీరథ చేపట్టిందన్నారు.

07/31/2016 - 23:50

‘‘ప్లాట్‌ఫామ్స్ ఎంత మంచివి! కొందర్ని కలుపుతాయి. ప్లాట్‌ఫామ్స్ ఎంత చెడ్డవి! ఎందర్నో విడగొడతాయి- అంటాడు కవి.
ఈ రెండు సందర్భాలలోనూ కూడా ప్లాట్‌ఫామ్స్ అంటే అవి రైల్వే ప్లాట్‌ఫామ్సే అయి వుంటాయి.
మనది స్వచ్ఛ్భారతం అవ్వాలనుకుంటున్న స్వతంత్ర భారత్. ఇక్కడ రుూ రైల్వేస్‌ని- ‘్భరతీయ రైల్’ అంటా రు- జాతీయ భాషలో. కానీ, మనం అర్ధమయ్యేలాగా చెప్పుకోవాలంటే.. ‘ఇండియన్ రైల్వేస్’- అనాలి.

07/31/2016 - 23:49

యాదగిరిగుట్ట, జూలై 31: ఆగస్టు 15న 113 షాపులను కొండపైన గల వర్తక సంఘానికి అధికారికంగా అప్పగిస్తామని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎన్.గీత తెలిపారు.

07/31/2016 - 23:49

నల్లగొండ, జూలై 31: జిల్లాలో ఇరిగేషన్ శాఖ చేపట్టిన మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ, మూసీ కాలువల నిర్మాణం, కాలువలపై వంతెనల నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయించడంలో ఆ శాఖ అధికారులు రైతులకు, ప్రజాప్రతినిధులకు, ఉన్నతాధికారులకు మధ్య నలిగిపోతున్నారు.

07/31/2016 - 23:49

మన వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. ఉత్పత్తి వ్యయాలు పెరుగుతున్నా రైతుకు వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. గ్రామీణ కుటుంబాల్లో రైతు కుటుంబాల వాటా 57.8 శాతం. మొత్తం వ్యవసాయ దారుల్లో చిన్న, సన్నకారు రైతుల వాటా 86.58 శాతం. వ్యవసాయ వ్యయం పెరగడంవల్ల రైతులను ఆదుకోవాలని, ప్రతి సంవత్సరం ప్రభుత్వం కొన్ని ముఖ్య పంటలకు మద్దతు ధరలు ప్రకటిస్తున్నది. ఈ ధరలను ప్రతి సంవత్సరం పెంచుతూ వుంది.

07/31/2016 - 23:48

సూర్యాపేట, జూలై 31: రాష్ట్రంలో ఉత్పన్నమవుతున్న వరస కరవు పరస్థితులను నివారించేందుకు ముఖ్యమంత్రి కెసి ఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతుందని రాష్ట్ర విద్యుత్, దళిత అభివృద్ది శాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని 19,21, 24వ వార్డుల్లో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.

07/31/2016 - 23:48

నల్లగొండ, జూలై 31: రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం..వాటర్ షెడ్ పథకాలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం సొంత పథకాలకు మళ్లిస్తుండడంతో గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులు, వాటర్ షెడ్‌ల విస్తరణ పథకాల నిర్వహణను అస్తవ్యవస్తంగా మార్చివేస్తోంది.

Pages