S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పాడి పరిశ్రమ రైతుల అభివృద్ధే ధ్యేయం

భీమదేవరపల్లి, జూలై 31: పాడి పరిశ్రమ రైతులకు చేయూతగా నిలిచి వారిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ధ్యేయమని ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంకు అధ్యక్షుడు, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి పేర్కొన్నారు. ముల్కనూర్ స్వకృషి డెయరీ 14వ మహాసభ ఆదివారం డెయరీ ఆవరణలో జరిగింది. ఈసందర్భంగా దివంగత బ్యాంకు అధ్యక్షుడు అల్గిరెడ్డి విశ్వనాధరెడ్డి చిట్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం డెయరీ పరిధిలోని 120 గ్రామాల అధ్యక్షులతో ఏర్పాటైన సభలో ప్రవీణ్‌రెడ్డి మాట్లాడుతూ ముల్కనూర్ స్వకృషి డెయరీ ఈ యేడు 89 కోట్ల వ్యాపారం చేసి 5 కోట్ల 96 లక్షల రూపాయల లాభం ఆర్జించిందన్నారు. వీటిని విజయదశమి పండగకు రైతులకు అందిస్తామన్నారు. గత సంవత్సరం కంటే అధికంగా డెయరీ ఈ యేడు 2 కోట్ల 50 లక్షల అధికం లాభం సంపాదించిందన్నారు. ఆనాడు డెయరీ ఏర్పాటు జరిగిన సమయంలో మహిళలతో ఏర్పాటు చేస్తున్న సంఘం నడుస్తుందా? అనే సందేహాలకు నేడు వస్తున్న లాభాలే నిరూపిస్తున్నాయన్నారు. డెయరీ ప్రారంభంలో 60 సంఘాలు ఉండగా నేడు 120 సంఘాలతో అన్ని రంగాల్లో ముందంజలో నిలుస్తోందన్నారు. సంఘంలోని 22 వేల మంది రైతులకు లాభాలు చేకూర్చేందుకు డెయరీ పాలకవర్గం నిత్యం కృషి చేస్తుందన్నారు. డెయరీ ఏర్పాటు వల్ల నేడు ఈ ప్రాంతానికి చెందిన 500 మందికి ఉపాధి లభించిందన్నారు. సంఘ సభ్యులు తమ హక్కుల కోసం సభ్యుల వాట ధనం మరింత పెంచుకోవాలన్నారు. సంఘం లో కేవలం 35 సంఘాలు మాత్రమే పశువుల బీమా చేశాయని, మిగతా సంఘాలు కూడ తప్పనిసరిగా బీమా చేయించాలన్నారు. డెయరీ అందిస్తున్న గడ్డి విత్తనాలు, నట్టల నివారణ మందులు పాడి రైతులు తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలన్నారు. పాడి రైతులు అధిక పోషకాలున్నా దాణ మాత్రమే వాడి పాల దిగుబడి పెంచుకోవాలన్నారు. దీర్ఘకాలం పాలిచ్చే విధంగా రైతులు గేదెలను పెంచాలన్నారు. డెయరీ అధ్యక్షులు కడారి పుష్పలీల మాట్లాడుతూ డెయరీలో ఐకమత్యమే బలమని సంఘ సభ్యులు నిరూపించారన్నారు. డెయరీ ఎక్కువ పాలు పోసిన సంఘాలను అభినందించారు. ఈకార్యక్రమంలో డెయరీ జనరల్ మేనేజర్ మార్పాటి భాస్కర్‌రెడ్డి, డెయరీ సిబ్బంది పాల్గొన్నారు.