S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/31/2016 - 23:58

గుంటూరు (కొత్తపేట), జూలై 31: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఆగస్టు 2న నిర్వహించే బంద్‌ను ప్రజలు, కార్మిక, కర్షక, వ్యాపారవర్గాలు స్వచ్ఛందంగా మద్దతు తెలియజేసి జయప్రదం చేయాలని సిపిఐ, సిపిఎం జిల్లా కార్యదర్శులు జంగాల అజయ్‌కుమార్, పాశం రామారావులు పేర్కొన్నారు.

07/31/2016 - 23:57

యడ్లపాడు, జూలై 31: ఉద్యాన పంటల సాగులో దేశంలో 5వ స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని మొదటిస్థానానికి తెచ్చేందుకు వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్యమంత్రి నేతృత్వంలో నిర్విరామ కృషి చేస్తున్నారని డాక్టర్ వై ఎస్ ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ పాలకవర్గ సభ్యుడు పోపూరి శివరామకృష్ణ అన్నారు.

07/31/2016 - 23:57

మంగళగిరి, జూలై 31: కొబ్బరి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతూ భారతీయ కిసాన్‌సంఘ్ జాతీయ కార్యవర్గ సమావేశం తీర్మానించిందని అఖిల భారత కిసాన్‌సంఘ్ ప్రధాన కార్యదర్శి మోహినీ మోహన్ మిశ్రా వెల్లడించారు. భారత కిసాన్ సంఘ్ జాతీయ కార్యవర్గ సమావేశాలు మండల పరిధిలోని నూతక్కి విజ్ఞాన విహార పాఠశాల ప్రాంగణంలో మూడురోజుల పాటు జరిగి ఆదివారం సాయంత్రం ముగిశాయి.

07/31/2016 - 23:56

గుంటూరు (కల్చరల్), జూలై 31: గ్రీష్మరుతువు ముగిసి వర్షరుతువు ప్రారంభమైన నేపథ్యంలో అమ్మవారిని శాకాంబరిగా అలంకరించి భక్తులకు కనువిందు చేయడం ఆనవాయితీగా వస్తున్నది.

07/31/2016 - 23:56

అమరావతి, జూలై 31: అమరావతిలోని పెదమద్దూరు సెంటర్ వద్ద అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలాంటి అనుమతులు లేకుండా ఎన్‌టిఆర్ విగ్రహం ఏర్పాటుకు నిర్మాణాలు చేస్తున్నారని, వాటిని వెంటనే నిలుపుదల చేయడంతో పాటు సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పెదకూరపాడు నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త కావటి మనోహర్ నాయుడు డిమాండ్ చేశారు.

07/31/2016 - 23:56

గుంటూరు (కల్చరల్), జూలై 31: ఎటువంటి ఆటంకాలు, అవరోధాలు కలగకుండా నవ్యాంధ్ర రాజధాని, అమరావతి శీఘ్రగతిన అనేక రంగాల్లో పురోభివృద్ధి, ప్రగతిని సాధించాలనే ప్రధాన సంకల్పంచేసి ఏడు గంటల పాటు నగరంలోని బృందావన గార్డెన్స్ ధార్మిక విజ్ఞాన ప్రాంగణంలో సప్తమ సూర్య మహాయాగాన్ని వైభవంగా నిర్వహించారు.

07/31/2016 - 23:54

సంగారెడ్డి టౌన్, జూలై 31: ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని బోనాల పండుగ ఉత్సవాలు ఆదివారం జిల్లాకేంద్రంలో అంగరంగ వైభవంగా జరిగాయి. పట్టణంలో పురాతనంగా వస్తున్న మహాశక్తివంతమైన దుర్గమ్మతల్లి బోనాల జాతర మహోత్సవాన్ని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి (జగ్గారెడ్డి) పూర్తి సహాయ సహకారాలతో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు.

07/31/2016 - 23:53

గజ్వేల్, జూలై 31: ప్రధాని నరేంద్రమోదీ పర్యటనను దృష్టిలో పెట్టుకొని పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేస్తున్నట్లు డిజిపి అనురాగ్ శర్మ పేర్కొన్నారు. ఆదివారం మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని కోమటిబండలో హెలీప్యాడ్, బహిరంగ సభ, మిషన్ భగీరథ ప్రాజెక్టు ప్రాంతాలను పరిశీలించిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు.

07/31/2016 - 23:53

కొండపాక, జూలై 31: మల్లన్నసాగర్ ముంపుగ్రామం సింగారం నిర్వాసితులు ఆదివారం మంత్రి హరీష్‌రావును కలిసి భూములు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నామని తెలిపారు. మండలంలోని సింగారంకు చెందిన నిర్వాసితులు మంత్రి హరీష్‌రావుతో చర్చలు జరిపి భూములు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని, తమకు సరైన న్యాయం చేయాలని కోరినట్లు తెలిసింది.

07/31/2016 - 23:52

తూప్రాన్, జూలై 31 : తెలంగాణ ప్రజల కోసం ప్రభుత్వం చేపడుతున్న ప్రజా పథకాలు విజయవంతం కావాలని మహంకాళి అమ్మవారు దీవించాలని కోరుతున్నట్లు ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. తూప్రాన్‌లో ఆదివారం మహంకాళి జాతర సందర్బంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

Pages