S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పేదలకు ఉన్నత వర్గాలు చేయూతనిచ్చి పైకి తేవాలి

సిరిసిల్ల, జూలై 31: సామాజిక సేవల్లో ఉన్నత వర్గాలు భాగస్వాములు కావాలని, అపుడే సమాజం మరింత ముందుకు సాగుతుందని కరీంనగర్ ఎంపి బోయనపల్లి వినోద్‌కుమార్ అన్నారు. ఆదివారం సిరిసిల్ల పద్మనాయక కళ్యాణ మండపంలో శుద్దజల కేంద్రంను ఎంపి ప్రారంభించారు. వెలుమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దాతలు ఇచ్చిన విరాళంతో శుద్ధజల కేంద్రం ఏర్పాటు చేయగా, ఎంపి వినోద్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పేదలు అన్ని వర్గాలలో ఉన్నారని, వారికి చేయూత నిచ్చి పైకి తీసుకరావాల్సిన బాధ్యత ఉన్న వర్గాలపై ఉందన్నారు. నేత కార్మికుల ఉపాధి కోసం రూ.40 కోట్ల మేరకు వస్త్రాల ఉత్పత్తులను ఆర్డర్లను తెలంగాణ సర్కార్ ఇచ్చిందని, మంత్రి కె.తారకరామారావు చేసిన ఈ కృషిని వస్త్ర ఉత్పత్తిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వెలమ సంక్షేమ మండలి అధ్యక్షుడు చీటి నర్సింగరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావని, మండల పరిషత్ అధ్యక్షురాలు దడిగెల కమలాబాయి, స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ జిందం చక్రపాణి, సెస్ వైస్ చైర్మన్ లగిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.