S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/30/2016 - 18:49

కడప: పీఎఫ్‌ కార్యాలయంలో పింఛను సొమ్మును స్వాహా చేసిన కేసులో ఒకటో పట్టణ పోలీసులు ముగ్గురు విశ్రాంత ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. పరారీలో వున్న మరో ఉద్యోగి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుల నుంచి రూ.9లక్షల నగదు, రెండు ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

07/30/2016 - 18:48

ఆదిలాబాద్‌: రేపట్నుంచి వచ్చే నెల 11 వరకు ఆదిలాబాద్‌ జిల్లా బాసరలో గోదావరి అంత్యపుష్కరాలు జరుగుతాయి. ఆదివారం ఉదయం 6.30 గంటలకు ఈ పుష్కరాలను దేవాదాయ శాఖామంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించనున్నారు.

07/30/2016 - 18:46

ఇంఫాల్‌: మణిపూర్‌ సెంట్రల్‌ జైల్లోశనివారం ఖైదీల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు ఖైదీలు మృతి చెందారు. ఈ ఘటనలో ముగ్గురు జైలు అధికారులతో పాటు మరో ఖైదీ గాయపడ్డట్లు పోలీసులు చెప్పారు.ఇంఫాల్‌లో గల సెంట్రల్‌ జైల్లో యూసుఫ్‌(21), అబ్దస్‌(22) అనే ఇద్దరు ఖైదీలు అదే జైల్లో ఖైదీగా ఉంటున్న చురాచంద్‌పూర్‌ జిల్లాకు చెందిన తంగిమిన్‌లీన్‌ అనే వ్యక్తిని దారుణంగా కొట్టి చంపారు.

07/30/2016 - 18:44

హైదరాబాద్‌: ప్రత్యేక హోదా అంశంపై ఆగస్టు 2న రాష్ట్ర బంద్‌కు ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపునిచ్చింది. ప్రత్యేక హోదాపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరును చూసి రాష్ట్ర ప్రజలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారని ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు రామకృష్ణ, చెలకాని శ్రీనివాసరావు శనివారం అన్నారు. ఏపీ ప్రత్యేక హోదా అంశం విభజన బిల్లులో లేదని, ఇతర కారణాలు చెబుతూ వాయిదా వేయడం సమంజసం కాదన్నారు.

07/30/2016 - 17:58

హైదరాబాద్‌: ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర తీరం వెంబడి అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు. ఉత్తర కర్ణాటక పరిసర ప్రాంతాల్లో ఉపరిత ఆవర్తనం నెలకొని ఉందని తెలిపారు. రంగారెడ్డి, హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, మెదక్‌ జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు, అనంతపురం, కడప జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

07/30/2016 - 17:56

పంజాబ్‌ : పంజాబ్‌లోని మలెర్‌కోట్లలో ఇటీవల మతగ్రంథాన్ని అపవిత్రం చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే నరేశ్‌ యాదవ్‌కు బెయిల్‌ మంజూరైంది. సంగ్రూర్‌లోని అదనపు జిల్లా, సెషన్స్‌ కోర్టు యాదవ్‌కు బెయిల్‌ మంజూరు చేసినట్లు ఆమ్‌ఆద్మీ పార్టీ న్యాయ విభాగ అధ్యక్షుడు హిమ్మత్‌ సింగ్‌ షెర్గిల్‌ తెలిపారు. ఈ నెల 24న పంజాబ్‌ పోలీసులు యాదవ్‌ను అరెస్టు చేసి జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు.

07/30/2016 - 17:31

కర్నూలు : నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కుమార్తె సుజలతో పాటు మరో ఇద్దరిపై హత్యకేసు నమోదయ్యింది. నంది అకాడమీలో పీఆర్వోగా పనిచేసిన సుమంత్ హత్య కేసులో ఎంపీ కూతురిని అరెస్ట్ చేయాలని పలు ప్రజాసంఘాలు డిమాండ్ చేశారు. సుజల సూచన మేరకు మురళి, షఫీ అలీ అనే ఇద్దరు సుమంత్‌ను దారుణంగా కొట్టి చంపినట్లు మృతుడి బంధువులు ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై హత్యకేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.

07/30/2016 - 17:24

బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పెద్ద కుమారుడు రాకేష్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ బ్రస్సెల్స్‌లోని యూనివర్సిటీ ఆస్పత్రిలో మరణించారు. స్నేహితులతో కలిసి యూరప్ పర్యటనకు వెళ్లిన రాకేష్‌కు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో బ్రస్సెల్స్‌లోని యూనివర్సిటీ ఆస్పత్రిలో చేర్పించారు.

07/30/2016 - 17:23

విజయవాడ: ఎన్‌డిఎ ప్రభుత్వంలో తమ పార్టీకి ఉన్న రెండు మంత్రి పదవులు పోయినా కొంప మునిగేదీమీ లేదని, ప్రత్యేక హోదా కోసం తాము ఎంతటి పోరాటాలకైనా సిద్ధమేనని టిడిపి ఎంపి కేశినేని నాని శనివారం మీడియాతో అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం టిడిపి ఎంపీలు రాజీనామాలు చేసేందుకైనా రెడీగా ఉన్నారని అన్నారు.

07/30/2016 - 17:02

ఖమ్మం: రెజోనెన్స్‌ అకాడమీ డైరెక్టర్‌ వాసిరెడ్డి నాగేంద్రకుమార్‌పై ఎంసెట్‌-2 పేపర్‌ లీక్‌ కేసులో సీఐడీ అధికారులు అరెస్ట్‌వారెంట్‌ జారీ చేశారు. హైదరాబాద్‌లోని రెజోనెన్స్‌ వి క్యాంపస్‌లో విద్యార్థులకు నాగేంద్రకుమార్‌ శిక్షణ ఇస్తున్నట్లు అరెస్ట్‌ వారెంట్‌లో పేర్కొన్నారు.

Pages