S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/30/2016 - 22:45

కేంద్ర సాహిత్య అకాడెమీ వాళ్లు నాకు ఒక పెద్ద పని అప్పగించారు. ఆ పని గురించి వాళ్లు చెప్పకుండానే నా మనసులో కొంతకాలంగా ఆలోచనలు సాగుతున్నాయి. అనుమానాలు కూడా సాగుతున్నాయి. పెద్ద సంస్థ వాళ్లు చెప్పినందుకు చిత్తశుద్ధిగా ప్రయత్నం మొదలుపెట్టాను. కొన్ని నెలల పాటు కష్టపడ్డాను. కానీ అప్పజెప్పిన పనిని నిజంగా బాగా చేయాలంటే అందుకు అవసరమయిన సమాచారం నాకు అందదని అనుమానం కాదు కదా, గట్టిగా అర్థమయింది.

07/30/2016 - 22:39

వ్యక్తిత్వ వికాసమిచ్చే
సౌందర్య జీవనశైలి సభ్యత
సామాజిక జీవనానికి స్వేచ్ఛా వారధి
సభ్యత మధుర ఫలాల మహావృక్షం
విశ్వమానవాళి సేదతీర్చే విశాల హృదయం
సభ్యత జీవన పయనంలో
ముందుకు నడిపే రాస్తాగా మలుపుతిప్పే చౌరస్తాగా
పడినా లేపి నిచ్చెనేసి నింగికి ఎగదోస్తుంది
సభ్యత నిరంతర చైతన్య జీవవాహిని
ఉద్రేకం ఉన్మాదాల మురికి కడిగేస్తుంది

07/30/2016 - 22:39

వనం కోసం మనమై...
కోటి గొంతుకల నినాదమై...
అంకురార్పణ చేసి..
పిడికిలెత్తి జైకొట్టి...
దోసిలిలో మొక్కనిలిపి...
తెలుగు రాష్ట్రాల కల్పవల్లి...
తెలంగాణ తెలుగు తల్లి మెడలో
పచ్చల హారమై మెరసి...
హరిత హారతినిచ్చి...
రేపటి తరాల వెలుగు పూల వనమై...
సంజీవనమై...
కదులుదాము కదులుదాము
జనులంతా ఏకమై...
ఒకరికొకరు చేయికలిపి

07/30/2016 - 22:38

క్రీడల్లో విపరీతమైన పోటీ, శత్రుత్వమే తప్ప మానవతా విలువలకు తావులేదని వాదించేవారికి మొరాకో అథ్లెట్ నావల్ ఎల్ వౌంటవకెల్ తగిన సమాధానమే చెప్పింది. 1984 లాస్ ఏంజిలిస్ ఒలింపిక్స్ మహిళల 400 మీటర్ల పరుగులో భారత ఆశా కిరణం, ‘పయోలీ ఎక్స్‌ప్రెస్’ పిటి ఉష కడవరకూ పోరాడి, చివరికి నాలుగో స్థానంలో నిలిచిన విషయం అభిమానులకు గుర్తుండే ఉంటుంది.

07/30/2016 - 22:35

* ఒలింపిక్స్‌లో మొదటి డోపింగ్ కేసు 1968లో నమోదైంది. స్వీడన్‌కు చెందిన షూటర్ హన్స్ గన్నర్ లిల్జెవాల్ ఉత్ప్రేరకాన్ని వాడినట్టు రుజువు కావడంతో అతనిపై సస్పెన్షన్ వేటు వేశారు. పిస్టల్ టీం ఈవెంట్‌లో అతను సభ్యుడిగా ఉన్న స్వీడిష్ జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. అయితే, డోపింగ్ కేసు కారణంగా లిల్జెవాల్ సస్పెన్షన్‌కు గురికావడంతో ఆ పతకాన్ని నిర్వాహకులు వెనక్కు తీసుకున్నారు.

07/30/2016 - 22:18

ఒక మనిషి సమస్యల్లో మునిగినపుడు స్పందించేవారు, ఆదరించేవారు. ఇప్పుడవి లేవు. ఉదయం లేచిన దగ్గర్నుంచి ఉరుకులు పరుగులు తీస్తేగాని గడవని దుస్థితి. ఎవరి జీవన విధానం వారికే బరువైపోయింది. స్వార్థం, అవసరాలు చుట్టూ మానవ సంబంధాలు. సమస్యల్లో మునిగి మనిషిని పట్టించుకునే సమయం ఎవరికీ లేదు. ఎదురుచూడ్డం కూడా తప్పే. సమస్యలు లేనివారంటూ ఎవ్వరూ వుండరు.

07/30/2016 - 22:14

గత వారం వైద్యులు ఏం చెయ్యలేరో చెప్పటం జరిగింది. ఈసారి పేషంట్లు ఏం చెయ్యకూడదో తెలుసుకుంటే మంచిది. అప్పుడప్పుడు వైద్యులు చేసే చికిత్స సత్ఫలితాలని ఇవ్వకపోవచ్చు. కొన్నిసార్లు సరైన చికిత్స చాలా కారణాలవల్ల ఇవ్వడం కుదరకపోవచ్చు. దానివల్ల పేషెంట్ ప్రాణానికే ప్రమాదం కలగవచ్చు. ఆ సమయంలో పేషెంట్ బంధువులు, స్నేహితులు ఆసుపత్రులపైన, వైద్యులపైన తిరగబడి చేయి చేసుకోవడం లాంటివి ఎంతవరకు సమంజం.

07/30/2016 - 22:11

బూడిద నించి మొలకెత్తిన
రేపటి విత్తులు చూడు చూడు
కూల్చడం గొప్ప కాదు
నిర్మించడమే కష్టం. ఎన్ని జీవితాలు
చీకటిలోకి వెళ్లిపోయాయో చూశావా?

జీవితం తగలబడి పోయాక
మిగిలేది గుప్పెడు బూడిదనే కాదు
గుప్పిట జారవిడిచిన జ్ఞాపకాలు కూడా
దారి ఎప్పుడూ ఆగిపోదు
వేగంతో అడుగులేస్తూ నడుస్తున్న
నిన్ను లక్ష్యం వరకు చేరవేస్తుందో లేదో
ఇప్పుడేం చెప్పగలం?

07/30/2016 - 22:08

మహ్మధ్ షకీల్ వాజెద్, కర్నూలు (ఆం.ప్ర.)
ప్ర: దేవుడు ఒక్కడే కదా! మరి మీరు ఒక్కొక్క పనికి ఒక్కొక్క దేవుణ్ణి ప్రార్థించమంటారేమిటి?

07/30/2016 - 22:05

ఉప్పు సత్యనారాయణ, తెనాలి
ఇటీవల రాష్ట్రంలో పట్టపగలు ప్రజలను దోచుకోవటం, బస్సులు, రైళ్లల్లో దోపిడీలు ఎక్కువ ప్రజల ఆస్తులు, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. రక్షణ కోసం ప్రజలు ఆ భగవంతుని వేడుకొందామంటే, దేవాలయాల్లో సైతం ఆ భగవంతునికే రక్షణ లేకుండా విగ్రహాలు, నగలు దోచుకుంటుంటే, ఆ భగవంతుడు తన మొర ఎవరికి చెప్పాలి?

Pages