S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

2న ఏపీ బంద్‌కు ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపు

హైదరాబాద్‌: ప్రత్యేక హోదా అంశంపై ఆగస్టు 2న రాష్ట్ర బంద్‌కు ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపునిచ్చింది. ప్రత్యేక హోదాపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరును చూసి రాష్ట్ర ప్రజలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారని ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు రామకృష్ణ, చెలకాని శ్రీనివాసరావు శనివారం అన్నారు. ఏపీ ప్రత్యేక హోదా అంశం విభజన బిల్లులో లేదని, ఇతర కారణాలు చెబుతూ వాయిదా వేయడం సమంజసం కాదన్నారు. ఆగస్టు 5న తలపెట్టిన విద్యాసంస్థల బంద్‌ను రద్దు చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా పేరుతో కాకపోయిన ఇతర మెరుగైన సౌకర్యాలు, పథకాల పేరుతో ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక సహాయం అందించాలన్నారు.