S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/29/2016 - 05:44

హైదరాబాద్, జూలై 28: పార్టీ మారినా ఎన్నికల్లో టికెట్లకు ఢోకా ఉండదని ఇప్పటివరకూ ధీమాతో తెదేపాలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆత్మరక్షణలో పడ్డారు. 2026 వరకూ నియోజకవర్గ పునర్విభజన ఉండదని అటార్నీ జనరల్ కేంద్రానికి నివేదిక ఇవ్వడంతో, ఇక తమ రాజకీయ భవిష్యత్తేమిటన్న అంశం, వారిని భయాందోళనకు గురిచేస్తోంది. మళ్లీ టికెట్లు దక్కుతాయో, లేదోనన్న బెంగ పార్టీ మారిన వైసీపీ ఎమ్మెల్యేలలో మొదలయింది.

07/29/2016 - 05:43

కాకినాడ, జూలై 28: తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలోని నారాయణ కళాశాలకు చెందిన ఓ విద్యార్థిని గురువారం తెల్లవారుజామున ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎంపిసి ద్వితీయ సంవత్సరం చదువుతున్న గెడ్డం భారతి (17) తరగతి గదిలోనే ఫ్యానుకు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఉదంతం విద్యార్థి, ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.

07/29/2016 - 05:41

తనకల్లు, జూలై 28: అనంతపురం జిల్లాలో గురువారం సంచారజాతి వారి మధ్య జరిగిన చిన్నపాటి ఘర్షణ రెండు ప్రాణాలను బలిగొంది. డబ్బు విషయమై మాటామాటా పెరగడంతో తండ్రీకొడుకులు గుర్రప్ప, కొట్రసిని చావగొట్టారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కర్నాటక రాష్ట్రం కాశీపురానికి చెందిన కొంతమంది సంచారజాతి వారు కొక్కంటి క్రాస్ వద్ద గుడిసెలు వేసుకుని ఉంటున్నారు.

07/29/2016 - 05:41

విజయవాడ, జూలై 28: ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక రక్షణ దళం త్వరలోనే రాజధాని ప్రాంతంలో రక్షణ బాధ్యతలను స్వీకరించనుంది. తొలుత 400 మంది సిబ్బంది సచివాలయం ప్రాంగణంలో విధులు చేపట్టనున్నారు.

07/29/2016 - 05:40

డి.హీరేహాల్, జూలై 28 : కడప జిల్లా నుంచి బళ్ళారి మీదుగా తమిళనాడుకు తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను అనంతపురం జిల్లా పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. డి.హీరేహాల్ మండలం ఓబుళాపురం చెక్‌పోస్టు వద్ద లారీలో తరలిస్తున్న 120 ఎర్రచందనం దుంగలను పట్టుకున్న పోలీసులు 20 మంది కూలీలను అదుపులోకి తీసుకున్నారు.

,
07/29/2016 - 05:36

జమైకా, జూలై 28: వెస్టిండీస్‌తో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టు కోసం భారత క్రికెటర్లు నెట్స్‌లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేశారు. ఇక్కడి సబీనా పార్క్‌లో గురువారం ఉదయం నెట్స్‌కు హాజరైన టీమిండియా సభ్యులు అవిశ్రాంతంగా శ్రమించారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ సెషన్‌లో స్టార్ అట్రాక్షన్‌గా నిలిచాడు.

07/29/2016 - 05:31

న్యూఢిల్లీ, జూలై 28: డోపింగ్ పరీక్షలో విఫలమైన రెజ్లర్ నర్సింగ్ పంచమ్ యాదవ్ కేసులో ఇరు వర్గాల వాదనలు విన్న జాతీయ డోపింగ్ నిరోధక విభాగం (నాడా) క్రమశిక్షణ కమిటీ తన తీర్పును వాయిదా వేసింది. శనివారం లేదా సోమవారం తీర్పు వెలువడే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. 74 కిలోల విభాగంలో భారత్ నుంచి ఒకరికి రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం ఉన్న విషయం తెలిసిందే.

07/29/2016 - 05:29

న్యూఢిల్లీ, జూలై 28: నర్సింగ్ యాదవ్ మాదిరిగానే డోపింగ్ పరీక్షలో విఫలమైన షాట్‌పుటర్ ఇందర్‌జిత్ సింగ్ రెండో పరీక్షలోనూ దోషిగానే తేలాడు. ‘బి’ శాంపిల్‌లోనూ అతను నిషిద్ధ మాదక ద్రవ్యాన్ని వాడినట్టు రుజువైంది. దీనితో రియో ఒలింపిక్స్‌లో అతను పాల్గొనే అవకాశాలకు గండిపడింది.

చిత్రం.. ఇందర్‌జీత్ సింగ్

07/29/2016 - 05:28

బులవాయో, జూలై 28: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నిం గ్స్‌లో జింబాబ్వే కేవలం 164 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కివీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టం లేకుండా 32 పరుగులు చేసింది. మార్టిన్ గుప్టిల్ (10), టామ్ లాథమ్ (16) నాటౌట్‌గా ఉన్నారు. అంతకు ముందు టాస్ గెలిచిన జిం బాబ్వే బ్యాటింగ్ ఎంచుకుంది.

07/29/2016 - 05:27

హైదరాబాద్, జూలై 28: ప్రో కబడ్డీ టోర్నమెంట్ నాకౌట్ దశకు చేరుకుంది. శుక్రవారం జరిగే రెండు సెమీ ఫైనల్స్‌లో పోరాడే నాలుగు జట్లు తుది పోరు అవకాశం కోసం సర్వశక్తులు ఒడ్డనున్నాయి. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగే సెమీస్‌ను గెలిచి, ఫైనల్‌లో స్థానం సంపాదించడమే లక్ష్యంగా తెలుగు టైటాన్స్ బరిలోకి దిగనుంది.

Pages