S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/29/2016 - 07:00

పాములపాడు, జూలై 28:మండల పరిధిలోని భానుముక్కల, బానకచెర్ల గ్రామాల మధ్యలో గురువారం గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని పాదచారులు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అయితే మృతదేహం గుర్తుపట్టని విధంగా ఉందని దాదాపు 4,5 రోజుల క్రితం మృతి చెందినట్లు భావిస్తున్నారు.

07/29/2016 - 06:59

కర్నూలు, జూలై 28:నంద్యాల పట్టణానికి చెందిన ప్రభుత్వ వైద్యుడు శైలేంద్రరెడ్డి(38) హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే వారి నుంచి 4 సెల్‌ఫోన్లు, 2 మోటార్‌బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి గురువారం ఎస్పీ ఆకే రవికృష్ణ నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్న వ్యాస్ ఆడిటోరియంలో విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

07/29/2016 - 06:59

కర్నూలు, జూలై 28 : కృష్ణా నదిపై సప్తనదీ సంగమేశ్వరం సమీపంలోని సిద్ధేశ్వరం గ్రామం వద్ద నిర్మించాలని ప్రజలు కోరుతున్న సిద్ధేశ్వరం ఆనకట్టకు ప్రభుత్వం అనుకూలంగా లేనట్లు స్పష్టమవుతోంది. సిద్ధేశ్వరం ఆనకట్ట నిర్మాణం చేపడుతామని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చి సర్వే కూడా చేయించారు. ఆ తరువాత ఆ హామీపై ఎవరూ నోరు మెదపలేదు.

07/29/2016 - 06:56

ఖమ్మం(ఖిల్లా), జూలై 28: ఎంసెట్-2 లీకేజికి కారకులైన విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డిని మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని పిడిఎస్‌యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ శరత్ డిమాండ్ చేశారు. గురువారం నగరంలో ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.

07/29/2016 - 06:56

భద్రాచలం, జూలై 28: ఆది, అంత్య పుష్కరాలు కేవలం గోదావరికి మాత్రమే సొంతం. మరే నదికి అంత్యపుష్కరాలు లేవు. ఆది పుష్కరాలకు రాలేక పోయిన భక్తులు అంత్య పుష్కరాల్లో పాల్గొని పితృదేవతలకు పిండ ప్రదానాలు సమర్పించుకునే వీలుంది. అంత్య పుష్కరాలకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. కానీ జిల్లాలో ఇందుకు తగిన ఏర్పాట్లు జరగడం లేదు. ఆది పుష్కరాలకు ఇచ్చినంత కాకపోయినా కనీస ప్రాధాన్యత ఇవ్వడం లేదు.

07/29/2016 - 06:55

ఖమ్మం(క్రైం), జూలై 28: సమాజంలో ఆశా కార్యకర్తలు అందిస్తున్న సేవలు అభినందనీయమని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. గురువారం స్థానిక భక్తరామదాసు క్షేత్రంలో నిర్వహించిన ఆశా సమ్మేళన అభినందన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో ఆశ కార్యకర్తల సేవలు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువచేయడంలో ఆశాల పాత్ర ప్రాధాన్యతను సంతరించుకుందని కొనియాడారు.

07/29/2016 - 06:55

కొత్తగూడెం, జూలై 28: సింగరేణి సంస్థలో జరిగిన అవినీతిపై ఎసిబి, సిబిఐలతో విచారణ జరిపించి బాధ్యులైన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని హెచ్‌ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ డిమాండ్ చేశారు. స్థానిక యూనియన్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ మునిగిపోయే నావలా మారిపోయిందని, రక్షించే నాధుడే కరువయ్యారని అన్నారు.

07/29/2016 - 06:54

ఖమ్మం, జూలై 28: ఎంసెట్ మెడికల్ పరీక్షలో పేపర్ లీకేజ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తుండగా, అందులో ఖమ్మం జిల్లాకు చెందిన వారు కూడా ఉన్నారనే ప్రచారం ఊపందుకుంది. జిల్లాకు చెందిన ఏడుగురు విద్యార్థులకు లీకేజ్ వ్యవహారంలో పాత్ర ఉన్నదని ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి.

07/29/2016 - 06:54

ఖానాపురం హవేలి, జూలై 28: ప్రతి ఒక్కరికి గోమాత ద్వారానే సుఖ సౌఖ్యాలు లభిస్తాయని గోప్రచారకుడు, శ్రీ హహివరాహ ట్రస్ట్ కార్యదర్శి కుందుర్తి మహికిరణ్‌శర్మ అన్నారు. గురువారం గాయత్రి దేవాలయం వద్ద జరిగే గో - వృషభ కల్యాణానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

07/29/2016 - 06:53

సత్తుపల్లి, జూలై 28 : సమాజంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఆశాకార్యకర్తలు అందిస్తున్న సేవలను ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలని సత్తుపల్లి క్లస్టర్ ఆఫీసర్ డాక్టర్ ఎల్.్భస్కర్‌నాయక్ అన్నారు. సత్తుపల్లిలోని శ్రీలక్ష్మీప్రసన్న ఫంక్షన్‌హాల్‌లో సత్తుపల్లి, వేంసూరు, దమ్మపేట మండలాల స్థాయిలో గురువారం క్లస్టర్ ఆఫీర్ డాక్టర్ ఎల్.

Pages