S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/29/2016 - 04:36

గచ్చిబౌలి, జూలై 28: వాతావరణంలో మార్పుల సమస్య మనదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలను పీడిస్తున్న సమస్యగా మారిందని యుఎస్‌ఎఇపి మాజీ డైరక్టర్ ఎస్.సుబ్రమణ్యన్ అన్నారు. గచ్చిబౌలి ఇంజనీరింగ్ స్ట్ఫా కాలేజీలో జరిగిన క్లైమేట్ ఛేంజ్ ఛాలెంజెస్ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు.

07/29/2016 - 04:34

మహబూబ్‌నగర్, జూలై 28: పుష్కరాల సమయం దగ్గర పడుతుండడంతో జిల్లాలో హడావిడి ఎక్కువైంది. జిల్లాలో 32 కృష్ణా పుష్కరాల మేజర్ ఘాట్లు, మరో 20 మైనర్ ఘాట్లుగా అధికారులు గుర్తించారు. జిల్లాలో పుష్కరాల పనులకు జిల్లా అధికార యంత్రాంగం దాదాపు రూ.426 కోట్లకు ప్రతిపాదనలు పంపడంతో ప్రభుత్వం రూ.270.21 కోట్లు మంజూరు చేసింది. అయితే పుష్కర ఘాట్ల పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి.

07/29/2016 - 04:31

హైదరాబాద్, జూలై 28: కృష్ణా పుష్కరాల్లో పాల్గొనవలసిందిగా దేవనాత రామానుజ చిన్న జీయర్ స్వామిని తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించింది. కృష్ణా పుష్కరాల ఆహ్వాన కమిటీ చైర్మన్, ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లోని ఆశ్రమంలో గురువారం ఆయనను కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు. జీయర్ స్వామి ఆధ్వర్యంలో బీచ్‌పల్లి పుష్కర ఘాట్ వద్ద యజ్ఞం చేసేందుకు ఏర్పాటు చేయాలని రమణాచారి కోరారు.

07/29/2016 - 04:29

హైదరాబాద్, జూలై 28: విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్‌లర్ల నియామకాలను హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో మంత్రులు, న్యాయ నిపుణులు, సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు శుక్రవారం సమావేశం కానున్నారు. వైస్ ఛాన్స్‌లర్ల నియామకంపై హైకోర్టు నుంచి ఎదురైన చుక్కెదురును ఏవిధంగా అధిగమించాలనే అంశంపై ఈ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది.

07/29/2016 - 04:28

నల్లగొండ, జూలై 28: జంటనగరాల్లో కురిసిన భారీ వర్షాలతో నల్లగొండ జిల్లాలోని కేతేపల్లి మూసీ ప్రాజెక్టులో నీటిమట్టం పెరిగి జలకళతో కనువిందు చేస్తోంది. ఇదే సమయంలో డిండి ప్రాజెక్టుకు జిల్లా పరిధిలో సరైన వర్షాలు లేక ఎలాంటి వరద నీటి ప్రవాహం చేరకపోవడంతో అడుగంటి నెర్రెలు బారి పూర్తిగా ఎండిపోయి కనిపిస్తోంది. మూసీ ప్రాజెక్టు నీటినిల్వ సామర్ధ్యం 645 అడుగులుకాగా ప్రస్తుతం 628 అడుగులకు చేరింది.

07/29/2016 - 04:27

గద్వాల, జూలై 28: ఎగువ ప్రాంతంలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుండి వస్తున్న వరద నీటితో జూరాల పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకొని కళకళలాడుతోంది. గురువారం సాయంత్రం నాటికి జూరాల జలాశయంలో 318.34 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉండగా, దిగువకు 44,265 క్యూసెక్కులను విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

07/29/2016 - 04:25

సిద్దిపేట, జూలై 28: మల్లన్నసాగర్ రిజర్యాయర్ నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన రైతులకు రుణం ఏమిచ్చినా తీర్చుకోలేనిదని, వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నానని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.

07/29/2016 - 04:11

న్యూఢిల్లీ, జూలై 28: భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీపై డ్రోన్‌లతో దాడి చేయడానికి ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారా? తాజాగా వెలుగుచూస్తున్న నిఘా వర్గాల సమాచారాన్ని బట్టి లష్కరె తొయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలు ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని దాడి చేయడానికి కుట్ర పన్నుతున్నట్టుగా తెలుస్తోంది.

07/29/2016 - 04:06

కోల్‌కతా, జూలై 28: గిరిజనులు, ఇతర అణగారిన వర్గాల హక్కుల కోసం అహరహం పోరాడి తన రచనల ద్వారా వారి జీవితాల్లో వెలుగు నింపిన ప్రఖ్యాత రచయిత్రి, సామాజిక కార్యకర్త మహాశే్వతాదేవి (91) గురువారం తుదిశ్వాస విడిచారు.

07/29/2016 - 04:03

న్యూఢిల్లీ, జూలై 28: దేశంలో పప్పుల ధరలు విపరీతంగా పెరగడంపై ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. లోక్‌సభలో గురువారం ధరల పెరుగుదలపై జరిగిన చర్చలో రాహుల్ గాంధీ పాల్గొంటూ ‘మీరు ఎన్ని కావాలనుకుంటే అన్ని శుష్క వాగ్దానాలు చేయవచ్చు. కాని, పప్పుల ధరలు ఎప్పటివరకు తగ్గుతాయో ఖచ్చితమైన తేదీని చెప్పండి’ అని ప్రధాని మోదీని నిలదీశారు.

Pages