S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/29/2016 - 05:03

చెన్నై, జూలై 28: దేశ వ్యాప్తంగా 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు శుక్రవారం నిర్వహించ తలపెట్టిన సమ్మె యథాతథంగా జరుగనుంది. సమ్మెకు పిలుపునిచ్చిన యూనియన్ల ఐక్య వేదిక (యుఎఫ్‌బిఎ)తో పాటు ఐబిఎ (ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్)కి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య మంగళవారం జరిగిన రాజీ సమావేశం విఫలమవడంతో ఈ సమ్మె యథాతథంగా జరుగుతుందని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఎఐబిఇఎ) ముఖ్య నాయకుడు ఒకరు తెలిపారు.

07/29/2016 - 05:03

న్యూఢిల్లీ, జూలై 28: బయటి పరిణామాల ప్రభావాలకు లోనుకావడాన్ని తగ్గించుకోవడానికి, అలాగే పెట్టుబడుల అవకాశాలను మెరుగుపర్చుకోవడానికి ప్రభుత్వం జిఎస్‌టి బిల్లును ఆమోదించడం, సబ్సిడీలకు సంబంధించి మరిన్ని సంస్కరణలు చేపట్టడం లాంటి వాటితో సహా ఆర్థిక స్థిరీకరణ చర్యలను కొనసాగించాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) ఒక నివేదికలో అభిప్రాయ పడింది.

07/29/2016 - 05:02

న్యూఢిల్లీ, జూలై 28: రెవిన్యూ డిపార్ట్‌మెంట్ జారీ చేసిన ఆదేశాలకు వ్యతిరేకంగా ఆదాయం పన్ను శాఖకు చెందిన కొంతమంది అధికారులు ఒక తీర్మానాన్ని ఆమోదించడాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ తీవ్రంగా పరిగణిస్తూ,క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

07/29/2016 - 05:01

చౌటుప్పల్, జూలై 28: నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామ శివారులో 8.12 ఎకరాల స్థలంలో విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేస్తున్న వెహికిల్ ఫిట్‌నెస్ సెంటర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో వినియోగంలోకి తీసుకువచ్చేందుకు సంబంధిత అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కార్యాలయం, టెస్టింగ్ సెంటర్ పనులు పూర్తి కావచ్చాయి.

07/29/2016 - 04:53

మేడ్చల్, జూలై 28: ఎంసెట్-2 పేపర్ లీకేజీ వ్యవహారాన్ని నిరసిస్తూ మండల బిజెపి శ్రేణులు గురువారం మేడ్చల్ హైవే బస్‌స్టేషన్ సమీపంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం ప్రభుత్వ చేతగాని తననానికి నిదర్శమని దుయ్యబట్టారు.

07/29/2016 - 04:52

రతాబాద్, జూలై 28: ఎంసెట్ -2 రద్దు చేయవద్దంటూ విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు తెలంగాణ సచివాలయం ముందు ఆందోళన దిగారు. గురువారం మధ్యాహ్నం సెక్రెటరియేట్ వద్దకు చేరుకొని తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఎవరో చేసిన తప్పుకు తమను బలిచేస్తారా, లీకేజీకి కారణం ఒకరైతే తమ పిల్లల భవిష్యత్‌ను పాడుచేస్తారా అంటూ నినాదాలు చేశారు.

07/29/2016 - 04:51

మేడ్చల్, జూలై 28: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం ఎంతో చారిత్రాత్మకమైనదని దీనిలో ప్రజాప్రతినిధులు ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములై విజయవంతం చేయాలని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి కోరారు.

07/29/2016 - 04:49

శంషాబాద్, జూలై 28: శంషాబాద్ ఎయిర్‌ఫోర్ట్‌లో గురువారం మిస్టర్ వరల్డ్ రోహిత్ కండేల్‌వాల్‌కు ఘన స్వాగతం లభించింది. లండన్‌లో జరిగిన పోటీల్లో మిస్టర్ వరల్డ్‌గా గెలుపొందిన రోహిత్ విమానాశ్రయానికి వచ్చా రు. ఎయిర్ పోర్ట్‌లో నుంచి బయటకు రాగానే అభిమానులు హర్షం ప్రకటిస్తూ వచ్చి బొకేలతో సన్మానించారు.

07/29/2016 - 04:48

హైదరాబాద్, జూలై 28: ఆషాఢ మాసపు బోనాల జాతరను ప్రజలెంత ఘనంగా పండగను జరుపుకుంటారన్న మాట దేవుడెరుగు గానీ పండుగ పనుల కోసం కార్పొరేటర్లు మాత్రం పోటీ పడుతున్నారు. ఇదే అదునుగా పనిలో పని అన్నట్టు కొందరు మహానగర పాలక సంస్థ అధికారులు కూడా పనులు చేజిక్కించుకునేందుకు బినామీల అవతారమెత్తారు.

07/29/2016 - 04:47

హైదరాబాద్, జూలై 28: రంగారెడ్డి జిల్లాలోని 9 నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల్లో సిసి రోడ్ల నిర్మాణానికి 41.36 కోట్ల ఉపాధి హామీ, సిడిపి నిధులు ఖర్చు చేయనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి తెలిపారు. గురువారం సచివాలయంలో ఉపాధి హామీ నిధులతో సి.సి. రోడ్ల నిర్మాణాలకు సంబంధించి జిల్లాకు చెందిన శాసనసభ్యులు, ఇంజనీరింగ్ అధికారులతో మంత్రి సమీక్షించారు.

Pages