‘బి’ శాంపిల్‌లోనూ ఇందర్జీత్ దోషే!
Published Friday, 29 July 2016న్యూఢిల్లీ, జూలై 28: నర్సింగ్ యాదవ్ మాదిరిగానే డోపింగ్ పరీక్షలో విఫలమైన షాట్‌పుటర్ ఇందర్జిత్ సింగ్ రెండో పరీక్షలోనూ దోషిగానే తేలాడు. ‘బి’ శాంపిల్‌లోనూ అతను నిషిద్ధ మాదక ద్రవ్యాన్ని వాడినట్టు రుజువైంది. దీనితో రియో ఒలింపిక్స్‌లో అతను పాల్గొనే అవకాశాలకు గండిపడింది.
చిత్రం.. ఇందర్జీత్ సింగ్