S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

త్వరలో వినియోగంలోకి వెహికిల్ ఫిట్‌నెస్ సెంటర్

చౌటుప్పల్, జూలై 28: నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామ శివారులో 8.12 ఎకరాల స్థలంలో విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేస్తున్న వెహికిల్ ఫిట్‌నెస్ సెంటర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో వినియోగంలోకి తీసుకువచ్చేందుకు సంబంధిత అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కార్యాలయం, టెస్టింగ్ సెంటర్ పనులు పూర్తి కావచ్చాయి. మొదటి రెండేళ్లు పూణెలోని ఎఆర్‌ఎఐ సంస్థకు నిర్వహణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. స్పెయిన్ నుంచి మిషన్‌లు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మిషన్‌లు ఏర్పాటు చేసిన వెంటనే వినియోగంలోకి తీసుకువచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కాలం చెల్లిన వాహనాలకు స్వస్తి చెప్పి రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం వెహికిల్ ఫిట్‌నెస్ సెంటర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. విదేశీ పరిజ్ఞానంతో వాహనాల సామర్థ్యాన్ని గుర్తించేందుకు యంత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. దేశంలో ఆరు రాష్ట్రాలలో వెహికిల్ ఫిట్‌నెస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న వెహికిల్ పిట్‌నెస్ సెంటర్‌ను రాష్ట్ర రాజధాని సమీపంలోని దండుమల్కాపురం గ్రామ శివారులో ఏర్పాటు చేస్తున్నారు. 65వ నెంబర్ జాతీయ రహదారి పక్కన 8.12 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించి గత యేడాది జూన్ 10న రోడ్డు రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, జిల్లా మంత్రి జగదీశ్వర్‌రెడ్డిలు ప్రారంభించారు. వెహికిల్ పిట్‌నెస్ సెంటర్ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పూర్తిచేసేందుకు కృషి చేస్తున్నారు. పరిపాలన భవనం, సెక్యూరిటీ భవనం పూర్తి జరిగింది. టెస్టింగ్ సెంటర్ షెడ్ పనులు పూర్తి జరిగాయి. యంత్రాల ఏర్పాటుకు పునాధులు వేశారు. పెద్ద వాహనాలకు రెండు లేన్లు, చిన్న వాహనాలకు రెండు లేన్లు ఏర్పాటు చేశారు. మానవ సంబంధం లేకుండా కంప్యూటరీకరణ ద్వారా వాహనాల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు స్పెయిన్ నుంచి యంత్రాలను దిగుమతి చేసుకుంటున్నారు. దీని ద్వారా రోజుకు నాలుగు వందల వాహనాలను తనిఖీ చేసే అవకాశం ఉంటుంది. ఫిట్‌నెస్ లేని వాహనాలను తిరిగి పంపించనున్నారు. వాహనాలను రిపేర్ చేసేందుకు పది కిలోమీటర్ల దూరంలో 25 గ్యారేజీలను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించనున్నారు. ఇప్పటికే మహారాష్టల్రోని నాసిక్‌లో, ఢిల్లీలోని రోథక్‌లో కూడా వినియోగంలోకి వచ్చింది. త్వరలో రాష్ట్రంలోని దండుమల్కాపురంలో వినియోగంలోకి తెచ్చేందుకు రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానీయా ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో స్పెయిన్ నుంచి మిషన్‌లను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

చిత్రం.. నిర్మాణం పూర్తయన వెహికిల్ ఫిట్‌నెస్ సెంటర్ షెడ్