S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/29/2016 - 03:56

కోల్‌కతా, జూలై 28: పీడిత జనులకోసం ఆమె అహరహం పరితపించారు. వారి హక్కులకోసం వారి గొంతై నినదించారు. మహాశే్వతాదేవి ప్రఖ్యాత రచయిత్రి 90 ఏళ్ల వయసులో గురువారం కన్నుమూసేదాకా ఆమె అణగారిన వర్గాల కోసమే పరితపించారు. సాహిత్య ప్రపంచంలో ఆమె సృజన అంతా వారికోసమే సాగింది. పద్మవిభూషణ్, రామన్ మెగసెసే, జ్ఞానపీఠ, సాహిత్య అకాడమీ అవార్డులు ఎన్నో ఆమెను అలంకరించాయి.

07/29/2016 - 03:52

న్యూఢిల్లీ, జూలై 28: పరువు నష్టం కేసులను ప్రభుత్వాలను విమర్శించే వారిపై రాజకీయ ఆయుధాలుగా ఉపయోగించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు, తమిళనాడు ముఖ్యమంత్రి జయలిలత దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో డిఎండికె అధ్యక్షుడు, తమిళనటుడు విజయకాంత్, ఆయన భార్యపై జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్లను నిలుపుదల చేసింది.

07/29/2016 - 03:51

న్యూఢిల్లీ, జూలై 28: నరేంద్ర మోదీ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా పరిగణిస్తున్న జిఎస్‌టి బిల్లుపై అధికార, విపక్షాల మధ్య సదవగాహన ప్రయత్నాలు చురుగ్గా సాగుతున్నాయి. ఈ బిల్లుపై ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రభుత్వం చేపడుతున్న ప్రయత్నాలు ముమ్మరమయ్యాయని చెప్పడానికి గురువారం రాజ్యసభ సాగిన తీరే నిదర్శనం.

07/29/2016 - 03:51

ఇస్లామాబాద్, జూలై 28: కాశ్మీర్ అల్లర్ల వెనుక భారత్ చేస్తున్న వాదనే నిజమైంది. అదే నిజమంటూ పాక్ ఉగ్రవాద సంస్థ జమాతే ఉద్ దవా అధినేత హఫీజ్ సరుూద్ కూడా ధ్రువీకరించాడు! ఈ సంచలన ప్రకటన ద్వారా ఏకంగా నవాజ్ షరీఫ్‌ను ఇరకాటంలో పడేశాడు.

07/29/2016 - 03:49

న్యూఢిల్లీ, జూలై 28: చెన్నై నుంచి పోర్టుబ్లెయిర్ వెళ్తూ అదృశ్యమైన వైమానిక దళ విమానం ఎఎన్-32 ఆచూకీ ఇంకా లభించలేదు. విమానాలు, నౌకలు, జలాంతర్గాములు అహోరాత్రులు గాలిస్తున్నా ఆచూకీ దొరకలేదని కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ గురువారం లోక్‌సభలో వెల్లడించారు. ఈ నెల 22న ఎఎన్-32 విమానం గల్లంతయింది. రక్షణ మంత్రి పారికర్ లోక్‌సభలో విమానం అదృశ్యంపై తనంతట తానుగా ఓ ప్రకటన చేశారు.

07/29/2016 - 03:24

హైదరాబాద్: ఇప్పటికే మూడుసార్లు పరీక్ష రాశా. ఎంతో కష్టపడి ఈ ర్యాంకును సాధించుకున్నా, మళ్లీ రాసే ఓపిక లేదు. లీకు వల్ల లబ్ధి పొందిన వారిని తొలగించి మిగిలిన వారికి కౌనె్సలింగ్ నిర్వహిస్తే సరిపోతుంది. కానీ తప్పు చేసిన వారితో మమ్మల్ని కలిపి మళ్లీ పరీక్ష రాయాలనటం ఎంతవరకు న్యాయం? ఇందులో ర్యాంకు సాధిస్తానన్న ధీమాతో నీట్ కూడా రాయలేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి?
- టి హేమసుధ (26వ ర్యాంకర్)

07/29/2016 - 03:22

హైదరాబాద్, జూలై 28: తెలంగాణ ఎంసెట్-2ను రద్దుచేయవద్దన్న నినాదాలతో రాష్ట్ర సచివాలయం దద్దరిల్లిపోయింది. ఎంసెట్-2ను రద్దు చేస్తారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో సచివాలయం ఎదుట ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రెండోరోజైన గురువారం కూడా పెద్దఎత్తున ధర్నా చేశారు.

07/29/2016 - 03:15

ఆదిలాబాద్/ కరీంనగర్ /వరంగల్, జూలై 28: ఎమ్సెట్ లీకేజీ బాగోతం ఉత్తర తెలంగాణను కుదిపేసింది. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో సిఐడి బృందాలు గురువారం జరిపిన తనిఖీలు ప్రకంపనలు సృష్టించాయి. లీకేజీని అడ్డుపెట్టుకుని ర్యాంకులు పొందిన విద్యార్థుల వివరాలను బట్టబయలు చేసేందుకు సిఐడి బృందాలు అన్ని కోణాల్లోనూ ముమ్మర దర్యాప్తు జరుపుతున్నాయి.

07/29/2016 - 03:14

వరంగల్, జూలై 28: ‘ఎవరో చేసిన తప్పుకు మమ్మల్ని బలిచేయకండి. తాము కష్టపడి చదువుకొని ర్యాం కులు సాధించుకున్నాం. ఇప్పటికే రెండుసార్లు ఎంసెట్ రాశాం’ అంటూ ఎంసెట్-2లో మెడిసిన్‌కు ఎంపికైన విద్యార్థినీ, విద్యార్థులు గురువారం వరంగల్‌లో డిప్యూటీ సిఎం కడియం శ్రీహరిని కలిసి వేడుకున్నారు.

07/29/2016 - 03:12

వరంగల్, జూలై 28: ఎంసెట్-2 లీక్‌పై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి అన్నారు. గురువారం వరంగల్‌లో విలేఖరులతో మాట్లాడుతూ ఎంసెట్-2 లీక్‌పై సిఐడిచే విచారణ జరిపిస్తున్నందున ఈ విషయంపై తానేమీ మాట్లాడినా తప్పుడు సంకేతం వెళ్తుందని.. సిఐడి నివేదిక అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎంసెట్-2 లీక్‌పై రాద్ధాంతం అనవసరమన్నారు.

Pages