S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కాసుల పండగ!

హైదరాబాద్, జూలై 28: ఆషాఢ మాసపు బోనాల జాతరను ప్రజలెంత ఘనంగా పండగను జరుపుకుంటారన్న మాట దేవుడెరుగు గానీ పండుగ పనుల కోసం కార్పొరేటర్లు మాత్రం పోటీ పడుతున్నారు. ఇదే అదునుగా పనిలో పని అన్నట్టు కొందరు మహానగర పాలక సంస్థ అధికారులు కూడా పనులు చేజిక్కించుకునేందుకు బినామీల అవతారమెత్తారు.
ఇప్పటికే రాష్ట్ర పండుగగా గుర్తించిన బోనాల ఏర్పాట్ల కోసం ప్రభుత్వం రూ. 10 కోట్లను మంజూరు చేసిన సంగతి తెల్సిందే! ఈ నిధులతో ముఖ్యంగా దేవాలయాల ఆవరణల్లో వౌలిక వసతులు కల్పించటం, దేవాలయానికి చేరుకునే రహదార్లలో మరమ్మతులు, పారిశుద్ధ్యం పనులు వంటివి చేపట్టాల్సి ఉన్నాయి. ఈ పనులన్నీ యుద్దప్రాతిపదికన ప్రారంభించి, పండుగుకు ముందే పూర్తి చేయాల్సి ఉన్నందున, అధికారులు నామినేషన్ ప్రాతిపదికన పనులు కేటాయిస్తున్నారు. ఇదే అదునుగా కొందరు కార్పొరేటర్లు, అలాగే వారితో మిలాఖత్ అయిన అధికారులే తమ బినామీలకు ఈ పనులు దక్కించుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. గత సంవత్సరం కూడా ఇదే తరహాలో బోనాల పండుగకు భారీ ఏర్పాట్లు చేపట్టాలని సర్కారు ఆదేశాలు జారీ చేసినా, కాస్త ముందుగా పనుల ఖరారు చేయని అధికారులు పండుగకు ఒకటి రెండు రోజుల ముందు అప్పగించటంతో కాంట్రాక్టర్లు పలు చోట్ల పనులను అసంపూర్తిగా వదిలేసినా, బిల్లులు మాత్రం మొత్తం చెల్లించారు. దేవాలయాల ఆవరణలో షాబాద్ బండలు వేయటం, దేవాలయానికి చేరుకునే రోడ్లలో బిటి మరమ్మతులు, వీది ధీపాల ఏర్పాటు వంటి పనులు చేపట్టాల్సి ఉంది. కానీ పాతబస్తీతో పాటు న్యూ సిటీలోని పలు దేవాలయాల వద్ధ బోనాల పండుగ కోసం వేసిన బండలు పండుగరోజే పగిలిపోవటం, సరిగ్గా అతుక్కోకపోవటం వంటి లోపాలు తలెత్తాయి. అలాగే బిటి మరమ్మతులు కూడా చిన్నపాటి వర్షం కురిస్తే కొట్టుకుపోతున్నాయి. అయినా కాంట్రాక్టర్లకు ఎలాంటి కోతల్లేకుండా బిల్లులు చెల్లిస్తున్నారు. ప్రతి సంవత్సరం బోనాల పండుగ ఏర్పాట్ల పనులు కొందరు బల్దియా అధికారులు, మరికొందరు కార్పొరేటర్లకు కాసుల పండుగా తయారయ్యాయే తప్పా, ఇప్పటి వరకు పండుగ సందర్భంగా ఏ మందిరం వద్ధ కూడా పూర్తి స్థాయిలో పకడ్బందీగా, ప్రజలకు, భక్తులకు ఉపయోగపడే విధంగా నాణ్యతతో కూడిన పనులు చేపట్టలేదని పలు దేవాలయాల కమిటీ సభ్యులే వాదిస్తున్నారు. ముఖ్యంగా కోర్‌సిటీలోని సికిందరాబాద్, గోల్కొండ, లంగర్‌హౌజ్, కార్వాన్‌లతో పాటు పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో దేవాలయాలను క్యాటగిరీల వారీగా విభజించి నిధులు కేటాయించాల్సి ఉంది. కానీ పండుగకు ఇంకా రెండు రోజుల గడువు మాత్రమే ఉన్నా, నేటికీ అతీగతీలేదు. పాతబస్తీలోని గౌలీపురా, అలియాబాద్, మొఘల్‌పురా, ఉప్పుగూడ తలాబ్‌కట్టా డివిజన్లలో పనుల కేటాయింపు విషయంలో స్థానిక కార్పొరేటర్లు, అధికారుల మధ్య వివాదాలు చోటుచేసుకుంటున్నట్లు తెలిసింది.