S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/28/2016 - 05:51

గుంటూరు, జూలై 27: కావేరి సీడ్స్‌పై వచ్చిన ఆరోపణలు నిజమైతే కేసులు తప్పవని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. ఇప్పటివరకు నాసిరకం విత్తనాలపై సంస్థ యాజమాన్యం స్పందించక పోవడంతో అనుమానాలు బలపడుతున్నాయన్నారు.

07/28/2016 - 05:44

హైదరాబాద్, జూలై 27: భీమా ప్రాజెక్టు ట్రయల్ నిర్వహించడానికి వెళ్లిన ఇంజనీరింగ్ అధికారులపై దాడి చేసిన టిడిపి, బిజెపి నాయకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ జలసౌధ ఎదుట టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ సహా టిఎన్‌జివో నేతలు, తెలంగాణ ఇంజనీర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు బుధవారం ధర్నా చేశారు.

07/28/2016 - 05:41

హైదరాబాద్, జూలై 27: తెలంగాణ రాష్ట్ర ఎంసెట్-2 లీకేజీ అయినట్లు సిఐడి దాదాపు నిర్ధారణకు వచ్చినందున విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నందున ప్రభుత్వం వెంటనే మళ్లీ నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్, బిజెపి, ఎబివిపి, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు బుధవారం వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశారు.

07/28/2016 - 05:41

హైదరాబాద్, జూలై 27: తెలంగాణ ఎమ్సెట్-1 కూడా లీకైందా? ఎమ్సెట్-2లో నిందితుడిగా అనుమానించి అదుపులోకి తీసుకున్న రాజ్‌గోపాల్ రెడ్డిని సిఐడి పోలీసులు విచారించినప్పుడు ఈ విషయం బహిర్గతమైనట్లు తెలిసింది. ఇదే నిజమైతే సిఐడి దర్యాప్తు మరికొన్నిరోజులు సాగే అవకాశం ఉంది. సిఐడి పోలీసులు ఈ విషయమై మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు.

07/28/2016 - 05:40

హైదరాబాద్, జూలై 27: ఇద్దరు చంద్రుల ఆశలు ఆవిరయ్యాయి. నియోజకవర్గ పునర్విభజనపై గంపెడాశలు పెట్టుకున్న ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరావు భవిష్యత్తు రాజకీయ వ్యూహాన్ని కేంద్రం దెబ్బతీసింది.

07/28/2016 - 05:33

రామేశ్వరం, జూలై 27: తమిళనాడులోని రామేశ్వరం దశ తిరగనుంది. మాజీ రాష్టప్రతి డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం జన్మించిన ఈ చిన్నపట్టణాన్ని ‘అమృత్’ పథకం కింద అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. భారతరత్న కలాం ప్రథమ వర్థంతి సందర్భంగా బుధవారం ఇక్కడ ఏర్పాటైన ఓ కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం వెంకయ్యనాయుడు ఈ మేరకు ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ మాజీ రాష్టప్రతి కలాంకు ఘన నివాళులర్పించారు.

07/28/2016 - 05:31

న్యూఢిల్లీ, జూలై 27: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఇక్కడ జరుగనున్న నీతి ఆయోగ్ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. దేశ సమగ్రాభివృద్ధిని వేగవంతం చేయడానికి 15 ఏళ్ల విజన్ డాక్యుమెంట్‌కు పటిష్ఠమైన రూపాన్ని ఇవ్వడానికి ఈ సమావేశం జరుగుతోంది. ‘ఈ సమావేశంలో నీతి ఆయోగ్.. విజన్ డాక్యుమెంట్‌పై ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని ప్రధానమంత్రికి వివరిస్తుంది’ అని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

07/28/2016 - 05:30

న్యూఢిల్లీ, జూలై 27: ప్రైవేట్ పరువునష్టం ఫిర్యాదును విచారించాలని మెజిస్ట్రేట్‌లు పోలీసులను ఆదేశించలేరని సుప్రీం కోర్టు బుధవారం స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై దాఖలైన ప్రైవేట్ క్రిమినల్ పరువునష్టం కేసులో సుప్రీం కోర్టు విచారణ జరిపింది.

07/28/2016 - 05:30

శ్రీనగర్, జూలై 27: జమ్మూ, కాశ్మీర్‌లో మంగళవారం భీకర ఎన్‌కౌంటర్ తర్వాత భద్రతా దళాలు ప్రాణాలతో పట్టుకున్న టెర్రరిస్టు పాకిస్తాన్ జాతీయుడని హోం మంత్రిత్వ శాఖ వర్గాలు తెలియజేశాయి. అతనిని పాకిస్తాన్‌లోని లాహోర్ నగరానికి చెందిన బహదూర్ అలీగా గుర్తించినట్లు హోం శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ అహిర్ కూడా చెప్పారు.

07/28/2016 - 05:29

న్యూఢిల్లీ/ లండన్, జూలై 27: భారత్, బ్రిటన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావాలని, ఇరు దేశాలు మరింత సన్నిహితం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వాణిజ్యం, రక్షణ రంగాలుసహా వివిధ రంగాలలో ఇరు దేశాల మధ్య సంబంధాలు పటిష్ఠం కావాలని ఆయన బ్రిటన్ కొత్త ప్రధానమంత్రి థెరిసా మేకు సూచించారు.

Pages