S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/28/2016 - 12:08

ముంబై: దేశీయ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభయ్యాయి. సెన్సెక్స్ 28,108 పాయింట్ల వద్ద నిఫ్టీ 8,636 వద్ద స్టార్ట్ అయ్యాయి. ఆసియా మార్కెట్లు నెగిటివ్ గా ఉన్నాయి. జూన్ త్రైమాసికంలో11 శాతం వాల్యూమ్ వృద్ధి సాధించిన ఏషియన్ పెయింట్స్ భారీగా లాభపడుతుండగా బుధవారం ఫలితాలను ప్రకటించిన భారతి ఎయిర్ టెల్, మారుతి సుజుకి కూడా లాభాలనార్జిస్తున్నాయి.

07/28/2016 - 12:06

హైదరాబాద్ : నిమ్స్ ఆసుపత్రిలో రూ. 10 కోట్ల టెండర్లలో రూ. 3.14 కోట్ల మేర అవినీతి జరిగిందని ఏసీబీ తెలిపింది. నిమ్స్ ఆసుపత్రిలో పరికరాల కొనుగోలు అవకతవకలపై ఏసీబీ గురువారం చార్జ్షీట్ దాఖలు చేసింది. నిమ్స్ మాజీ డైరెక్టర్ ధర్మరక్షక్ అవినీతికి పాల్పడ్డారని, ఆసుపత్రి వైద్యులు ముకుందరెడ్డి, సూర్యప్రకాశ్రెడ్డి, వికాస్ కన్నా పేర్లను కూడా చార్జ్షీటులో ఏసీబీ చేర్చింది.

07/28/2016 - 06:10

ఆదోని/పత్తికొండ: కర్నూలు జిల్లాలో మంగళవారం రాత్రి భారీ వర్షాలకు కురిశాయి. దీంతో పలుచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఆదోని డివిజన్‌లోని హంద్రీనది పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో హంద్రీ పొంగిపొర్లింది. చిన్నహుల్తి వద్ద బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు స్తంభించాయి. దీంతో వాహనాలను దారి మళ్లించారు. పత్తికొండ మండలంలోని నల్లవాగు, సీతూరు వంక ఉద్ధృతంగా ప్రవహించాయి.

07/28/2016 - 06:05

హైదరాబాద్, జూలై 27: ప్రభుత్వం విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నదని టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ విమర్శించారు. అందుకే ప్రైవేటు పాఠశాలల్లో భారీగా అడ్మిషన్లు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం బుధవారం ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించింది. సంఘం అధ్యక్ష్య, కార్యదర్శులు బి. భుజంగరావు, జి.

07/28/2016 - 06:04

హైదరాబాద్, జూలై 27: ఆర్టీసీ అంటేనే నష్టాల బండి. దేశంలో అత్యధిక మందిని గమ్యస్థానాలకు చేరవేస్తున్న ప్రభుత్వ సంస్థగా రికార్డు సాధించిన ఏపిఎస్ ఆర్టీసీ, ఇప్పుడు గతులకుల బాట నుంచి సరైన దిశలో బతుకు బాటవైపు పయనించడం అటు యాజమాన్యానికి, ఇటు ప్రయాణికులకు ఊరట కలిగిస్తోంది.

07/28/2016 - 06:03

హైదరాబాద్, జూలై 27: రెండోసారీ రాయలసీమలో స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు నిర్వహించడంద్వారా ఆ ప్రాంతంలో తన ప్రభుత్వంపై సీమ వస్తున్న అసంతృప్తిని తొలగించే ఎత్తుగడకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు.

07/28/2016 - 05:57

విజయవాడ, జూలై 27: ఇన్నాళ్లూ ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమైన డ్వాక్రా సంఘాల ఉత్పత్తులు ఇకపై రాష్ట్రాలు, దేశాల సరిహద్దులు దాటి వెళ్లబోతున్నాయి. డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయి మార్కెట్ కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న యత్నాలు ఓ కొలిక్కి వస్తున్నాయి.ఈ కామర్స్ వెబ్‌సైట్లతో ఆన్‌లైన్ వ్యాపారం విస్తరించాక, ప్రపంచంలోని ఏ మూలన ఉండే ఉత్పత్తులైనా..

07/28/2016 - 05:54

గజ్వేల్, జూలై 27: మల్లన్నసాగర్ ముంపు గ్రామమైన మెదక్ జిల్లా పల్లెపహాడ్ రైతులు మంత్రి హరీష్‌రావుతో బుధవారం గజ్వేల్‌లో జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. పట్టణంలోని మల్లారెడ్డి గార్డెన్స్‌లో మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే రామలింగారెడ్డిలు పల్లెపహడ్ నుండి వచ్చిన రైతులు, ప్రజాప్రతినిధులు, యువకులతో గంటకుపైగా చర్చలు జరిపారు. అయితే రూ.

07/28/2016 - 05:52

నల్లగొండ, జూలై 27: జిల్లాలో ఆగస్టు 12 నుండి 23వరకు కృష్ణా పుష్కరాల నిర్వాహణకు ప్రభుత్వ యంత్రాంగం చేపట్టిన ఏర్పాట్లు ఆలస్యంగా మొదలై హడావుడిగా నాసిరకంగా సాగుతున్నాయి. పుష్కర ఘాట్‌లు, రోడ్ల నిర్మాణ పనులు చూస్తే అవన్ని 19రోజుల వ్యవధిలో పూర్తవ్వడం అసాధ్యంగా కనిపిస్తుంది. ఈ నెల 28వరకే పనులు పూర్తికావాలన్న అధికారుల ఆదేశాలతో పనుల్లో వేగం పెరిగింది కానీ నాణ్యతకు మాత్రం తిలోదకాలిస్తున్నారు.

07/28/2016 - 05:52

విజయవాడ, జూలై 27: ఏపిలో వానలు జోరుగా కురుస్తున్నాయి. ఈసారి ఆశించిన దానికంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతోంది. రాష్ట్రంలో మూడు జిల్లాల మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ సాధారణ వర్షపాతాలు నమోదవ్వడం విశేషం. ఇలాగే వరుణుడు సహకరిస్తే, బంగారు సిరులు కురిపిస్తామంటున్నారు అన్న దాతలు. రాష్ట్రంలో ఉన్న మూడు ప్రాంతాల్లోనూ ఒకట్రెండు జిల్లాలు మినహా భారీ వర్షాలు నమోదయ్యాయి.

Pages