S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/28/2016 - 14:59

ముంబయి: ఓ ప్రయాణికుడు గందరగోళం సృష్టించడంతో గురువారం దుబాయ్‌ నుంచి కోజికోడ్‌ వెళ్తున్న ఇండిగో విమానాన్ని ముంబయి విమానాశ్రయంలో అత్యవసరంగా దించేశారు. ఆ ప్రయాణికుడు అకస్మాత్తుగా విమానసిబ్బందితో అభ్యంతరకరంగా ప్రవర్తించాడని, ఫుడ్‌కార్ట్‌పై దూకి.. దానిపై కూర్చుని నానా బీభత్సం సృష్టించాడని, ప్రయాణికులతో వాగ్వాదానికి దిగినట్లు ఇండిగో పేర్కొంది.

07/28/2016 - 12:24

హైదరాబాద్: నగరంలోని కోఠి వద్ద ఓ ఎలక్ట్రానిక్ దుకాణంలో గురువారం ఉదయం మంటలు వ్యాపించాయి. ఈ అగ్నిప్రమాదంలో సుమారు కోటి రూపాయల విలువ చేసే సీసీ కెమెరా కాలిపోయాయి.

07/28/2016 - 12:24

హైదరాబాద్: శంషాబాద్ సమీపంలోని గగన్‌పహాడ్ వద్ద ఓ ప్రైవేటు స్కూల్‌కు చెందిన వ్యాన్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొంది. గురువారం ఉదయం జరిగిన ఈ ఘటనలో స్కూల్‌వ్యాన్‌లో డ్రైవర్, క్లీనర్ గాయపడ్డారు.

07/28/2016 - 12:23

అనంతపురం: వివిధ ప్రాంతాల్లో బైక్‌లను దొంగిలిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను జిల్లా పోలీసులు ధర్మవరంలో గురువారం అరెస్టు చేశారు. వీరి నుంచి సుమారు 16లక్షల రూపాయలు విలువచేసే 34 బైక్‌లను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు.

07/28/2016 - 12:23

హైదరాబాద్: ఎంసెట్-2 పేపర్ లీక్‌కు సంబంధించి నిందితులపై చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటామని తెలంగాణ విద్యాశాఖామంత్రి కడియం శ్రీహరి గురువారం తెలిపారు. ఈ ఉదంతంపై సిఐడి పోలీసుల విచారణ ఇప్పటికే పూర్తయిందని, మెరిట్ విద్యార్థులకు నష్టం కలగకుండా తగు నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. కాగా, వీసీల నియామకాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించాక తాను స్పందిస్తానని ఆయన అన్నారు.

07/28/2016 - 12:22

దిల్లీ: కాశ్మీర్‌లో అల్లర్ల నేపథ్యంలో భారత్, పాక్‌ల మధ్య మాటల యుద్ధం పెరిగిన వేళ హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్థాన్ వెళుతున్నారు. వచ్చేనెల 3,4 తేదీల్లో ఇస్లామాబాద్‌లో జరిగే సార్క్ దేశాల ప్రతినిధుల సదస్సుకు ఆయన హాజరవుతున్నారు. కాశ్మీర్‌లో ఇటీవల హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వానీని భద్రతాదళాలు హతమార్చిన అనంతరం శాంతిభద్రతలు అదుపుతప్పిన సంగతి తెలిసిందే.

07/28/2016 - 12:22

హైదరాబాద్: 8 విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్సలర్లను నియమిస్తూ రెండు రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ఉమ్మడి హైకోర్టు గురువారం రద్దు చేసింది. వీసీల నియామకాలపై అర్హతలు, నిబంధనలకు సంబంధించి జారీ చేసిన జీవోను నిలుపుదల చేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. అయితే, తెలంగాణ ఎజి రామకృష్ణారెడ్డి అభ్యర్థన మేరకు తీర్పు అమలును నాలుగువారాల పాటు కోర్టు వాయిదా వేసింది.

07/28/2016 - 12:18

హైదరాబాద్: హైకోర్టు విభజన కేసు విచారణను హైకోర్టు డివిజన్ బెంచ్ విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. హైకోర్టు విభజనపై తెలంగాణ ప్రభుత్వ రివ్యూ పిటిషన్పై ఇవాళ విచారణ జరిగింది. హైదరాబాద్లోనే రెండు ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు చేయాలని టీ.సర్కార్ తన పిటిషన్లో కోరింది. కేసును విచారించిన డివిజన్ బెంచ్ విచారణను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు ప్రకటన చేసింది.

07/28/2016 - 12:15

విశాఖపట్నం : విదర్భ నుంచి తెలంగాణ, దక్షిణ కోస్తా మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఆవరించి ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం గురువారం వెల్లడించింది. తెలంగాణ, కోస్తాంధ్రలో చెదురుమదురుగా వర్షాలు పడతాయని, రాయలసీమలో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.

07/28/2016 - 12:10

హైదరాబాద్ : ఎంసెట్ - 2 పేపర్ లీకేజీపై సీఐడీ అదుపులో ఉన్న నిందితుల కాల్ లిస్ట్ ఆధారంగా అధికారులు దర్యాప్తును మమ్మరం చేశారు. నిందితుల కాల్లిస్టులో జేఎన్టీయూ ప్రొఫెసర్ సహా.. మరో ముగ్గురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నెంబర్లు ఉన్నట్లు సీఐడీ అధికారుల దర్యాప్తులో గుర్తించారు. ఎంసెట్ - 2 పేపర్ లీకేజీపై గురువారం ప్రభుత్వానికి సీఐడీ నివేదిక సమర్పించనుంది. సీఐడీ ఇచ్చే నివేదిక ఆధారంగా ఎంసెట్ నిర్వహించాలా?

Pages