S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/28/2016 - 05:28

న్యూఢిల్లీ, జూలై 27: జాతీయ భద్రత, ప్రాదేశిక సమగ్రత విషయంలో రాజీలేదని వీటి పరిరక్షణకు అన్ని చర్యలూ చేపడతామని భారత్ బుధవారం పాకిస్తాన్‌కు విస్పష్టంగా తెలియజేసింది. కాశ్మీర్‌లో రోజుల తరబడి అంశాంతిమయ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పాక్ చర్యలకు చాలా ఘాటుగానే భారత్ ప్రతిస్పందించింది.

07/28/2016 - 05:27

ఫిలడల్ఫియా, జూలై 27: అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో ఇదో సరికొత్త శకం. ఇప్పటి వరకూ ఎన్నడూ లేని విధంగా హిల్లరీ క్లింటన్ దేశాధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వాన్ని చేజిక్కించుకున్నారు. ఈ ఘనత దక్కించుకున్న తొలి మహిళ హిల్లరీ. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వం ఇప్పటికే ఖరారైన నేపథ్యంలో వీరిద్దరి మధ్యే దేశాధ్యక్ష పదవికి తీవ్ర పోటీ జరుగబోతోంది.

07/28/2016 - 05:21

న్యూఢిల్లీ, జూలై 27: కేంద్ర ప్రభుత్వంతో నిత్యం ఘర్షణ పడుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

07/28/2016 - 05:21

న్యూఢిల్లీ, జూలై 27: కేంద్ర ప్రభుత్వం విషయంలో కొన్ని అంశాల్లో అసంతృప్తి ఉన్నట్టు టిడిపి పార్లమెంటరీ పార్టీ నాయకుడు, కేంద్రమంత్రి సుజనా చౌదరి వెల్లడించారు.

07/28/2016 - 05:19

న్యూఢిల్లీ, జూలై 27: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అమలు తీరు, విభజన సమయంలో ఇచ్చిన హామీల అమలుపై గురువారం రెండు గంటలకు రాజ్యసభలో చర్చ జరగనుంది. ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ సభ్యుడు కెవిపీ రామచంద్రరావు ప్రతిపాదించిన ప్రైవేటు బిల్లు విషయంలో ఓటింగ్‌పై సోమ, మంగళవారాలలో కాంగ్రెస్ రాజ్యసభను స్తంభింపజేయడం తెలిసిందే.

07/28/2016 - 05:18

ఔరంగాబాద్, జూలై 27: మహోధృతంగా ప్రారంభమైన స్వచ్ఛ్భారత్ కార్యక్రమం ప్రస్తుతం ఓ సువర్ణావకాశాన్ని కోల్పోయిన చందంగా మారిందని పారిశుధ్య నిపుణుడు గౌరీశంకర్ ఘోష్ తీవ్రస్వరంతో వ్యాఖ్యానించారు. అనుకున్న స్థాయిలో ఇది ముందుకు సాగకపోవడం వల్ల పారిశుధ్య భారత్ ఆవిష్కరణ గాడి తప్పిందని వ్యాఖ్యానించారు.

07/28/2016 - 05:17

చెన్నై, జూలై 27: చెన్నై సమీపంలోని తాంబరం ఎయిర్‌బేస్‌నుంచి పోర్టు బ్లెయిర్‌కు వెళ్తూ ఆరు రోజుల క్రితం బంగాళాఖాతంపై కనిపించకుండా పోయిన వాయుసేన విమానం ఎఎన్-32 కోసం బుధవారం కూడా గాలింపు కొనసాగింది. కాగా, సముద్రంలో కొన్ని శకలాలు కనిపించాయని, అయితే అవి ఎఎన్-32 విమానానికి చెందినవో, కాదో నిర్ధారించాల్సి ఉందని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ రామేశ్వరంలో విలేఖరులతో చెప్పారు.

07/28/2016 - 05:03

శేరిలింగంపల్లి, జూలై 27: ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలను తీసుకోవాలని హఫీజ్‌పేట్ కార్పొరేటర్ వి.పూజిత జగదీశ్వర్‌గౌడ్ అన్నారు. బుధవారం హఫీజ్‌పేట్‌లో స్థానికులకు మొక్కలు పంపిణీ చేశారు. కార్పొరేటర్ పూజిత మాట్లాడుతూ నాటిన మొక్కలను పిల్లల్లా చూసుకుని పెంచి పెద్ద చేయాలన్నారు.

07/28/2016 - 05:01

హైదరాబాద్, జూలై 27: రెవెన్యూ శాఖలో ఉద్యోగుల క్యాస్ట్ వైజ్ వివరాల నివేదికను వారంలోపు పంపాలని, సాదాబైనామ రెగ్యులరైజేషన్‌లను త్వరితగతిన పరిష్కరించాలని భూపరిపాలన ప్రధాన కమీషనర్ రేమండ్ పీటర్ జిల్లా జాయింట్ కలెక్టర్లను ఆదేశించారు.

07/28/2016 - 05:00

హైదరాబాద్ జూలై 27: మహానగరంలో భారతీయ జనతాపార్టీని మరింత బలోపేతం చేసేందుకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేతలు ఈ నెల 31వ తేదీలోపు బూత్ స్థాయి కమిటీల నియామకాలను పూర్తి చేసుకోవాలని బిజెపి శాసనసభ పక్ష నేత జి. కిషన్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Pages