S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/28/2016 - 18:44

లక్నో: యుపి మాజీ సిఎం, బిఎస్‌పి అధినేత్రి మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిజెపి బహిష్కృత నేత దయాశంకర్ సింగ్ అరెస్టు వారంటుపై ‘స్టే’ ఇచ్చేందుకు అలహాబాద్ హైకోర్టు గురువారం నిరాకరించింది. దయాశంకర్ ప్రసుత్తం పరారీలో ఉండగా ఆయన తరఫున హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూనే, ఈ విషయంలో వారంలోగా యుపి ప్రభుత్వం స్పందించాలని కోర్టు స్పష్టం చేసింది.

07/28/2016 - 18:13

విజయవాడ: ప్రజాసాధికార సర్వేను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సర్వే తీరుతెన్నులపై ముఖ్యమంత్రి గురువారం తన నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. సాంకేతిక సమస్యలను అధిగమించి అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సేకరించిన సమాచారం కచ్చితత్వాన్ని సరిచూసుకోవాలన్నారు.

07/28/2016 - 18:09

హైదరాబాద్‌: ఎంసెట్‌-2 పరీక్షను రద్దు చేయొద్దని డిమాండ్‌ చేస్తూ గురువారం విద్యార్థులు, తల్లిదండ్రులు సచివాలయం వద్ద ఆందోళన చేపట్టారు. పరీక్ష రద్దు చేస్తే వూరుకునేది లేదన్నారు. పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తే దానిని సవాల్‌ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నారు. కొందరు స్వార్థపరులు చేసిన తప్పుకు తమను బాధ్యులు చేయడం సరికాదన్నారు.

07/28/2016 - 18:06

హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌-2లో రెండు సెట్ల పేపర్లు లీకయ్యాయని సీఐడీ గురువారం ప్రకటన చేసింది. ‘ హైదరాబాద్‌, ఏపీ, బెంగళూరులో కొందరు బ్రోకర్లను గుర్తించాం. ఇప్పటివరకు విష్ణుధర్‌ అలియాస్‌ విష్ణువర్థన్‌, తిరుమల్‌ అలియాస్‌ తిరుమలరావును అరెస్టు చేశాం. వీరిద్దరూ 25 మంది విద్యార్థులను బెంగళూరుకు తీసుకెళ్లారు. పరీక్షకు 2, 3 రోజుల ముందు ప్రశ్నాపత్రాలు వారికి అందజేశారు.

07/28/2016 - 17:20

హైదరాబాద్‌: ఏపీ ఎంసెట్‌ మెడికల్‌ పేపర్ బహిర్గతం కాలేదని ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ గురువారం వెల్లడించారు. ఆగస్టు 6, 7, 8 తేదీల్లో మెడికల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేసేందుకు వైకాపా ఈ విధంగా దుష్ప్రచారం చేస్తోందన్నారు.

07/28/2016 - 17:15

హైదరాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లాలో నలుగురు, కరీంనగర్‌ జిల్లాల్లో ఇద్దరు విద్యార్థులకు ఎంసెట్‌-2 పేపర్‌ లీకేజీ వ్యవహారంలో సంబంధం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ, తెలంగాణలో ఎంసెట్‌ పరీక్ష రాసిన ఆరుగురు విద్యార్థులకు రెండు రాష్ట్రాల్లో వచ్చిన ర్యాంకుల్లో భారీ తేడాలు ఉండటంతో సీఐడీ దర్యాప్తు విస్తృతం చేసింది. ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లోనూ సీఐడీ విచారణ చేస్తోంది.

07/28/2016 - 17:03

కొలంబియా: సెస్నా310 అనే ప్రైవేట్‌ విమానం ఉత్తర కాలిఫోర్నియాలోని విమానాశ్రయంలో ల్యాండ్‌ అవుతూండగా పక్కకు ఒరిగిపోవడంతో మంటలు వ్యాపించాయని అధికారులు వెల్లడించారు. విమానంలోని నలుగురు ప్రయాణికులు మృతిచెందారు. సిబ్బంది వచ్చి మంటలు అదుపుచేసేలోపే విమానం పూర్తిగా కాలిపోయినట్లు పేర్కొన్నారు.

07/28/2016 - 16:42

వరంగల్ : రైలు కింద పడి తల్లీ కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన కేసముద్రం మండలం ఇంటికన్నెలో గురువారం చోటుచేసుకుంది. ఈజరిగింది. కుటుంబ కలహాల నేపధ్యంలోనే వీరు ఆత్మహత్యకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.

07/28/2016 - 16:38

ర్నూలు: శ్రీశైలం నుంచి 10 టీఎంసీలను వదలడం రాయలసీమ వాసుల గొంతుకోయడమే అని రాయలసీమ పరిరక్షణ సమితి నేత బైరెడ్డిరాజశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. శ్రీశైలం జలదోపిడీపై త్వరలో దీక్షకు దిగనున్నట్లు ప్రకటించారు. కృష్ణా బోర్డు నిర్ణయాలు సీమకు ఉరితాళ్లుగా మారుతున్నాయని ధ్వజమెత్తారు.

07/28/2016 - 16:36

ఢిల్లీ : జీఎస్‌టీ (వస్తువులు, సేవల పన్ను) బిల్లును శుక్రవారం రాజ్యసభలో ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ బిల్లుకు సవరణలను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంగీకారం తెలిపాయి. జీఎస్‌టీ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదించింది.

Pages