S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/28/2016 - 05:00

హైదరాబాద్, జూలై 27: మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారి భరతం పట్టేందుకు పగలు, రాత్రి వేళల్లో నగర ట్రాఫిక్ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈనెల 1 నుంచి 26వరకు నిర్వహించిన తనిఖీల్లో దాదాపు 10వేల 152 మందిపై కేసులు నమోదు కాగా వారిలో 4వేల 609 మందికి జైలుశిక్షను విధించింది. మద్యం సేవించి పట్టుబడిన వారి నుండి రూ.31లక్షల 99వేల రూపాయలను జరిమానా రూపంలో వసూలు చేశారు.

07/28/2016 - 04:59

ముషీరాబాద్, జూలై 27: దేశంలోకెల్లా మిగులు బడ్జెట్ గల రాష్ట్రం అంటూ ముఖ్యమంత్రి కెసిఆర్.. అప్పుల తెలంగాణగా మార్చారని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. ఇప్పుడే మేల్కొని తిరుగుబాటు చేయకపోతే చిప్ప చేతిలో పెడతాడని ధ్వజమెత్తారు.

07/28/2016 - 04:59

హైదరాబాద్, జూలై 27: మహానగరవాసులకు వానాకాలం కష్టాలను పూర్తి స్థాయిలో ఎలాగో నివారించలేం..వీలైనంత మేరకు వారి కష్టాలను తగ్గించేందుకు సిద్దంగా ఉన్నామని జిహెచ్‌ఎంసి అధికారులు చేస్తున్న ప్రకటన వాస్తవానికి విరుద్దంగా తయారైంది. గడిచిన కొద్దిరోజులుగా నగరంలో కురుస్తున్న చిరుజల్లులతో బుధవారం నగరం తడిసి ముద్దయ్యింది.

07/28/2016 - 04:51

న్యూఢిల్లీ, జూలై 27: చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ లీఎకో.. అమెరికాకు చెందిన కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ సంస్థ విజియోను హస్తగతం చేసుకుంది. నిశ్చయాత్మక ఒప్పందంలో భాగంగా 2 బిలియన్ డాలర్ల (ప్రస్తుతం భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 13,500 కోట్లు)కు విజియో హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ వ్యాపారం, టెక్నాలజీ, మేధో సంపత్తి ఆస్తులను చేజిక్కించుకున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో లీఎకో తెలిపింది.

07/28/2016 - 04:48

లండన్/న్యూఢిల్లీ, జూలై 27: తమ విదేశీ హోటళ్ల అమ్మకానికి సంబంధించి వచ్చిన ఆఫర్‌ను సహారా గ్రూప్ తిరస్కరించింది. ‘సహారా-సెబీ’ కేసులో అధినేత సుబ్రతారాయ్ విడుదలకు సుప్రీం కోర్టు సూచించిన పూచీకత్తును సమర్పించడానికి లండన్, న్యూయార్క్ నగరాల్లోని మూడు లగ్జరీ హోటళ్లను సహారా అమ్మకానికి పెట్టినది తెలిసిందే.

07/28/2016 - 04:48

ముంబయి, జూలై 27: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఓ మోస్తరు లాభాలను అందుకున్నాయి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లులో కొన్ని నిర్ణయాల విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజీపడటం మార్కెట్ సెంటిమెంట్‌ను కొంతమేర పెంచింది.

07/28/2016 - 04:46

ముంబయి, జూలై 27: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ).. మొత్తం 13 బ్యాంకులపై 27 కోట్ల రూపాయల జరిమానాను విధించింది. ఫెమా నిబంధనలు, కెవైసి నియమాలను ఉల్లంఘించినందుకుగాను 13 ప్రభుత్వరంగ, ప్రైవేట్‌రంగ బ్యాంకులపై కొరడా ఝుళిపించింది. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ, ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐ బ్యాంక్‌సహా మరో 8 బ్యాంకులకు నిబంధనలను సరిగ్గా అమలు చేయాలని గట్టిగా మందలించింది.

07/28/2016 - 04:46

న్యూఢిల్లీ, జూలై 27: దేశీయ అతిపెద్ద మార్ట్‌గేజ్ లెండర్ హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ ఏకీకృత నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 26.86 శాతం వృద్ధి చెంది 2,796.92 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఇదే త్రైమాసికంలో 2,204.29 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు బుధవారం సంస్థ తెలియజేసింది.

07/28/2016 - 04:45

విజయవాడ, జూలై 27: రాష్ట్రంలో రేషన్ దుకాణాలను మినీ సూపర్ బజార్లుగా మార్చాలన్న ప్రభు త్వం ఆలోచనను రేషన్ షాపుల డీలర్లు స్వాగతించారు. డీలర్ల కమీషన్‌ను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపట్ల డీలర్ల సమాఖ్య ముఖ్యమంత్రి చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలియచేసింది. సమాఖ్య నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబును బుధవారం సిఎం క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు.

07/28/2016 - 04:44

విశాఖపట్నం, జూలై 27: రైలు ప్రయాణికులకు పసందైన, అందుబాటు ధరలో ఉండేలా భోజన, అల్పాహారం సదుపాయం కల్పించాలని రైల్వేబోర్డు నిర్ణయించింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సిటిసి) ఆధ్వర్యంలో దీనిని నిర్వహించనుంది. ఇందుకోసం కార్యాచరణ సిద్ధమైంది. భారతీయ రైల్వే పరిధిలో 17 రైల్వే జోన్లు ఉన్నాయి.

Pages