S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/28/2016 - 16:31

శ్రీనగర్‌ : కొండచరియులు విరిగిపడుతుండడంతో అమర్‌ నాథ్‌ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. భారీ వర్షాల
కు జమ్మూ-శ్రీనగర్‌ జాతీయ రహదారిని మూసివేశారు. జమ్మూలో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అమర్‌నాథ్‌ వైపు వెళుతున్న 800 ముంది మధ్యలోనే ఆగిపోయారు. శాంతి భద్రతల దృష్ట్యా ఇటీవల కొన్ని రోజుల పాటు అమర్‌నాథ్‌ యాత్రను నిలిపివేశారు. ముళ్లీ ఇప్పుడు యాత్రకు ఆటంకాలు ఎదురయ్యాయి.

07/28/2016 - 16:27

హైదరాబాద్: డిఎడ్ విద్యార్థుల నుంచి వెయ్యి రూపాయల చొప్పున లంచం పుచ్చుకుంటుండగా ఎపి ఎస్‌ఎస్‌సి బోర్డు డైరెక్టర్ ప్రసన్నకుమార్‌ను గురువారం నాడు ఎసిబి అధికారులు వలపన్ని పట్టుకున్నారు.

07/28/2016 - 16:27

హైదరాబాద్: ఎంసెట్-2 పేపర్ లీక్‌కు సంబంధించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జెఎన్‌టియు ఎదుట భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలు గురువారం ధర్నా జరిపారు. పరీక్ష నిర్వహణలో ప్రభుత్వం అసరమర్ధత వల్ల అమాయక విద్యార్థులు ఇక్కట్ల పాలవుతున్నారని అన్నారు. జెఎన్‌టియు వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో కొంతమంది ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.

07/28/2016 - 16:26

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-2 పేపర్ లీకేజీకి ప్రభుత్వం నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, వైద్య-ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డిలను పదవుల నుంచి వెంటనే తొలగించాలని ఓయు నిరుద్యోగ జెఎసి డిమాండ్ చేసింది. లీకేజికి కారకులైన వారిని శిక్షించాలని కోరుతూ గురువారం నిరుద్యోగ జెఎసి ఆధ్వర్యంలో ఓయులో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

07/28/2016 - 16:26

హైదరాబాద్: ఎంసెట్-2 పేపర్ లీకేజీలో తెలంగాణ ప్రభుత్వంలోని ఓ కీలకవ్యక్తి ప్రమేయం ఉందని టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి గురువారం ఆరోపించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబానికి సన్నిహితంగా ఉండే వ్యక్తులే లీకేజీకి కారకులని, కొంతమంది దళారులను అరెస్టు చేసి జైలుకు పంపితే సరిపోదన్నారు. పేపర్ లీక్‌కు సంబంధించిన మూలాలు దిల్లీ, ముంబయిలో ఉన్నందున సిబిఐ చేత విచారణ జరిపించాలన్నారు.

07/28/2016 - 16:23

కోల్‌కత : ప్రముఖ రచయిత్రి పద్మ విభూషణ్ మహాశ్వేతాదేవి(90) కోల్‌కతలో గురువారం కన్నుమూశారు. 1926లో ఢాకాలో పుట్టిన మహాశ్వేతాదేవి కోల్‌కతలో రవీంద్రనాథ్ టాగోర్ స్థాపించిన విశ్వభారతి యూనివర్సిటీలో బిఏ చదివారు. కోల్‌కత యూనివర్సిటీలో ఎంఏ చదివారు. 1964లో బిజోయ్‌గఢ్ కాలేజిలో బోధన ప్రారంభించారు. విద్యాభ్యాసం తర్వాత మహాశ్వేతాదేవి ప్రముఖ నాటక రచయిత, నటుడు బిజోన్ భట్టాచార్యను వివాహమాడారు.

07/28/2016 - 15:26

హైదరాబాద్‌: ఎంసెట్‌-2 పరీక్షపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ రేపు ప్రకటన చేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ విశ్వవిద్యాలయాలపై రేపు సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం ఎంసెట్‌-2 పరీక్షపై ప్రభుత్వం తుది నిర్ణయం ప్రకటించనుంది. పరీక్ష రద్దు నిర్ణయం జరిగిపోయిందని అధికారిక ప్రకటన ఒక్కటే మిగిలుందని తెలుస్తోంది.

07/28/2016 - 15:17

జైపూర్‌: రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధర రాజే ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను గురువారం అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. సిరోహి వెళ్తుండగా మార్గం మధ్యలో ప్రతికూల వాతావరణ ఎదురైంది. దీంతో రాజ్‌సమంద్‌ జిల్లాలోని ఓ గ్రామంలో హెలికాప్టర్‌ను అత్యవసరంగా దించినట్లు అధికారులు వెల్లడించారు.

07/28/2016 - 15:12

హైదరాబాద్‌: విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా అల్పపీడన ద్రోణి, మరట్వాడ దానికి ఆనుకుని ఉన్న మధ్య మహారాష్ట్ర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాగల రెండు రోజుల్లో తెలంగాణ, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు.

07/28/2016 - 15:09

జైపూర్‌ (రాజస్థాన్‌) : కృష్ణజింకలను వేటాడిన కేసులో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ నిర్దోషిగా రాజస్థాన్‌ హైకోర్టు తీర్పు వచ్చినా, తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తామని రాజస్థాన్‌ న్యాయశాఖ మంత్రి రాజేంద్ర రాథోడ్‌ గురువారం అన్నారు. సల్మాన్‌ను నిర్దోషిగా ప్రకటించిన రెండు రోజుల తర్వాత- ఘటన సమయంలో సల్మాన్‌ వాహనాన్ని నడిపిన హరీశ్‌ దులానీ తనకు ప్రాణహాని ఉండటంతో కనబడకుండా పోయినట్లు చెప్పాడు.

Pages