S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కలాం.. మీకు సలాం!

రామేశ్వరం, జూలై 27: తమిళనాడులోని రామేశ్వరం దశ తిరగనుంది. మాజీ రాష్టప్రతి డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం జన్మించిన ఈ చిన్నపట్టణాన్ని ‘అమృత్’ పథకం కింద అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. భారతరత్న కలాం ప్రథమ వర్థంతి సందర్భంగా బుధవారం ఇక్కడ ఏర్పాటైన ఓ కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం వెంకయ్యనాయుడు ఈ మేరకు ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ మాజీ రాష్టప్రతి కలాంకు ఘన నివాళులర్పించారు. ‘కలాం మన మధ్యనుంచి వెళ్లిపోయి ఏడాది గడిచింది. ఆయన లేనిలోటు పూడ్చలేనిది. కలాం స్థానాన్ని ఎవరూ భర్తీచేయలేరు’ అంటూ మోదీ ట్వీట్ చేశారు.
కాగా దివంగత అబ్దుల్ కలాం నిలువెత్తు విగ్రహాన్ని ప్రారంభించిన మంత్రి దేశాన్ని శాస్త్ర, సాంకేతికంగా తీర్చిదిద్దిన మహానీయుని సేవలకు గుర్తింపుగా ఈ పథకం అమలు చేయనున్నట్టు వెల్లడించారు. పథకానికి సంబంధించి నిబంధనలు సడలించి మరీ దేశానికి కలాం అందించిన సేవలకు గుర్తింపుగా అమృత్ అమలుచేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. డిఆర్‌డిఓ ఆధ్వర్యంలో రక్షణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖల భాగస్వామ్యంతో ఏర్పాటైన ఈ కార్యక్రమంలో కలాంను ‘ప్రజల రాష్టప్రతి’గా అభివర్ణించారు. కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్, రవాణా శాఖ సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ సహా పలువురు ప్రముఖులు హాజరై కలాంకు ఘననివాళి అర్పించారు. తొలుత పైకరుంబులో మాజీ రాష్టప్రతి నిలువెత్తు విగ్రహాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. కలాం మన మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలు దేశ ప్రజల హృదయాల్లో పదిలంగా ఉన్నాయని మంత్రి నివాళులర్పించారు. లక్ష మంది జనాభా ఉన్న పట్టణాలకే అమృత్ వర్తిస్తుందని అయితే ప్రధాని మోదీ మాజీ రాష్టప్రతి జన్మస్థలం రామేశ్వరంలో 45వేల మంది జనాభా ఉన్నప్పటికీ అమలు చేయాలని నిర్ణయించారని వెంకయ్య ప్రకటించారు. 45 కోట్ల రూపాయలతో పట్టణంలో పారిశుద్ధ్యం, మురుగునీటి పారుదల, పార్కుల అభివృద్ధి చేస్తారన్నారు. కలాం స్మారక మందిరం నిర్మించడానికి స్థలం మంజూరు చేసిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
chitram...
రామేశ్వరంలో ఎపిజె అబ్దుల్ కలాం పేరిట ఏర్పాటు చేసిన మ్యూజియాన్ని సందర్శిస్తున్న కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, మనోహర్ పారికర్ తదితరులు