S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/26/2016 - 04:51

న్యూఢిల్లీ/చెన్నై, జూలై 25: గత నాలుగు రోజులుగా విస్తృత ఉపరితల అనే్వషణ జరుపుతున్న వైమానికి దళ రవాణా విమానం ఎఎన్-32 జాడ తెలియకపోవడంతో ప్రయాణికుల్లో ఎవరూ సజీవంగా బయటపడే అవకాశం లేదన్న సంకేతాలు కనిపిస్తున్నాయ. ఇప్పటివరకూ ఇటు శకలాలు గానీ, అటు ప్రయాణికుల ఆనవాళ్లు గాని కనిపించకపోవడంతో ఈ నిర్ధారణకు వస్తున్నట్లు తెలుస్తోంది.

07/26/2016 - 04:47

జగ్గయ్యపేట రూరల్, జూలై 25: కృష్ణా పుష్కరాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్‌పి విజయకుమార్ అన్నారు. సోమవారం మండలంలోని వేదాద్రి, ముక్త్యాల క్షేత్రాలను సందర్శించి పుష్కర ఘాట్‌ల నిర్మాణ పనులు, ఆలయాల్లో ఏర్పాట్లు ఇతర అంశాలను పరిశీలించి అధికారులతో చర్చించారు.

07/26/2016 - 04:46

కృత్తివెన్ను, జూలై 25: చెదురుమొదురుగా వర్షాలు కురుస్తున్నా, పంట కాలువలకు అరకొరగా నీరు వస్తున్నా తీరప్రాంతంలో దాహం కేకలు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. మండల పరిధిలోని పలు గ్రామాలలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. ముఖ్యంగా శివారు ప్రాంతాలైన గరిశపూడి, మాట్లం, లక్ష్మీపురం, పల్లెపాలెం గ్రామాల ప్రజలకు రెండు రోజులకు ఒకసారి ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నారు.

07/26/2016 - 04:45

జోధ్‌పూర్, జూలై 25: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు కృష్ణ జింకలను వేటాడిన కేసులో ఊరట లభించింది. 1998లో జోధ్‌పూర్‌లో కృష్ణ జింకలను వేటాడినట్లు అభియోగాలు ఉన్న రెండు కేసులలో సల్మాన్ ఖాన్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ రాజస్థాన్ హైకోర్టు సోమవారం తీర్పు ఇచ్చింది. చనిపోయిన కృష్ణ జింకల నుంచి సేకరించిన తూటాలు సల్మాన్ ఖాన్ లైసెన్స్‌డ్ గన్‌నుంచి కాల్చినవి కాదని హైకోర్టు పేర్కొంది.

07/26/2016 - 04:45

విజయవాడ, జూలై 25: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల్లో రైతుబజార్లు వినూత్నమైనవి. దళారుల ప్రాబల్యాన్ని నిరోధించి రైతులకు, వినియోగదారులకు ప్రయోజనం కలిగించేందుకు ఈ వ్యవస్థ 1999లోప్రారంభమైంది. అయితే మధ్యలో కొనే్నళ్లు రైతుబజార్లు నిర్లక్ష్యానికి గురైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతుబజార్ల వ్యవస్థను తిరిగి పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంది.

07/26/2016 - 04:44

విజయవాడ (స్పోర్ట్స్), జూలై 25: సివిల్ సర్వీస్ వంటి అత్యున్నతమైన పదవి ద్వారా జీవితకాలం సేవచేసే అవకాశం ఉంటుందని, పేదవారు, దళితులు, వెనుకబడిన కులాలవారు అకుంఠిత దీక్ష, ఏకాగ్రతతో సివిల్స్ పరీక్షల్లో ఉత్తీర్ణత కావడం పట్ల వారిని తల్లిదండ్రులను ప్రోత్సహిస్తున్న వ్యక్తులను అభినందిస్తున్నామని మంత్రులు రావెల కిషోర్‌బాబు, దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.

07/26/2016 - 04:43

న్యూఢిల్లీ, జూలై 25: దేశవ్యాప్తంగా లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకూ, పెన్షనర్లకు జీతాలు పెంచుతూ 7వ వేతన సంఘం చేసిన సిఫార్సులు ఆగస్టు నెల నుంచే అమలులోకి అమలులోకి రాబోతున్నాయి. ఇందుకు సంబంధించి ఈ వారంలోనే నోటిఫికేషన్ రావచ్చునని తాజా సంకేతాలను బట్టి స్పష్టమవుతోంది.

07/26/2016 - 04:43

విజయవాడ, జూలై 25: కృష్ణా పుష్కరాలకు అత్యవసర చికిత్స విధానంలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన నిపుణులైన వైద్యులతో కూడిన 12 రాపిడ్ ఎమర్జెన్సీ మెడికల్ టీమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఎన్‌టిఆర్ విశ్వవిద్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ పుష్కరాల సన్నద్ధతపై చేపట్టిన కార్యక్రమాలను వైద్య ఆరోగ్య మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ సోమవారం ఉన్నతాధికారులతో సమీక్షించారు.

07/26/2016 - 04:42

న్యూఢిల్లీ, జూలై 25: ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీస్ చేపట్టిన నిరసన కార్యక్రమాలు ఏడో రోజుకు చేరుకున్నాయి. సోమవారం మాదిగ కవులు-రచయితలు జంతర్ మంతర్‌లో జరుగుతున్న నిరసన కార్యమ్రంలో పాల్గొన్నారు. యెండ్లూరి సుధాకర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సాధించుకొని స్వేచ్ఛాప్రతిమ డప్పు కొట్టాలని ఉందని అన్నారు.

07/26/2016 - 04:42

మచిలీపట్నం (కోనేరుసెంటర్), జూలై 25: ప్రజా సాధికార సర్వేను వేగవంతం చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి చెరుకూరి రంగయ్య అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ‘మీకోసం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలు స్వీకరించారు.

Pages