S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గోకవరం సిహెచ్‌ఎన్‌సి మూత

గోకవరం, జూలై 22: పిహెచ్‌సిలపై అజమాయిషీ చేసే సిహెచ్‌ఎన్‌సిలను ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో 9 పిహెచ్‌సిలపై అజమాయిషీ చేసే గోకవరం సిహెచ్‌ఎన్‌సి మూతపడింది. ఏజెన్సీ ముఖద్వారమైన గోకవరంలోని పిహెచ్‌సి ఆవరణలో నూతనంగా నిర్మించిన భవనంలో సిహెచ్‌ఎన్‌సి కార్యాలయం ఏర్పాటు చేసి, ఇక్కడ నుండే 9 పిహెచ్‌సిల పనితీరును అధికార్లు పర్యవేక్షించేవారు. ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సిహెచ్‌ఎన్‌సి ఎత్తివేయడంతో పిహెచ్‌సిల బాగోగులు జిల్లాస్థాయి నుండే అధికార్లు పర్యవేక్షించాల్సిన పరిస్థితి నెలకొంది.
2011లో క్లస్టర్ వ్యవస్థను ఏర్పాటు చేసి పిహెచ్‌సిలను క్లస్టర్ పరిధిలోకి తీసుకువచ్చిన విషయం పాఠకులకు విదితమే. గోకవరం క్లస్టర్ పరిధిలోని గోకవరం, కోరుకొండ, సీతానగరం, కోటికేశవరం, రాజానగరం, పాలచర్ల, దోసకాయలపల్లి, పిడతమామిడి, ఇందుకూరుపేట తదితర పిహెచ్‌సిలను గోకవరం క్లస్టర్ పరిధిలోకి తీసువచ్చారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో పిహెచ్‌ఎన్‌సి కార్యాలయానికి తాళాలు వేశారు. ఇక్కడ పనిచేస్తున్న ఆరుగురు వైద్య సిబ్బందిని కోరుకొండ, గోకవరం పిహెచ్‌సిలకు బదిలీ చేశారు. సిహెచ్‌ఎన్‌సిలో విధులు నిర్వర్తించిన డిప్యూటీ డిఎంఅండ్‌హెచ్‌ఒ కోసూరి అప్పారావును గోకవరం సిహెచ్‌సికి డిసిఎఎస్‌గా, హెల్త్ ఎడ్యుకేటర్ పస్తుల ఉమాసీతామహాలక్ష్మీదేవిని హెచ్‌సిగా, యుడిసిని సీనియర్ అసిస్టెంట్‌గాను బదిలీ చేశారు. అలాగే జె ఉమామహేశ్వరావు, పి వెంకట్రావు, వైవి వెంకటేశ్వరావులను కోరుకొండ పిహెచ్‌సిలకు బదిలీ చేశారు.