S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/07/2016 - 02:29

న్యూఢిల్లీ, డిసెంబరు 6: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాడిన ప్రతి జిల్లాలో జవహార్ నవోదయ పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాలలు, ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలను (డైట్) ఏర్పాటు చేయాలని, అలాగే రాష్ట్రంలోని 110 వెనుకబడిన మండలాలకు కస్తూర్బా పాఠశాలలు మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.

12/07/2016 - 02:25

విజయవాడ, డిసెంబర్ 6: క్వారీ, గ్రానైట్ యజమానులకు సంబంధించిన వివిధ సమస్యలను పరిష్కరించే దిశగా మైనింగ్ అధికారులు చర్చలు జరిపారు. వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ్ధర్ మంగళవారం ముందుగా గ్రానైట్ సంస్థల యజమానులతో సమావేశమయ్యారు. డిస్ట్రిక్ట్ మైనింగ్ ఫండ్ కింద తమ నుంచి 32 శాతం మేర వసూలు చేస్తున్నారని, దీనిని రద్దు చేయాలని వారు కోరారు.

12/07/2016 - 02:24

ఆళ్లగడ్డ, డిసెంబర్ 6: గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్ధిని గర్భం దాల్చిన సంఘటన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రస్తుతం ఆ చిన్నారికి 5వ నెల. దీంతో ఆసపత్రిలో చేరింది. వివరాల్లోకి వెళ్తే రుద్రవరం మండలం పెద్దకంబలూరుకు చెందిన ఓ విద్యార్థిని ఆళ్లగడ్డలోని గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది.

12/07/2016 - 02:23

విశాఖపట్నం, డిసెంబర్ 6: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలోపేతం కానుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు మంగళవారం రాత్రి తెలిపారు. వాయుగుండం ప్రస్తుతం విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 1260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొన్నారు.

12/07/2016 - 02:22

విజయవాడ, డిసెంబర్ 6: పెద్దనోట్ల రద్దీ ఇబ్బందులను తొలగించేందుకు గాను బుధవారం మరో రూ.1100 కోట్లు నగదు రాష్ట్రానికి రానున్నదని ఆపై దశలవారీగా రూ.50, రూ.20ల చిన్న నోట్లు కూడా త్వరలో రానున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇటీవల వచ్చిన రూ.2400 కోట్ల నగదు వల్ల చాలా వరకు ఒత్తిడి అధిగమించామన్నారు.

12/07/2016 - 02:21

హైదరాబాద్, డిసెంబర్ 6: ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా రాజీవ్ శర్మ మంగళవారం తన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన రాజీవ్ శర్మను ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా నియమించిన విషయం తెలిసిందే.

12/07/2016 - 02:19

సిద్దిపేట, డిసెంబర్ 6: భూవివాదాల్లో తలదూర్చి నరుూంముఠా పేరిట బెదిరింపులు చేసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడిన వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సిద్దిపేట ఎసిపి నర్సింహారెడ్డి వెల్లడించారు. రియల్టర్లను బెదిరించి బ్లాక్‌మెయిల్ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం తన చాంబర్‌లో విలేఖరులతో మాట్లాడారు.

12/07/2016 - 02:16

సూళ్లూరుపేట, డిసెంబరు 6: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో స్వదేశీ ఉపగ్రహ ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ కేంద్రం నుండి బుధవారం ఉదయం 10:25గంటలకు పిఎస్‌ఎల్‌వి-సి 36 రాకెట్ ప్రయోగం జరగనుంది. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ సోమవారం రాత్రి 10:25గంటలకు ప్రారంభమై నిర్విఘ్నంగా కొనసాగుతోంది.

12/07/2016 - 02:15

హైదరాబాద్, డిసెంబర్ 6: తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైన కొత్త జిల్లా కేంద్రాల్లో ‘కార్యాలయ భవనాల సముదాయా’లను నిర్మించాలని రూపొందించిన ప్రణాళికకు గ్రహణం పట్టింది. తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా ఏర్పడ్డ పరిస్థితులే ఇందుకు కారణమని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రతి జిల్లా కేంద్రంలోనూ కనీసం వంద కోట్ల రూపాయలతో జిల్లా కార్యాలయ భవనాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్మించాలని ప్రతిపాదించారు.

12/07/2016 - 02:08

హైదరాబాద్, డిసెంబర్ 6: గత ఐదు రోజుల్లో అత్యధికంగా డిజిటల్ ఆర్థిక లావాదేవీలు నిర్వహించిన రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని సిఎం కె చంద్రశేఖర్‌రావు అన్నారు. సాధ్యమైనంత త్వరగా తెలంగాణను పూర్తిస్థాయి డిజిటల్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని సిఎం వెల్లడించారు. రాష్ట్రంలో ఆర్థిక లావాదేవీలను డిజిటలైజ్ చేసే ప్రక్రియలో సహకరించేందుకు దిగ్గజ బ్యాంకు ఐసిఐసిఐ ముందుకొచ్చింది.

Pages