S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/25/2018 - 04:20

అమరావతి: క్షయను 2020 నాటికి రాష్ట్రం నుంచి తరిమికొట్టేలా కార్యాచరణ చేపట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి శనివారం శ్రీకారం చుట్టారు. వ్యాధి నిర్మూలనకు, రోగులకు అత్యుత్తమ చికిత్సకు సంబంధించి వివిధ పథకాలను ప్రారంభించారు.

03/25/2018 - 04:03

అమరావతి, మార్చి 24: ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తెలుగుదేశం పార్టీకి ముస్లిం మైనార్టీ వర్గాల మద్దతు రోజురోజుకూ పెరుగుతోంది. తాము బీజేపీతో సంబంధాలు తెగతెంపులు చేసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించిన రోజు రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం వర్గాలు రోడ్డెక్కి సంబరాలు చేసుకున్నారు. బాబు తీసుకున్న నిర్ణయాన్ని పార్టీలకు అతీతంగా అభినందించారు.

03/25/2018 - 04:01

గుంటూరు, మార్చి 24: జనాభాలో 50 శాతంగా ఉన్న బలహీన వర్గాలను గతంలో వైఎస్ సర్కార్ ఉక్కుపాదంతో అణచివేసిందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. శనివారం శాసనసభలో బీసీ సంక్షేమంపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో పదేళ్లకు రూ.750 కోట్లు ఖర్చుచేస్తే తమ ప్రభుత్వం గత నాలుగేళ్లలో ఏడాదికి 3,216 కోట్ల చొప్పున ఖర్చు చేసిందని వివరించారు.

03/25/2018 - 03:55

అమరావతి: రాష్ట్భ్రావృద్ధిలో కేంద్రం అనుసరిస్తోన్న వివక్షపై విరుచుకుపడాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఈశాన్య రాష్ట్రాలకు 3వేల కోట్లు ఇచ్చి, ఏపీకి మొండిచేయి చూపిన పక్షపాతం గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. శనివారం ఎంపీలు, మంత్రులతో బాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘ఈ వారంలో పార్లమెంటుకు 5రోజులు సెలవులు. ఇంకా రెండురోజులే సభ జరుగుతుంది.

03/25/2018 - 03:54

విజయవాడ, మార్చి 24: ఆంధ్రప్రదేశ్‌ను 2022 నాటికి తాగునీటి సమస్యలేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. శనివారం గ్రామీణ నీటి సరఫరాపై శాసనమండలిలో జరిగిన చర్చలో భాగంగా మంత్రి లోకేష్ సమాధానమిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి, పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించడం కోసం రాష్ట్రంలోని గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య శాఖ నోడల్ ఏజెన్సీ పనిచేస్తోందన్నారు.

03/25/2018 - 03:53

విజయవాడ, మార్చి 24: ఆరేళ్ల పాటు, లక్షలాది రూపాయలు వెచ్చించి ఫార్మా-డీ కోర్సును పూర్తిచేసుకున్న వేలాది విద్యార్థులు ఉపాధి లేక రోడ్డున పడుతున్నారంటూ శాసనసభ ప్రశ్నోత్తరాల్లో శనివారం సభ్యులు వి.ప్రభాకరచౌదరి, గద్దె రామ్మోహన్ తదితరులు ఆందోళన వ్యక్తం చేశారు.

03/25/2018 - 03:52

విజయవాడ(బెంజిసర్కిల్), మార్చి 24: ఆంధ్రప్రదేశ్ సమస్యలపై అవగాహన లేకుండా బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా వ్యాఖ్యానిస్తున్నారని ఏపీ ఐటి మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అధికారులతో కనీస సమాచారం తీసుకోకుండా ఏవేవో ఆయన మాట్లాడటం తగదన్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి లేఖ రాసిన సందర్భంలో శనివారం అసెంబ్లీ లాబీల్లో లోకేష్ విలేకరులతో చిట్‌చాట్ నిర్వహించారు.

03/25/2018 - 03:52

హైదరాబాద్, మార్చి 24: ఆంధ్రాకు ప్రత్యేక హోదా సాధనకు తమ పార్టీ ఎంపీలతో కలిసి టిడిపి ఎంపీలు స్పీకర్ రాజీనామా లేఖలు సమర్పించేందుకు ముందుకు రావాలని వైకాపా ఎంపి వైవి సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. బిజెపి మంత్రులను కలవవద్దని బయటకు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతన్నారని, కాని లోపల మాత్రం కేంద్ర మాజీ మంత్రులు సుజనా చౌదరిని, ఇతర ఎంపీలను కేంద్ర మంత్రులను కలవాలని కోరుతున్నారని ఆయన ఆరోపించారు.

03/25/2018 - 03:51

గుంటూరు, మార్చి 24: రాష్ట్రం లోటుబడ్జెట్‌లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చిందని గిరిజన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు.

03/25/2018 - 03:50

విజయవాడ, మార్చి 24: బీజేపీ చేసే బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు భయపడి చేతులు ముడుచుకు కూర్చునే స్థితిలో ఆంధ్రులు లేరనే విషయాన్ని గమనంలో ఉంచుకోవాలంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ శనివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు రాసిన బహిరంగ లేఖలో హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి, పార్లమెంటు నిర్ణయాల పట్ల గౌరవం ఉంటే తక్షణమే ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలన్నారు.

Pages