S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/25/2018 - 02:36

విజయనగరం, మార్చి 24: రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన విభజన హామీలను అమలు చేయకపోవడం వల్ల రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులను జాతీయస్థాయిలో అన్ని పార్టీల దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే రాజీనామా చేశానని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన తరువాత తొలిసారిగా ఆయన శనివారం ఇక్కడకు విచ్చేసిన సందర్భంగా పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

03/24/2018 - 02:52

అమరావతి, మార్చి 23: రాజధాని అమరావతిలో ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఎమ్మెల్యేల క్వార్టర్లు సిద్ధమవుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు, ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చారు. సచివాలయం, అసెంబ్లీ నిర్మాణ ఆకృతులను ఆయన ఎమ్మెల్యేలకు చూపించారు. వాటి ప్రత్యేకతలను వివరించారు. వాటిపై ఎమ్మెల్యేలు సంతృప్తి వ్యక్తం చేశారు. మీకు క్వార్టర్లు లేకపోవడంతో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో నాకు తెలుసు.

03/24/2018 - 02:53

అమరావతి, మార్చి 23: ‘ప్రజా సంతృప్తి 73 శాతానికి పెరిగింది. ఈ మాసంలో 14 రకాల సేవలపై ప్రజాభిప్రాయాన్ని సేకరించగా గృహ నిర్మాణ శాఖ మినహా మిగిలిన శాఖల్లో 90 శాతం సంతృప్తి ఉన్నట్లు తేలింది. పరీక్షల సమయంలో ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయనే నిరాధార వదంతులు, ఫిర్యాదులు వస్తే అలా చేసిన వారిని తక్షణం గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని’ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు.

03/24/2018 - 02:28

అమరావతి, మార్చి 23: 2016లో అస్సాం ఎన్నికల సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఆపరేషన్ 7 స్టేట్స్ అని చెప్పారు.. ఈ ఆపరేషన్‌లో ఏపీ, తెలంగాణ, కేరళ, కర్నాటక, పశ్చిమ బెంగాల్, ఒడిశా తదితర రాష్ట్రాలున్నాయి.. ప్రత్యేక హోదా అడుగుతున్నందుకే వాళ్లు వెంకయ్యనాయుడికి ఉప రాష్టప్రతి ఇచ్చి పక్కన పెట్టారు. వాళ్లు నాలుగేళ్లు తమ పార్టీని బలోపేతం చేసుకుంటున్నారని అనుకున్నాం..

03/24/2018 - 02:47

విజయవాడ (ఎడ్యుకేషన్), మార్చి 23: రాష్ట్రంలోని అన్ని అంబేద్కర్ విగ్రహాల ముందు ఈనెల 27వ తేదీన రాజ్యాంగ పరిరక్షణ దినం పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్, సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కే రామకృష్ణ, పి మధు పేర్కొన్నారు.

03/24/2018 - 02:23

గుంటూరు, మార్చి 23: అభివృద్ధికి ఆదాయమే పరమావధి కాదని, ధనిక, పేద అంతరాలు తొలగాలని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ దిశగా 2020 నాటికి కరవును అధిగమించి అంతరాలు తొలగింపజేసేందుకు తమ ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించిందని తెలిపారు. శాసనసభలో శుక్రవారం సమ్మిళిత అభివృద్ధిపై మంత్రి మాట్లాడుతూ కేవలం వస్తువుల కొనుగోలు, అమ్మకాలు వలన లభించే ఆదాయంతో సమ్మిళిత అభివృద్ధి సాధ్యపడదన్నారు.

03/24/2018 - 02:22

గుంటూరు, మార్చి 23: ప్రభుత్వం విద్యా ప్రమాణాల మెరుగుదలకు అనేక ప్రోత్సాహకాలను అందిస్తోందని ఉన్నత విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం శాసనసభలో ‘ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ చట్టంలో పేర్కొన్న జాతీయ విద్యాసంస్థల స్థితి’పై లఘుచర్చ జరిగింది.

03/24/2018 - 02:09

అమరావతి, మార్చి 23: ప్రజల్లో ప్రత్యేక హోదా కావాలన్న సెంటిమెంట్ లేదని, రాజకీయ ప్రయోజనాల కోసం భారతీయ జనతా పార్టీపై అసత్య ప్రచారాలు చేస్తూ టీడీపీ బురద జల్లుతోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుధీష్ రాంభొట్ల ఆరోపించారు.

03/24/2018 - 02:07

విజయవాడ, మార్చి 23: రాష్ట్రంలోని ఐటీ పాలసీకి లోబడే వివిధ కంపెనీలకు భూములను కేటాయిస్తున్నాం కానీ, గతంలో మాదిరిగా పందారం చేయడం లేదంటూ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.

03/24/2018 - 02:02

అమరావతి, మార్చి 23: రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి ఎంపికపై పార్టీ జాతీయ నాయకత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. రెండు, మూడు రోజుల్లో అధ్యక్షుడితోపాటు, కార్యవర్గాన్ని కూడా ప్రకటించేందుకు నాయకత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. దీనితోపాటు ప్రముఖులతో ప్రచార కమిటీ ఏర్పాటుచేసే అవకాశాలున్నాయంటున్నారు. అందులో భాగంగా కాపు నేతకే అధ్యక్ష పదవి ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.

Pages