S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/25/2018 - 03:50

విజయవాడ (క్రైం), మార్చి 24: సినీ నటుడు శివాజీ పేర్కొన్న ఆపరేషన్ ద్రావిడ వెనుక ఉన్నవారిని గుర్తించి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డీజీపీ మాలకొండయ్యకు మాజీ మంత్రి మాణిక్యాలరావు ఫిర్యాదు చేశారు.

03/25/2018 - 03:49

విజయవాడ, మార్చి 24: ఆర్టీసీ ఉద్యోగులు, కార్యాలయ సిబ్బందికి ఈనెల 26న శ్రీరామనవమి సెలవుగా ప్రకటిస్తూ ఆర్టీసీ ఎండీ డాక్టర్ ఎం.మాలకొండయ్య శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మే 12 తేదీన రెండవ శనివారం విధులకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. సోమవారం విద్యాధరపురం ఆసుపత్రికి కూడా సెలవు ఉన్నందున ఆరోజు మెడికల్ బోర్డుకు రావాల్సిన ఉద్యోగులు, పేషెంట్లు 27 నే ఆసుపత్రికి హాజరుకావాల్సి ఉంటుంది.

03/25/2018 - 03:48

విజయవాడ, మార్చి 24: వివిధ పంచాయితీల కాలపరిమితి ముగిశాకే, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ)లో విలీనం ప్రక్రియ చేపడతామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. రాష్ట్ర శాసన మండలిలో శనివారం జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో రాజేంద్ర ప్రసాద్ అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ, వీఎంసీలో 51 గ్రామాలను విలీనం చేసేందుకు ప్రతిపాదించామన్నారు.

03/25/2018 - 03:47

విజయవాడ, మార్చి 24: భారత్ కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్) తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి శనివారం అందచేసింది. 2017 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ పద్దులు, లావాదేవీలపై ఆడిట్ వ్యాఖ్యలు, పరిశీలనలతో ‘సామాన్య, సామాజిక రంగాలపై, స్థానిక సంస్థలపై’ కాగ్ నివేదికను రాష్ట్ర శాసన సభలో ప్రవేశపెట్టేందుకు వీలుగా ప్రభుత్వానికి అందచేసింది. కాగ్ నివేదికలను గవర్నర్ ఇస్తారు.

03/25/2018 - 03:47

విజయవాడ, మార్చి 24: శ్రీరామ నవమి సందర్భంగా ఈ నెల 26న అసెంబ్లీ, శాసనమండలికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ముందుగా ఆదివారం సెలవు ప్రకటించినప్పటికీ, ఆ తరువాత దానిని సోమవారానికి మార్చింది. అసెంబ్లీ, శాసన మండలి కార్యకలాపాలకు సెలవు ప్రకటించడంపై శనివారం మధ్యాహ్నం వరకూ స్పష్టత లేదు. సాయంత్రం ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ విజయరాజు సెలవు ప్రకటిస్తూ, గందరగోళానికి తెరదించారు.

03/25/2018 - 03:51

సందర్భంగా విశ్వక్సేనుని పూజ నిర్వహిస్తున్న అర్చకులు

03/25/2018 - 03:59

అమరావతి, మార్చి 24: తనను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న టీడీపీ నేతలు ముందు, తమ పార్టీ కార్యకర్తలు, మోదీ అభిమానులు, బీజేపీ సానుభూతిపరుల వల్ల గెలిచి అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబునాయుడుతో రాజీనామా చేయించాలని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సూచించారు. గత ఎన్నికల్లో మా ఓట్లు కూడా టీడీపీకి పోలయినందువల్లే టీడీపీ గెలిచిన విషయాన్ని గుర్తుంచుకోవాలని ఘాటుగా విమర్శించారు.

03/25/2018 - 02:45

విజయవాడ(బెంజిసర్కిల్), మార్చి 24: రాజధాని అమరావతిలో నూతనంగా నిర్మించే సచివాలయంతో పాటు ఇతర భవన నిర్మాణ ఆకృతులను అసెంబ్లీ ప్రాంగణంలో సందర్శనకు ఉంచారు. శనివారం మొదట శాసన మండలి ప్రాంగణంలో ప్రదర్శనకు ఉంచిన ఆకృతులను తరువాత అసెంబ్లీ ప్రాంగణంలో ప్రదర్శనకు ఉంచారు. నూతన సచివాలయ తుది ఆకృతులను నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు ప్రజంటేషన్ ఇచ్చారు.

03/25/2018 - 04:01

నరసరావుపేట, మార్చి 24: గత నాలుగేళ్ల తెలుగుదేశం పార్టీ పాలనలో సమాజంలోని ఏ వర్గమైనా సంతృప్తిగా ఉందా అని ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రశ్నించారు.

03/25/2018 - 03:48

కాకినాడ, మార్చి 24: సమయానుకూలంగా గెలిచే పార్టీల్లోకి ఫిరాయించే సీజనల్ నేతలకు ప్రస్తుతం గడ్డుకాలం నెలకొంది. సార్వత్రిక ఎన్నికలకు ఇక ఏడాది మాత్రమే మిగిలివుండటంతో ఈసారి కూడా పెద్దఎత్తున నేతలు పార్టీలు మారడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ప్రస్తుత అయోమయ రాజకీయ పరిస్థితుల్లో ఏ పార్టీలోవుంటే అధికారానికి దగ్గరగా ఉంటామనే విషయమై స్పష్టతలేక అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు.

Pages