S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/24/2018 - 02:00

గుంటూరు, మార్చి 23: అభివృద్ధికి ఆదాయమే పరమావధి కాదని, ధనిక, పేద అంతరాలు తొలగాలని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ దిశగా 2020 నాటికి కరవును అధిగమించి అంతరాలు తొలగింపజేసేందుకు తమ ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించిందని తెలిపారు. శాసనసభలో శుక్రవారం సమ్మిళిత అభివృద్ధిపై మంత్రి మాట్లాడుతూ కేవలం వస్తువుల కొనుగోలు, అమ్మకాలు వలన లభించే ఆదాయంతో సమ్మిళిత అభివృద్ధి సాధ్యపడదన్నారు.

03/24/2018 - 01:58

విజయవాడ, మార్చి 23: కేంద్రం ఎంపిక చేసిన స్మార్ట్ సిటీల్లో నిధుల వర్షం కురుస్తుందని, ఆ నగరాలు మొత్తం రూపురేఖలే మారిపోయి అభివృద్ధి చెందుతాయని భావిస్తే పొరబాటేనని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ స్పష్టం చేశారు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో స్మార్ట్ సిటీ నగరాల్లో వివిధ పనులు నత్తనడక నడుస్తున్నాయంటూ సభ్యులు వి.గణేష్‌కుమార్, ఎం.సుగుణమ్మ అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి నారాయణ పై విధంగా స్పందించారు.

03/24/2018 - 01:57

విజయవాడ, మార్చి 23: నేడు తాము విపక్షంలో ఉన్నాం.. గత నాలుగేళ్లపాటు మిత్రపక్షంగా ఉన్నాం.. అయినా తాను ప్రాతినిధ్యం వహించే విశాఖ ఉత్తర నియోజకవర్గానికి ఒరిగిందేమీ లేదని.. ప్రభుత్వం మొదటి నుంచి వివక్ష చూపుతూ వచ్చిందంటూ బీజేపీ ఫ్లోర్‌లీడర్ వెష్ణుకుమార్‌రాజు ధ్వజమెత్తారు.

03/24/2018 - 01:55

విజయవాడ, మార్చి 23: కొన్ని వందల సంవత్సరాల క్రితం అనంతపురం జిల్లాలో శ్రీకృష్ణదేవరాయల పాలనలో హరిహరరాయలు, బుక్కరాయలు తవ్విన బుక్కపట్నం చెరువుకు నీటిని నింపిన సీఎం చంద్రబాబునాయుడు అభినవ కృష్ణదేవరాయలంటూ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అభినందనలు కురింపించారు.

03/24/2018 - 01:53

గుంటూరు, మార్చి 23: ప్రభుత్వం విద్యా ప్రమాణాల మెరుగుదలకు అనేక ప్రోత్సాహకాలను అందిస్తోందని ఉన్నత విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం శాసనసభలో ‘ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ చట్టంలో పేర్కొన్న జాతీయ విద్యాసంస్థల స్థితి’పై లఘుచర్చ జరిగింది.

03/24/2018 - 01:51

గుంటూరు, మార్చి 23: రెవెన్యూ శాఖలో గత నాలుగేళ్లలో సంస్కరణలు తీసుకువస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. శాసనసభలో శుక్రవారం రెవెన్యూ శాఖ డిమాండ్లపై ఆయన వివరణ ఇచ్చారు. భూసేవ ద్వారా ఇంటి వద్దకే సమాచారాన్ని అందించడంతో పాటు భూధార్ ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను సులభతరం చేయనున్నట్లు వివరించారు. ఉయ్యూరులో ఈ ప్రక్రియ ప్రయోగాత్మకంగా చేపట్టామన్నారు.

03/24/2018 - 01:24

తిరుమల తరహాలో ఒంటిమిట్టలో ఏర్పాట్లు హాజరుకానున్న, గవర్నర్ ముఖ్యమంత్రి, టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్

03/24/2018 - 01:25

ఆదోని, మార్చి 23:రోడ్డు ప్రమాదంలో గాయపడిన పలువురు పదో తరగతి విద్యార్థులు సహాయకుల సాయంతో శుక్రవారం పరీక్ష రాశారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా కౌతాళం మండలంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. బదినేహాల్ గ్రామం నుండి 20 మంది విద్యార్థులు ఆటోలో కౌతాళం బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న ఆటో కౌతాళం క్రాస్ రోడ్డు వద్ద ప్రమాదవశాత్తు బోల్తా పడింది. దీంతో అందులోని 15 మందికి గాయాలయ్యాయి.

03/24/2018 - 01:01

సీలేరు, మార్చి 23: విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని మావోయిస్టు పార్టీ, ఏవోబీ ప్రత్యేక కార్యదర్శి చంద్రవౌళి స్థానిక విలేకరులకు శుక్రవారం పంపిన లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రాకు ప్రత్యేక హోదా కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ధోరణిపై చంద్రవౌళి తీవ్రంగా విమర్శించారు. ఏపీని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని, అన్ని పార్టీల ఆమోదంతో విభజన చేశారన్నారు.

03/24/2018 - 01:00

అమరావతి, మార్చి 23: రాష్ట్ర ప్రభుత్వం ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేయనున్న ట్రిపుల్ ఐటీకీ సంబంధించి స్థల సేకరణపై మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం సమీక్షించారు. సచివాలయంలోని తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మంత్రి శిద్దా రాఘవరావు, ఎమ్మెల్యేలు కదిరి బాబురావు, పోతుల రామారావు పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేశారు. స్థల సేకరణ అంశంపై విస్తత్ర చర్చ జరిగింది.

Pages