S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/19/2017 - 03:25

విజయవాడ (క్రైం), నవంబర్ 18: పదవుల ఆశ చూపి ఓ మహిళను లొంగదీసుకుని, లక్షల్లో మోసగించిన కేసులో వైకాపా నేత, కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మాజీ మున్సిపల్ చైర్మన్‌ను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో స్టీరింగ్ కమిటీ సభ్యురాలిగా వ్యవహరిస్తున్న బాధితురాలు తనకు జరిగిన అన్యాయంపై పార్టీలోని ముఖ్య నేతలందరి దృష్టికి తీసుకెళ్ళినా ప్రయోజనం లేకపోయింది.

11/19/2017 - 03:24

కాకినాడ సిటీ, నవంబర్ 18: ప్రమాదవశాత్తు ఇనుప ఊచలపై పడిన ఓ వ్యక్తి గొంతు నుండి వెనుకకు ఊచ దూసుకుపోయింది. ఈ సంఘటన శనివారం మధ్యాహ్నం తూర్పుగోదావరి జిల్లా ఐ పోలవరం మండలం మురమళ్ల గ్రామంలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మురమళ్ల గ్రామానికి చెందిన రాయపూడి సురేష్ (35) అనే వ్యక్తి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

11/19/2017 - 03:23

విజయవాడ, నవంబర్ 18: ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యాన్ని నివారించేందుకు వీలుగా కొన్ని పనులను వేరే కంపెనీలకు అప్పజెప్పేందుకు వీలుగా టెండర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. 1395 కోట్ల రూపాయల అంచనాతో ఈ మేరకు టెండర్లను ఆహ్వానిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి స్పిల్ చానల్, స్పిల్‌వే, తదితర పనులను ట్రాన్స్‌ట్రాయ్ సంస్థకు అప్పగించింది.

11/19/2017 - 00:43

విజయవాడ, నవంబర్ 18: తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఆప్కాబ్‌లో నిధులను దుర్వినియోగం చేస్తున్నారనే అభియోగాలు చుట్టుముడుతున్నాయి. సరిగ్గా మరో 60 రోజుల్లో పదవీ కాలం ముగియబోతున్న నేపధ్యంలో ఆప్కాబ్‌లో డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్న 13 జిల్లాల కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్లు, మరో ఇద్దరు అధికారులతో కలిసి మొత్తం 15 మంది విదేశీ పర్యటనకు వెళ్లారు.

11/19/2017 - 00:41

విశాఖపట్నం, నవంబర్ 18: రాష్ట్రంలో విస్తారమైన తీర ప్రాంతాన్ని ఏకం చేస్తూ కోస్టల్ కారిడార్ అథారిటీ ఏర్పాటు చేయనున్నట్టు పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి వెల్లడించారు. విశాఖలో రీజనల్ స్థాయి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సదస్సు శనివారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కోస్టర్ కారిడార్ అథారిటీ ఏర్పాటునకు సంబందించి త్వరలోనే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు.

11/19/2017 - 00:40

గుంటూరు, నవంబర్ 18: భారత పాలకవర్గాలు విప్లవోద్యమాన్ని అణచివేసేందుకు కొనసాగిస్తున్న బహుముఖ యుద్ధంలో మానసిక యుద్ధం ఒకటని, విప్లవోద్యమంలో అనేక తప్పుడు ప్రచారాలు సృష్టించి తమను నైతికంగా దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ విషయంలో ప్రజాసంఘాలు కూడా వాస్తవాలను గుర్తించాలని మావోయిస్టు కేంద్ర కమిటీ విజ్ఞప్తి చేసింది.

11/19/2017 - 00:39

విజయవాడ, నవంబర్ 18: దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరత తీర్చేందుకు కేంద్ర ప్రభ్వుం వివిధ ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా బీడీఎస్ చదివిన విద్యార్థులకు బ్రిడ్జి కోర్సు నిర్వహించి ఎంబీబీఎస్ వైద్యుల మాదిరిగా ప్రాక్టీసు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది.

11/18/2017 - 03:49

విశాఖపట్నం, నవంబర్ 17: పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు అవసరమైతే ప్రతి ఏటా పాలసీని సవరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అసోసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా (ఎడీటీఓఐ) విశాఖ కనె్వన్షన్ విశాఖ నగరంలో శుక్రవారం జరిగింది.

11/18/2017 - 03:10

విశాఖపట్నం, నవంబర్ 17: మైక్రోసాఫ్ట్ అధినేత, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ మూడు రంగాల్లో తమకు సహకరించాలని ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు కోరారు. ఇక్కడ శుక్రవారం జరిగిన ‘ఏపి అగ్రిటెక్ సమ్మిట్-2017’ ముగింపు ఉత్సవంలో ఆయన మాట్లాడుతూ- ‘నేను మిమ్మల్ని డబ్బులు అడగను.. ఏపీలో వ్యవసాయ రంగం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచేలా సాంకేతిక సహకారాన్ని అందించండి..

11/18/2017 - 03:08

విజయవాడ, నవంబర్ 17: రాజధాని అమరావతి నిర్మించే 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో పర్యావరణ అంశాలకు సంబంధించి జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) అనుమతులను ఇచ్చిందని, రాష్ట్రానికి ఇది శుభ పరిణామమని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ అన్నారు. శుక్రవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పర్యావరణ అనుమతుల్లో భాగంగా రెండు కమిటీలను వేయాలని ఎన్‌జీటీ సూచించిందన్నారు.

Pages