S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/27/2017 - 04:13

మార్కాపురం, ఫిబ్రవరి 26: కారు, మినీ లారీ ఢీకొన్న సంఘటనలో ముగ్గురు మృతి చెందిన సంఘటన ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం మేకలవారిపల్లి గ్రామ సమీపాన ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండల తహశీల్దార్ రమణరావు భార్య బత్తుల మాధవి, ఆమె సోదరుడు రఘురాం గ్రూప్-2 పరీక్ష రాయడానికి శనివారం రాత్రి మార్కాపురం చేరుకున్నారు.

02/27/2017 - 04:12

శ్రీశైలం, ఫిబ్రవరి 26: ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో ఆదివారం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ముగింపు సూచకంగా ఉదయం యాగశాలలో చండీశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే అర్చక వేదపండితులు దేవస్థానం ఇఓ నారాయణ భరత్‌గుప్తా చేతుల మీదుగా యాగశాలలో పూర్ణాహుతి ద్రవ్యాలను యజ్ఞ వాటికలో సమర్పించారు.

02/27/2017 - 03:50

విజయవాడ (ఇంద్రకీలాద్రి), ఫిబ్రవరి 26: శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివార్ల కల్యాణ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం ఇక్కడ రథోత్సవం వైభవంగా జరిగింది. స్వామివారు సతీ సమేతంగా సర్వాభరణాలు ధరించి రథాన్ని అధిష్టించి, పాతబస్తీ కెనాల్ రోడ్‌లో ఊరేగుతూ సర్వ భక్తకోటికి దివ్యదర్శనమిచ్చారు.

02/27/2017 - 03:49

విజయవాడ, ఫిబ్రవరి 26: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 స్క్రీనింగ్ పరీక్ష పకడ్బందీ ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా జరిగింది. తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో సహా రాష్ట్రంలో మొత్తం 1462 పరీక్ష కేంద్రాలు ఏర్పాటయ్యాయి. మొత్తం 6,47,010 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 4,83,321 మంది (73.50 శాతం) అభ్యర్థులు హాజరయ్యారు.

02/27/2017 - 03:46

విశాఖపట్నం, ఫిబ్రవరి 26: హిందువులను, హిందూ మతాన్ని కించపరిచే విధంగా చాలా మంది చేస్తున్న వ్యాఖ్యలను ఇకపై మానుకోవాలని కాకినాడ శ్రీ పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి హితవు పలికారు. స్థానిక బివికె కాలేజీ 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం పూర్వ విద్యార్థుల, ఆచార్యుల సమ్మేళనం ఇక్కడ జరిగింది.

02/27/2017 - 03:43

శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 26: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో 7వ రోజైన స్కందరాత్రి సందర్భంగా ఆదివారం ఉదయం అధికార నంది వాహనంపై గంగాదేవి సమేతుడైన సోమస్కందమూర్తి ఊరేగారు. ఉదయం ఆలయంలో అభిషేకాలు పూర్తయిన తరువాత అలంకార మండపం నుంచి ఉత్సవమూర్తులను తీసుకెళ్లి ఊరేగించారు. గంగాదేవి సమేతుడైన సోమస్కందమూర్తి అధికార నంది వాహనంపై జ్ఞానప్రసూనాంబ కామధేనువు వాహనంపై భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.

02/27/2017 - 03:40

అమరావతి, ఫిబ్రవరి 26: తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీ ఎన్నికల టెన్షన్ పెరుగుతోంది. మరికొన్ని గంటల్లో అభ్యర్థులను ఖరారు చేయనున్న నేపథ్యంలో ఆశావహులు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు లోకేష్, పొలిట్‌బ్యూరో సభ్యులపై ఒత్తిళ్లు తెస్తున్నారు. సోమవారం మంచిరోజు అయినందున ఉదయం అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. సోమవారం మధ్యాహ్నమే నామినేషన్లు వేస్తారంటున్నారు.

02/27/2017 - 03:40

నెల్లూరు టౌన్, ఫిబ్రవరి 26: నగరంలోని టౌన్‌హాల్‌లో ఆదివారం డాక్టర్ బెజవాడ గోపాల్‌రెడ్డి అవార్డు పురస్కారాన్ని సినీపాటల రచయిత వెనె్నలకంటి రాజేంద్రప్రసాద్‌కు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మాజీ ఎమ్మెల్యే, సిఆర్‌డిఎ సభ్యులు బీద మస్తాన్‌రావు, సింగీతం శ్రీనివాసరావు, భువనచంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా వెనె్నలకంటి మాట్లాడుతూ, ఈ అవార్డు పురస్కారం తనకు అందజేసినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.

02/27/2017 - 03:38

విజయవాడ, ఫిబ్రవరి 26: డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా, నగదు లావాదేవీల వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్‌లో నగదు అందుబాటులో ఉండటంతో డిజిటల్ లావాదేవీల సంఖ్య తగ్గుతోంది. జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో డిజిటల్ లావాదేవీలు తగ్గినట్లు రిజర్వు బ్యాంక్ లెక్కలే చెపుతున్నాయి.

02/27/2017 - 03:38

విశాఖపట్నం, ఫిబ్రవరి 26: రాష్ట్ర మంత్రుల్లో చాలా మంది అవినీతికి పాల్పడుతున్నా, వారిని ముఖ్యమంత్రి చంద్రబాబు వెనకేసుకువస్తున్నారని ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ఆదివారం ఇక్కడ జరిగిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. విశాఖలో ల్యాండ్ పూలింగ్ పేరుతో భారీ కుంభకోణం జరిగిందని, ఇందులో కొంతమంది మంత్రుల హస్తం ఉందని ఆరోపించారు.

Pages