S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/10/2016 - 03:00

బ్రహ్మసముద్రం/రాయదుర్గం, అక్టోబర్ 9: రాష్ట్రంలో కరవుబారిన పడిన రైతులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏమాత్రం పట్టించుకోవడం లేదని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. అనంతపురం జిల్లాలో కరవుబారిన పడిన రైతులకు భరోసా కల్పించేందుకు ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు.

10/10/2016 - 02:57

శ్రీకాకుళం, అక్టోబర్ 9: రాష్ట్రాన్ని అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధిలో కూడా ముందుంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిరంతరం పాటుపడుతున్నారని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రతిష్ఠాత్మకమైన అనేక విద్యా సంస్థలను ఏర్పాటు చేసి ఎడ్యుకేషన్ స్టేట్‌గా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

10/09/2016 - 04:48

వరంగల్, అక్టోబర్ 8: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మొక్కుకున్నట్లుగానే వరంగల్ భద్రకాళి అమ్మవారికి బంగారు కిరీటం బహూకరించనున్నారు. దాదాపు 3.60 కోట్ల రూపాయలతో 11 కిలోల బంగారంతో తయారు చేయించిన ఈ కిరీటాన్ని అమ్మవారికి బహూకరించనున్నారు. ఈమేరకు ఆదివారం సిఎం కెసిఆర్ సతీసమేతంగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకోనున్నారు.

10/09/2016 - 04:48

పాలకొల్లు, అక్టోబర్ 8: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ఆర్యవైశ్య కల్యాణ మండపంలో దేవీ నవరాత్రి సందర్భంగా శనివారం అమ్మవారిని కోటి రూపాయల కరెన్సీ నోట్లతో ధనలక్ష్మిదేవిగా అలంకరించారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన వేలాది భక్తులతో వీధి కిక్కిరిసింది. ముఖ్యంగా మహిళా భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు.

10/09/2016 - 04:46

హైదరాబాద్, అక్టోబర్ 8: పాత తరం మహిళా కవయిత్రులకు ధీటుగా నేటి తరం మహిళలు కూడా కవితల పట్ల ఆసక్తిని పెంచుకుంటున్నారని శీలా సుభద్రాదేవి పేర్కొన్నారు.

10/09/2016 - 04:45

హైదరాబాద్, అక్టోబర్ 8: ఉద్యమాలతో సర్కారును వణిస్తున్న కాపునేత ముద్రగడను ఎదుర్కొనే స్థాయి నేతలు లేకపోవడం తెలుగుదేశం పార్టీకి సమస్యగా మారింది. కాపుకార్పొరేషన్ రుణాలు, ఆ కులానికి చెందిన విద్యార్థులు విదేశాలకు వెళుతున్నా ముద్రగడ చేస్తున్న ప్రచారానికి మెజారిటీ కాపు వర్గం ఆకర్షితులన్న వైనం పార్టీ నాయకత్వానికి ఆందోళనగా పరిణమించింది. దీనిపై ఏం చేయాలో తెలియక మల్లగుల్లాలు పడుతోంది.

10/09/2016 - 04:42

శ్రీశైలం, అక్టోబర్ 8: శ్రీశైలం మహాక్షేత్రంలో జరుగుతున్న శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు శనివారం భ్రమరాంబిక అమ్మవారు శ్రీ మహాగౌరి అలంకారంలో దర్శనమిచ్చారు. స్వామి అమ్మవార్లకు నందివాహన సేవ నిర్వహించారు. అమ్మవారు, స్వామికి ఉదయం ప్రత్యేక పూజలు నిర్వసించారు. అమ్మవారికి మహాగౌరి అలంకారం, స్వామిని నందివాహనంపై ఆశీనులను చేశారు.

10/09/2016 - 04:41

సారవకోట, అక్టోబర్ 8: శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం బుడితి జంక్షన్ సమీపంలోని జీడిపప్పు ఫ్యాక్టరీ ఆవరణలో మూడు అడుగుల పొడవుతో బీరకాయలు కాస్తున్నాయి. సాధారణంగా బీరకాయలు అడుగు లేక అడుగున్నర పొడవులో ఉంటాయి. ఈ మిల్లు ఆవరణలో గత రెండేళ్లుగా మూడు అడుగులకు పైగా పొడవుతో లావుపాటి బీరకాయలు కాయటంతో వీటిని చూసేందుకు సమీప గ్రామాల ప్రజలు వస్తున్నారు.

10/09/2016 - 04:39

పోలవరం, అక్టోబర్ 8: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు శనివారం నుంచి పూర్తిస్థాయిలో నిలిచిపోయాయి. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేయాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచూ పంచువల్ విధానంతో పనులను పరిశీలిస్తూ పనులు వేగవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

10/09/2016 - 04:39

విశాఖపట్నం, అక్టోబర్ 8: దేశం ఇప్పుడు సాంకేతికతవైపు పరుగులు తీస్తోంది. దైనందిన జీవితంలో చేసే ప్రతి పనిలో టెక్నాలజీ వినియోగం తప్పనిసరైపోతోంది. ఈ సాంకేతిక పరిజ్ఞానం విద్యారంగంలో కీలక భూమిక పోషిస్తోంది. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానానికి యువశక్తి తోడైతే దేశ భవిష్యత్ దేదీప్యమానం అవుతుంది. దీన్ని పూర్తిగా నమ్మిన విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ విభాగం సరికొత్త ప్రయోగం చేసింది.

Pages