S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/11/2016 - 06:17

విజయవాడ, అక్టోబర్ 10: ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శ్రీ దుర్ముఖ నామ సంవత్సర దసరా మహోత్సవాల్లో పదో రోజైన ఆశ్వయుజ శుద్ధ నవమి సోమవారం శ్రీ దుర్గాదేవి శ్రీ మహిషాసుర మర్దనీదేవి అలంకారంలో దర్శనమిచ్చి భక్తకోటిని పులకింపచేసింది. ఈ దసరా వేడుకల్లో అత్యంత పర్వదినాలైన మూడింటిలో శరన్నవమి అత్యంత పవిత్రమైంది.

10/11/2016 - 06:14

హైదరాబాద్, అక్టోబర్ 10: రాష్ట్రం విడిపోయిన రెండున్నరేళ్ల తర్వాత అమరావతిలో సొంత పాలన మొదలుకానుంది. విజయదశమి పర్వదినం నుంచి నవ్యాంధ్ర దశ తిరుగుతుందన్న ఆశాభావం ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో వ్యక్తమవుతోంది. హైదరాబాద్ సచివాలయం నుంచి వెలగపూడి తాత్కాలిక రాజధానిలో పాలన ప్రారంభం కానుండటం ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతోంది.

10/11/2016 - 06:13

శ్రీశైలం, అక్టోబర్ 10: శ్రీశైలం మహాక్షేత్రంలో జరుగుతున్న శరన్నవరాత్రుల్లో భాగంగా సోమవారం శ్రీభ్రమరాంబదేవి అమ్మవారు రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీమల్లికార్జున స్వామి, అమ్మవార్లు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

10/11/2016 - 06:12

రాజమహేంద్రవరం, అక్టోబర్ 10: కోస్తా నేలలకు కొత్త వంగడంగా ఈ ఖరీఫ్ నుంచి వ్యవసాయ శాఖ సిఫార్సుచేసిన ఆర్‌పి బయో-226 వరి వంగడంలో కల్తీ ఉదంతంపై వ్యవసాయ శాఖ ముమ్మరంగా సర్వే చేపట్టింది. ఈ విత్తనంలో కల్తీ జరిగిందని ‘ఆంధ్రభూమి’ వెలుగులోకి తెచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అన్ని కోణాల్లో విచారణ జరుగుతోంది.

10/11/2016 - 06:04

తిరుమల, అక్టోబర్ 10: శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇటు వాహన సేవలు చూడటానికే కాకుండా స్వామివారిని దర్శించుకోవడానికి కూడా భక్తులు పోటెత్తారని ఆలయ డిప్యూటీ ఇఓ కోదండరామారావు తెలిపారు. సోమవారం స్థానిక మీడియా సెంటర్‌లో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ 8 రోజుల వ్యవధిలో 6.74 లక్షల మంది మూలవిరాట్టును దర్శించుకున్నారని, వారు హుండీలో సమర్పించిన కానుకల ద్వారా 17.30 కోట్ల రూపాయలు ఆదాయం లభించిందన్నారు.

10/11/2016 - 06:03

తిరుమల, అక్టోబర్ 10: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు సోమవారం ఉదయం 7 గంటలకు శ్రీ స్వామివారు ధారురథంపై తిరుమల మాడ వీధులలో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. సుమారు లక్ష మందికి పైగా భక్తులు ఈ రథోత్సవంలో పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించారని అంచనా.

10/11/2016 - 05:57

రాజమహేంద్రవరం, అక్టోబర్ 10: తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ఉద్ధృతి మళ్లీ పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద సోమవారం మధ్యాహ్నం 8.7 అడుగులున్న నీటిమట్టం రాత్రికి 9.4 అడుగులకు పెరిగింది. బ్యారేజికివున్న మొత్తం 175 గేట్లను ఒక మీటరు మేర ఎత్తివేశారు. బ్యారేజి నుంచి 3 లక్షల 77 వేల 488 క్యూసెక్కుల వరద జలాలను సముద్రంలోకి వదిలేశారు.

10/11/2016 - 05:49

ప్రపంచంలోనే మన శాస్తవ్రేత్తలు మేటి
ప్రతి వర్శిటీ ఓ పరిశోధన కేంద్రం కావాలి సగటు మనిషికి సాంకేతికత అందాలి
ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు ఘనంగా అంతరిక్ష వారోత్సవాల ముగింపు

10/11/2016 - 05:47

విశాఖపట్నం, అక్టోబర్ 10: పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు ఉచితంగా కందిపప్పు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రం గిరిజన ప్రాంతాల్లో నెలకు కిలో చొప్పున ఏడాదిపాటు ఉచితంగా కందిపప్పు పంపిణీ చేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు.

10/11/2016 - 05:45

హైదరాబాద్, అక్టోబర్ 10: ముఖ్యమంత్రి సీఎంఓ కార్యాలయ ప్రవేశ ముహుర్తం మారింది. మంగళవారం దసరా రోజు చంద్రబాబు సీఎంఓ కార్యాలయంలో పూజ చేసి, లాంఛనంగా కార్యాలయ కార్యకలాపాలు ప్రారంభిస్తారని, పూర్తిస్థాయిలో పనులు కానందున పూజలు మాత్రమే జరిపి, మొత్తం పనులు పూర్తయ్యేవరకూ విజయవాడ క్యాంపు ఆఫీసు నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తారని తొలుత అధికార వర్గాలు చెప్పాయి.

Pages