S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/17/2016 - 05:56

విజయనగరం (్ఫర్టు), జూలై 16: వైకాపా నాయకులు అభివృద్ధి నిరోధకులుగా తయారయ్యారని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాల చినరాజప్ప ఆరోపించారు. శనివారం ఇక్కడి ఎమ్మెల్యే మీసాల గీత స్వగృహంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం పట్టని ఆ పార్టీ నేతలకు తమ ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి లేదన్నారు. గడపగడపకూ వైకాపా పేరుతో ఆ పార్టీ నేతలకు ప్రజల్లో అసలు విలువే లేదన్నారు.

07/17/2016 - 05:55

విజయవాడ, జూలై 16: రాష్ట్రంలో ఒక కోటీ 35 లక్షల 31వేల మంది అత్యల్ప ఆదాయ వర్గాల కుటుంబాలకు రేషన్ కార్డులు అందివ్వడం జరిగిందని వీరిలో ఎస్‌సి, ఎస్‌టి కుటుంబాలు 17లక్షల 06వేలు వున్నాయని, అయితే వీరిలో 78వేల 029 మంది రేషన్ సరుకులు తీసుకువెళ్లటం లేదని గుర్తించటం జరిగిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు.

07/17/2016 - 05:55

మడకశిర, జూలై 16: పేదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలు తొలగించడానికే ప్రభుత్వం ప్రజా సాధికార సర్వే నిర్వహిస్తోందని పిసిసి అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. అతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాసాధికార సర్వే వల్ల నిరుపేదలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు.

07/17/2016 - 05:54

బళ్ళారి, జూలై 16: తుంగభద్ర జలాశయానికి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాలో కురుస్తున్న వర్షం నీరు, తుంగ జలాశయం నుంచి విడుదలైన నీళ్లు జలాశయానికి చేరుకుంటున్నాయి. శనివారం జలాశయానికి 1.5 టిఎంసిల నీరు వచ్చి చేరింది. దీంతో జలాశయం నీటి నిల్వ 36.683 టిఎంసిలకు చేరింది. ఇన్‌ఫ్లో 16 వేల క్యూసెక్కులుగా నమోదైంది. నీటిమట్టం 1610.74 అడుగులకు చేరుకుంది.

,
07/17/2016 - 02:58

గాజువాక, జూలై 16: మాయ మాటలు చెప్పి మైనర్ బాలికను మరో మహిళ వివాహం చేసుకున్న సంఘటన గాజువాకలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మైనర్ బాలిక తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జాలారిపేట గ్రామానికి చెందిన కె.ఎలమాజీ అలియాస్ తేజ అనే మహిళ మూడు నెలల క్రితం పెదగంట్యాడ మండలం కొత్త దిబ్బపాలెం వచ్చింది.

07/17/2016 - 02:52

హైదరాబాద్, జూలై 16: అవినీతిలో ఆంధ్రప్రదేశ్ నెంబర్-1గా నిలిచిందని ఎపి కాంగ్రెస్ నాయకుడు, శాసనమండలిలో ప్రతిపక్ష నేత సి. రామచంద్రయ్య విమర్శించారు. అవినీతి రహిత రాష్ట్రంగా పేరు సంపాదించినప్పుడే పెట్టుబడులు వస్తాయని ఆయన శనివారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. పెట్టుబడులు రాబట్టేందుకు విదేశీ విహారాలు చేసినంత మాత్రాన పరిశ్రమల స్థాపనకు ఎవరూ ముందుకు రారని ఆయన తెలిపారు.

07/16/2016 - 18:12

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని కొవ్వాడ వద్ద ఏర్పాటు చేసే అణువిద్యుత్ ప్లాంటు వల్ల భవిష్యత్‌లో ఉత్తరాంధ్ర ప్రాంతానికి పెను ప్రమాదం పొంచి ఉందని సిపిఎం అగ్రనేత ప్రకాష్ కారత్ అన్నారు. ఆయన శనివారం కొవ్వాడ ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కొవ్వాడలో ఏకంగా ఆరు అణురియాక్టర్లను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైందన్నారు.

07/16/2016 - 18:09

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు మేలు జరిగేలా పార్లమెంటులో తమ గళం విప్పుతామని వైకాపా ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. అవసరమైతే అన్ని పక్షాలను కలుపుకుపోయి రాష్ట్రానికి మంచి జరిగేలా కృషి చేస్తామన్నారు. విభజన చట్టంలో హామీలు, పోలవరం ప్రాజెక్టు, రైల్వేజోన్ ఏర్పాటు, కేంద్రం నిధులు, ప్రత్యేక హోదా వంటి అంశాలపై తమ ఎంపీలు పోరాడతారని ఆయన ప్రకటించారు.

07/16/2016 - 18:07

అనంతపురం: ప్రభుత్వం చేపట్టిన సాధికార సర్వేపై విపక్షాలు చేస్తున్న విష ప్రచారాన్ని నమ్మరాదని ఎపి ఐటి, సమాచారశాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి శనివారం ఇక్కడ మీడియాతో అన్నారు. సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందించాలన్న సంకల్పంతో సర్వేను చేపట్టామన్నారు. ప్రభుత్వానికి జనాదరణ పెరుగుతోందన్న కక్షతోనే విపక్షాలు సర్వేపై అసత్య ప్రచారం చేస్తున్నాయన్నారు.

07/16/2016 - 18:02

గుంటూరు : ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించే బిడ్డల సంరక్షణకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ (ఆర్‌ఎఫ్‌ఐడీ )ట్యాగ్‌ పథకాన్ని మంత్రి కామినేని శ్రీనివాస్‌ శనివారం గుంటూరు ఆసుపత్రిలో ప్రారంభించారు. ఇలాంటి పథకాన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అమలు చేయడం మన దేశంలో ఇదే తొలిసారి అని కామినేని తెలిపారు.

Pages