S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/13/2016 - 08:19

హైదరాబాద్, జూలై 12: అత్యాధునిక శాస్త్ర సాంకేతక ఆరోగ్యకర సమాజాన్ని స్థాపించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు చెబుతున్నా, రాష్ట్రంలో పాఠశాలల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. రేషనలైజేషన్ పేరుతో ప్రతి జిల్లాలో పాఠశాలలను మూసివేయడంతో డ్రాపవుట్ల సంఖ్య పెరుగుతోంది.

07/13/2016 - 08:18

విశాఖపట్నం, జూలై 12: జాతి భవిష్యత్ అవసరాల దృష్ట్యా భద్రత ప్రాధాన్యత పెరింగిందని, ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకే మార్కోస్ కమాండో ఫోర్సు అవసరమని నౌకాదళ ప్రధానాధికారి అనీల్ లాంబ పేర్కొన్నారు. తూర్పు నౌకాదళం కేంద్రంగా ఐఎన్‌ఎస్ కర్ణ (మార్కోస్ ఈస్ట్)ను విశాఖలో మంగళవారం ఆయన ప్రారంభించారు. దేశంలోనే రెండో కమాండో ఫోర్సుగా మార్కోస్ ఈస్ట్ రక్షణ సేవల్లో నిమగ్నమయ్యేందుకు సిద్ధమైంది.

07/13/2016 - 08:18

రాజమహేంద్రవరం, జూలై 12: గోదావరి పుష్కరాల్లో జరిగిన ఘోరానికి శుక్రవారం నాటికి సరిగ్గా ఏడాది పూర్తి కావొస్తోంది. గోదావరి మహా పుష్కరాలను పురస్కరించుకుని రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ వద్ద గత ఏడాది జూలై 14న భారీ తొక్కిసలాట జరిగిన సంగతి విదితమే. ఈ దుర్ఘటనలో 30 మంది మృత్యువాత పడగా, 61మంది గాయపడ్డారు.

07/13/2016 - 08:17

గుంటూరు, జూలై 12: వర్షాకాల సమావేశాల్లో విభజన హామీలు.. ప్రత్యేక హోదా.. కేంద్ర ప్రభుత్వం.. విపక్షాలు ప్రవేశపెట్టే బిల్లులపై ఆచితూచి అడుగేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ప్రభుత్వం ఏర్పాటయి ఇప్పటికి రెండేళ్లు గడిచిన నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీల అమలు.. విశాఖ రైల్వేజోన్ అంశాలను ప్రస్తావించాలని టీడీపీ పార్లమెంటరీ పార్టీ భావిస్తోంది.

07/13/2016 - 08:39

అనంతపురం, జూలై 12: దేశ భవిష్యత్తుకు, ప్రపంచ గమనానికి యువత నాంది పలకాలని, యువశక్తే దేశానికి మహాశక్తి అని కేంద్ర ఇంధనం, బొగ్గు గనులశాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. మంగళవారం అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి సేవాసంస్థల ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ యువజన మహోత్సవం-2016 ను కేంద్రమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ గమనాన్ని మార్చే శక్తి యువతకుందన్నారు.

07/13/2016 - 07:08

పట్టిసం ఎత్తిపోతల పథకాన్ని గోదావరి వరద తాకింది. గోదావరి నీటిమట్టం పెరగడంతో పథకంలోని బావుల ద్వారా పంపుల వద్దకు వరద నీరు చేరింది. ప్రస్తుతం ఎత్తిపోతల వద్ద నీటిమట్టం 24 మీటర్లు ఉందని అధికారులు తెలిపారు.
నిలిచిన పోలవరం పనులు

07/13/2016 - 05:14

రాజమహేంద్రవరం/ఏలూరు, జూలై 12: ఉప నదులు..వాగులు.. వంకలు.. ఏరులు.. సెలయేర్లను పెనవేసుకుంటూ గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ధవళేశ్వరం బ్యారేజి వద్ద మంగళవారం సాయంత్రానికి 13.75 అడుగుల మట్టాన్ని దాటుకుని మూడో ప్రమాద హెచ్చరిక స్థాయి అంటే 17.75 అడుగుల మట్టం దిశగా ప్రవాహ ఉద్ధృతి కొనసాగుతోంది.

07/13/2016 - 05:05

గుంటూరు, జూలై 12: ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి రెండోవిడత ఉద్యోగుల తరలింపునకు ముహూర్తం కుదరటంలేదు..నిర్దేశించిన గడువుప్రకారం బుధవారం ఐదో బ్లాక్‌కు మరో మూడు శాఖలను తరలించాల్సి ఉంది. రోడ్లు, భవనాలు, కార్మికశాఖ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఉద్యోగులు సుమారు 200 మంది వరకు ప్రత్యేక బస్సులలో తరలివచ్చేందుకు సన్నద్ధమయ్యారు. అయితే ఇంటీరియర్ డెకరేషన్ పనులు ఇంకా పూర్తికాలేదని అధికారులు చెబుతున్నారు.

07/13/2016 - 05:04

విజయవాడ, జూలై 12: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారుల నుంచి మెరుగైన ఫలితాలను రాబట్టాలని చూస్తున్నారు. ఇందుకోసం ఆయన అనేక మార్గాలను అనుసరిస్తున్నారు. స్కూల్లో విద్యార్థులకు ప్రోగ్రస్ కార్డు ఇచ్చినట్టు, అధికారులకు రేటింగ్ ఇస్తూ ముఖ్యమంత్రి కొత్త విధానానికి తెర తీశారు. ఈ రేటింగ్ వివరాలను సిఎం డ్యాష్ బోర్డులో అందుబాటులో ఉంచారు. ఇందులో నాలుగు విభాగాలు ఉన్నా యి.

07/12/2016 - 04:15

సీతంపేట, జూలై 11: శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఏజెన్సీతో పాటు మైదాన ప్రాంతాల్లో సంచరిస్తున్న ఏనుగులు గిరిజనులు, మైదాన ప్రాంతవాసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. సీతంపేట, కొత్తూరు, హిరమండలం, ఎల్‌ఎన్‌పేట మండలాల్లో స్వైరవిహారం చేస్తున్న ఏనుగుల గుంపు పంటలకు కూడా తీవ్రంగా నష్టం కలిగిస్తున్నాయి.

Pages