S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/12/2016 - 06:14

నెల్లూరు, జూన్ 11: నెల్లూరు జిల్లా ఇన్‌చార్జ్ విద్యాశాఖాధికారిగా రాజీవ్ విద్యా మిషన్ ప్రాజెక్ట్ డైరక్టర్ కనక నరసారెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఎం.జానకి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా శనివారం జరగాల్సిన ఉపాధ్యాయుల అంతర్‌జిల్లాల బదిలీలు వాయిదా పడ్డాయి. ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాలకు చెందిన 46 మంది ఉపాధ్యాయులు అంతర్ జిల్లాల బదిలీలపై నెల్లూరు జిల్లాకు వచ్చారు.

06/12/2016 - 06:13

విజయవాడ, జూన్ 11: కృష్ణా పుష్కరాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాషా సాంస్కృతికశాఖ ఒక విశిష్ట పరిశోధనా గ్రంథాన్ని విడుదల చేయడానికి నిర్ణయించింది. ఈ సంచిక కొరకు తెలుగు భాష, సాహిత్య, సాంస్కృతిక, ప్రజా జీవన విధానాలపై పరిశోధనా వ్యాసాలను ఆహ్వానిస్తున్నారు. ఆసక్తిగల పరిశోధకులు తమ రచనలను జూన్ 30లోపు పంపాలన్నారు.

06/12/2016 - 06:10

హైదరాబాద్, జూన్ 11: ఆంధ్రా మున్సిపల్ స్కూళ్లలో తెలుగు, ఇంగ్లీషు మీడియం కొనసాగించాలని యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఐ వెంకటేశ్వరరావు, ప్రధానకార్యదర్శి బాబురెడ్డిలు డిమాండ్ చేశారు. పురపాల సంఘం ప్రాధమిక పాఠశాలల్లో మాతృభాషలోనే విద్యా బోధన జరగాలని వారు కోరారు. ఇంగ్లీషును ఒక సబ్జెక్టుగా బోధించాలని, అందులో ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని అన్నారు.

06/11/2016 - 19:42

హైదరాబాద్: సిఎల్‌పి నేత జానారెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేసినందుకు ఎంపీ పాల్వాయి గోవర్ధన రెడ్డికి, పార్టీ సభలో అనుచితంగా వ్యవహరించినందుకు ఎస్సీ సెల్ చైర్మన్ ఆరేపల్లి మోహన్‌కు టి.పిసిసి శనివారం షోకాజ్ నోటీసులు జారీ చేసంది. ఈనెల 17లోగా సంజాయిషీ ఇవ్వాలని,క్రమశిక్షణ సంఘం ముందు హాజరు కావాలని పిసిసి ఆదేశించింది.

06/11/2016 - 19:41

విజయవాడ: ప్రజారాజ్యం పార్టీ పెట్టి, ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి ఎంపి పదవి పొందిన సినీనటుడు చిరంజీవి ఏనాడైనా కాపుల గురించి పట్టించుకున్నారా? అని మంత్రి నారాయణ ప్రశ్నించారు. కాపుగర్జన సందర్భంగా రైలును తగలబెట్టిన వారిని శిక్షించవద్దా? అని ఆయన అన్నారు.

06/11/2016 - 19:39

విశాఖ: విశాఖ జిల్లా తగరపువలస వద్ద జాతీయరహదారిపై రోడ్డుపై ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొనడంతో వెంకట అప్పారావు అనే హోంగార్డు అక్కడికక్కడే మరణించాడు. మితిమీరిన వేగంతో బైక్ నడపడం వల్లే ఈ ఘటన జరిగింది.

06/11/2016 - 12:04

హైదరాబాద్: కాపుగర్జన సందర్భంగా తుని వద్ద జరిగిన విధ్వంసకాండలో నిజానిజాలను వెలికితీసేందుకు సిబిఐ చేత విచారణ జరిపించాలని కాంగ్రెస్ ఎంపీ, సినీనటుడు చిరంజీవి డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన ఎపి సిఎం చంద్రబాబుకు శనివారం ఓ లేఖ పంపారు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను అరెస్టు చేసిన తీరు సమంజసంగా లేదని ఆయన తన లేఖలో నిరసన వ్యక్తం చేశారు. ముద్రగడ పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారన్నారు.

06/11/2016 - 11:55

గుంటూరు: గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోని ఆదర్శకాలనీలో ఓ వ్యక్తి హత్యకు గురైన ఘటన శనివారం ఉదయం వెలుగు చూసింది. వివాహేతర సంబంధం వల్లే ఈ దారుణం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.

06/11/2016 - 11:52

నెల్లూరు: నెల్లూరు జిల్లా వేదాయపాలెంలోని బ్యాంకు ఆఫ్ ఇండియా ఎటిఎం కేంద్రంలోకి శుక్రవారం అర్ధరాత్రి దాటాక కొందరు దుండగులు ప్రవేశించారు. ఎటిఎంను ధ్వంసం చేసి నగదును చోరీ చేసేందుకు వారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇంతలో స్థానికుల హడావుడితో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.

06/11/2016 - 11:52

ఒంగోలు: ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలోని విజయాబ్యాంకు శాఖలో శుక్రవారం అర్ధరాత్రి కొందరు దుండగులు ప్రవేశించి చోరీకి యత్నించారు. ఇంతలో స్థానికులు మేల్కొనడంతో దొంగలు పరారయ్యారు. దొంగల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

Pages