S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/10/2016 - 17:35

విజయవాడ: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదినం సందర్భంగా తెదేపా కార్యకర్తలు మొక్కలు నాటారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్‌, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

06/10/2016 - 17:33

హైదరాబాద్‌: స్థానికతకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపటం సంతోషకరమని ఏపీ గెజిటెడ్‌ అధికారుల ఐకాస అధ్యక్షుడు కృష్ణయ్య అన్నారు. స్థానికతపై వారం రోజుల్లో గెజిట్‌ ప్రకటన రావటం అభినందనీయమన్నారు.

06/10/2016 - 16:30

గుంటూరు: పిడుగురాళ్లలో శుక్రవారం కొద్ది సెకన్లపాటు భూమి కంపించింది. జనం భయాందోళనలకు లోనై ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.

06/10/2016 - 16:30

విశాఖ: ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొడుతున్నందునే ఎపిలో సాక్షి టీవీ చానల్ ప్రసారాలను నిలిపివేయాల్సి వచ్చిందని మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. రాజకీయ ప్రయోజనాలను ఆశించి ఆ చానల్‌లో తప్పుడు కథనాలను ప్రసారం చేస్తున్నారని ఆరోపించారు. ఉనికి కోసమే దీక్షలు చేస్తూ ముద్రగడ పద్మనాభం కాపు కులస్థులను తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు.

06/10/2016 - 16:29

హైదరాబాద్: ఎపి సచివాలయంలో నాల్గో తరగతి ఉద్యోగులు ముఖాలకు నలుపు గుడ్డలు కట్టుకుని శుక్రవారం ఆందోళన చేశారు. తమను తెలంగాణ సర్కారుకు కేటాయించాలని, ఈ విషయమై గతంలో సిఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని వీరు కోరుతున్నారు. కొన్నాళ్లు పనిచేశాక తెలంగాణ ప్రభుత్వంలోకి తీసుకుంటామని కెసిఆర్ హామీ ఇచ్చి రెండేళ్లు గడిచాయని అంటున్నారు.

06/10/2016 - 16:28

కాకినాడ: ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించేవారు ఎంతటివారైనా చట్టప్రకారం కేసులను ఎదుర్కొనక తప్పదని తూ.గో జిల్లా ఎస్పీ రవిప్రకాష్ హెచ్చరించారు. పురుగుమందు సీసా పట్టుకుని ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించిన కాపు ఉద్యమనాయకుడు ముద్రగడ పద్మనాభంపైనా కేసులు నమోదు చేశామని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ముద్రగడ దీక్ష, అరెస్టు నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయన్నారు.

06/10/2016 - 16:28

హైదరాబాద్: కాపుగర్జన సందర్భంగా తుని వద్ద హింసాత్మక సంఘటనలకు పోలీసులే కారకులని కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య ఆరోపించారు. మఫ్టీలో ఉన్న పోలీసులు ప్రయాణీకులందరినీ కిందకు దించాక రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు వ్యాపించాయని అన్నారు. ఈ ఘటనపై సిఐడి పోలీసులకు బదులు సిబిఐ చేత విచారణ జరిపించాలన్నారు.

06/10/2016 - 16:27

నెల్లూరు: తుని విధ్వంసకాండకు సంబంధించి నేరస్థులను పోలీసులు అరెస్టు చేస్తుంటే వైకాపా అధినేత జగన్‌కు అభ్యంతరం ఎందుకని టిడిపి నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. కాపులను రెచ్చగొట్టి అశాంతిని సృష్టించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.

06/10/2016 - 16:27

విజయవాడ: ఇక్కడి కృష్ణానదీ తీరంలో సీతమ్మవారి పాదాల వద్ద శనీశ్వరాలయాన్ని కూల్చివేయరాదని ఓ వ్యక్తి శుక్రవారం ఆత్మహత్యకు యత్నించాడు. పుష్కర ఘాట్ల నిర్మాణాలను మంత్రి దేవినేని ఉమ, ఎమ్మెల్యే బోండా ఉమా, మేయర్ శ్రీధర్ పరిశీలించి శనీశ్వరాలయాన్ని కూల్చివేయాలని నిర్ణయించారు. దీంతో అక్కడే ఉన్న ఓ వ్యక్తి శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించాడు.

06/10/2016 - 15:21

విజయవాడ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 26 నుంచి 29 వరకు చైనాలో పర్యటించనున్నారు. పెట్టుబడుల కోసం వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ అవనున్నారు. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు.

Pages