S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/11/2016 - 11:51

రాజమండ్రి: రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంకు ప్రత్యేక వైద్యసేవలు అందించాలని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖామంత్రి కామినేని శ్రీనివాస్ ఆదేశించారు. దీంతో కాకినాడ నుంచి బోధనాసుపత్రి నుంచి నలుగురు సీనియర్ వైద్యులను ఇక్కడికి రప్పించారు. ముద్రగడ ఆరోగ్య పరిస్థితి గురించి మంత్రి ఆరా తీశారు.

06/11/2016 - 07:59

విశాఖపట్నం, జూన్ 10: రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవల కింద రోగులకు అందుతున్న సేవలు ఇకపై ఎన్టీఆర్ వైద్య పరీక్షా కేంద్రాల ద్వారానే అందనున్నాయి. ఇప్పటి వరకూ మెడాల్ సంస్థ ద్వారా ఈ పరీక్షలు నిర్వహించేవారు. ఇక మీదట వైద్య పరీక్షలన్నీ ఎన్టీర్ పేరిటే నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య స్పష్టం చేశారు. ఈ మేరకు విశాఖలో శుక్రవారం ఆమె వైద్యాధికారులతో సమావేశమై ఆదేశాలు జారీ చేశారు.

06/11/2016 - 07:57

కాకినాడ, జూన్ 10: మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అరెస్టు అయ్యారా? లేక పోలీసుల అదుపులో ఉన్నారా? అనే విషయం అర్ధం కాని అయోమయ పరిస్థితి ఏర్పడింది. ఆయన సిఐడి కేసుల్లో అరెస్టు అయ్యారని, సిఐడి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్టు ముందుగా ప్రచారం జరిగింది.

06/11/2016 - 06:25

రాజమహేంద్రవరం, జూన్ 10: తొలిరోజు తొక్కిసలాట ఘటనపై గోదావరి పుష్కరాల్లో అంతా తానై వ్యవహరించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని విచారించాలని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ వాదించారు. తొక్కిసలాట దుర్ఘటనపై ఏర్పాటైన జస్టిస్ సోమయాజులు ఏకసభ్య కమిషన్ విచారణ శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో జరిగింది.

06/11/2016 - 06:24

చిత్తూరు, జూన్ 10: ఎర్రచందనం అక్రమ రవాణాలో స్మగ్లర్లకు మధ్యవర్తిగా ఉంటూ ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్న కోల్‌కకు చెందిన మహిళా స్మగ్లర్ సంగీత చటర్జీ చిక్కినట్టేచిక్కి తప్పించుకుంది. ఆమెను తమకు అప్పగించాలని చిత్తూరు పోలీసులు కోల్‌కతా హైకోర్టులో పిటిషను దాఖలు చేశారు. జిల్లాలో నమోదైన కేసుల విచారణ కోసం రావాల్సి ఉండగా రాకపోవడంతో జిల్లా పోలీసులు దీనిని సీరియస్‌గా తీసుకున్నారు.

06/11/2016 - 06:23

నెల్లూరు, జూన్ 10: తన ఆదేశాలు బేఖాతరు చేయడాన్ని సీరియస్‌గా తీసుకున్న జిల్లా కలెక్టర్ జానకి జిల్లా విద్యాశాఖాధికారి ఆంజనేయులు, అసిస్టెంట్ డైరక్టర్ విజయను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఈ మేరకు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిసింది. కాగా డిఇఓ ఆంజనేయులుకు ఇంకా మూడు నెలలే సర్వీసు ఉండడం గమనార్హం. డిఇఓ సరెండర్, ముగ్గురు ఉద్యోగుల సస్పెండ్‌కు దారితీసిన కారణాలు ఇలా ఉన్నాయి.

06/11/2016 - 06:22

విజయవాడ, జూన్ 10: ముద్రగడ పద్మనాభం చేపట్టిన కాపు ఉద్యమం రోజు రోజుకూ ఉధృతమవుతోంది. తన ఇంట్లో దీక్ష చేస్తున్న ముద్రగడను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఆసుపత్రిలో ఆయన దీక్ష కొనసాగిస్తున్నారు. దీంతో కాపు సంఘాలు ముద్రగడకు మద్దతుగా రంగంలోకి దిగుతున్నాయి. మరోపక్క రైలు దగ్థం చేసిన ఘటనలో అరెస్ట్‌లు, ముద్రగడ వ్యవహార శైలిపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మంత్రులు సమర్థిస్తూ వస్తున్నారు.

06/11/2016 - 06:13

హైదరాబాద్, జూన్ 10: ఆమరణ దీక్ష చేస్తున్న కాపునేత ముద్రగడ పట్ల పోలీసు బలగాలు అనుసరించిన తీరు దుర్మార్గమైనదని, ముద్రగడ కుమారుడ్ని కూడా పోలీసులు దారుణంగా కొట్టారని, తుని ఘటనలపై సిబిఐ చేత విచారణ జరిపించాలని ప్రతిపక్షనేత, వైకాపా అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.

06/11/2016 - 06:10

తిరుమల, జూన్ 10: తిరుమల వేంకటేశ్వర స్వామి భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డూలు తయారుచేసేందుకు టిటిడి యాజమాన్యం శ్రీవారి ఆలయం వెలుపల ఏర్పాటుచేసిన అదనపు పోటులో శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో అగ్నిమంటలు చెలరేగాయి.

06/11/2016 - 06:05

హైదరాబాద్,జూన్ 10: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తుని విధ్వంసం వెనుక రాయలసీమ రౌడీలు ఉన్నారన్న ప్రభుత్వ-అధికార పార్టీ ప్రచారం ఉత్తిదేనా? అదంతా వైసిపి నాయకత్వాన్ని వణికించే ఎత్తుగడలో భాగంగా కొనసాగుతున్న వ్యూహాత్మక మానసిక దాడి మాత్రమేనా?.. ఇప్పటివరకూ జరుగుతున్న అరెస్టుల పర్వం తీరు చూస్తుంటే, ఇలాంటి అనుమానాలే తెరపైకి వస్తున్నాయి.

Pages