S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/10/2016 - 13:24

విజయవాడ: కృష్ణా పుష్కరాలు సమీపిస్తున్నందున ఘాట్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని మంత్రి దేవినేని ఉమా అధికారులను ఆదేశించారు. ఇక్కడ కృష్ణా నది తీరాన నిర్మిస్తున్న పుష్కరఘాట్ల పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఆయన వెంట ఎమ్మెల్యే బొండా ఉమ, నగర మేయర్ శ్రీ్ధర్, అధికారులు పాల్గొన్నారు.

06/10/2016 - 13:23

విజయవాడ: నగరంలోని రవాణాశాఖ కార్యాలయంలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లుగా పనిచేస్తున్న మృత్యుంజయరాజు, కృష్ణవేణిలపై సస్పెన్షన్ వేటు పడింది. అవినీతి ఆరోపణలు రావడంతో వీరిపై ఉన్నతాధికారులు ఈ చర్య తీసుకున్నారని సమాచారం.

06/10/2016 - 13:23

హైదరాబాద్: ఆమరణ దీక్ష చేస్తున్న కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంపైన, ఆయన కుటుంబ సభ్యులపైన సిఎం చంద్రబాబు ఒత్తిడితో పోలీసులు దౌర్జన్యం చేశారని వైకాపా అధినేత వైఎస్ జగన్ శుక్రవారం ఇక్కడ మీడియాతో అన్నారు. సిఎం దారుణంగా ప్రవర్తిస్తున్నందున అన్ని వర్గాల వారూ తీవ్రంగా నిరసించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎపిలో సాక్షి టీవీ చానల్ ప్రసారాలను నిలిపివేయడం చంద్రబాబు నియంతృత్వానికి పరాకాష్ట అన్నారు.

06/10/2016 - 13:22

గుంటూరు: కోల్‌కతలోని ఓ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందేందుకు వెళ్లిన గుంటూరు జిల్లా ఉప్పలపాడుకు చెందిన సామినేని ఫణీంద్ర (22) అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఈ మేరకు సమాచారం అందడంతో యువకుడి తల్లిదండ్రులు హుటాహుటిన కోల్‌కతకు శుక్రవారం బయలుదేరి వెళ్లారు. తమ కుమారుడిని ఎవరో హత్య చేసి ఉంటారని వారు అనుమానిస్తున్నారు.

06/10/2016 - 11:29

నెల్లూరు: కోవూరు మండలం కొత్తూరు వద్ద ఓ రైస్‌మిల్లు శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. సుమారు 80 లక్షల రూపాయల మేరకు ఆస్తినష్టం జరిగిందని ప్రాథమిక అంచనా. ధాన్యం, బియ్యం నిల్వలతోపాటు మిల్లులోని యంత్రాలు అగ్నికి ఆహుతయ్యాయి.

06/10/2016 - 11:28

తిరుపతి: తిరుమలలోని స్వామివారి ఆలయ సమీపంలో బూందీ తయారీ పోటులో శుక్రవారం ఉదయం మంటలు వ్యాపించాయి. బూందీ తయారు చేస్తుండగా ఒక్కసారి మంటలు లేచి కొంతవరకూ వ్యాపించాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. అగ్నిప్రమాదం కారణంగా కొంత సేపు బూందీ తయారీని నిలిపివేయాల్సి వచ్చింది.

06/10/2016 - 11:28

విజయవాడ: వీరులపాడు మండలం పెద్దాపురం చెక్‌పోస్టు వద్ద పోలీసులు శుక్రవారం ఉదయం తనిఖీలు చేసి 50 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. రెండు వాహనాలను సీజ్ చేసి, ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.

06/10/2016 - 11:27

కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలోని రాజవొమ్మంగి, వై.రామవరం ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం పోలీసులు ఆకస్మికంగా దాడులు చేసి సుమారు 350 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని ఏజెన్సీ నుంచి ఇతర రాష్ట్రాలకు ఈ గంజాయిని తరలించేందుకు సిద్ధం చేశారు.

06/10/2016 - 11:13

అనంతపురం : ఎస్కే యూనివర్సిటీ నిర్వహించిన ఏపీ లాసెట్‌ - 2016 ప్రవేశ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. రాష్ట్ర ఐటీ శాఖమంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ వేణుగోపాల్‌రెడ్డి, ఎస్కేయూ ఉపకులపతి రాజగోపాల్‌, ఏపీ లాసెట్‌ కన్వీనర్‌ పుల్లారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. 3 ఏళ్లు, 5ఏళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులతో పాటు పీజీఎఎల్‌ఎం ప్రవేశ పరీక్షకు 10,499మంది విద్యార్థులు హాజరయ్యారు.

06/10/2016 - 08:24

హిందూపురం, జూన్ 9: కరవు సీమలో పక్షులకూ ఆహారం కొరత ఏర్పడింది. వేల కిలోమీటర్ల దూరం నుంచి సంతానోత్పత్తి కోసం అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం వీరాపురం చేరుకునే ఎర్రమూతి (సైబీరియన్) కొంగలు తిండి దొరక్క మృత్యువాతపడుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపధ్యంలో ఈసారి వీరాపురం చెరువుతో పాటు పరిసరాల్లోని కుంటల్లో నీళ్లు అడుగంటాయి. ఫలితంగా చేపలు పెంచలేదు.

Pages