S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/11/2016 - 03:51

హైదరాబాద్, జూన్ 10: ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల బదిలీలకు వీలు కల్పిస్తూ, ప్రస్తుతం బదిలీలపై కొనసాగుతున్న నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. నిషేధం ఎత్తివేత శనివారంనుంచి 20వ తేదీ వరకూ అమలులో ఉంటుందని ఆర్ధిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజేయకల్లం చెప్పారు. ఈ మేరకు ఆయన జీవో 102 జారీ చేశారు.

06/11/2016 - 03:50

విశాఖపట్నం, జూన్ 10:‘సాక్షి’ ఛానెల్ రెచ్చగొట్టే వార్తలను ప్రసారం చేస్తూ ఉద్రిక్తతలను మరింత పెంచుతోందని, ఆ కారణంగా ఆ ఛానెల్ ప్రసారాలను నిలిపివేశామని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. విశాఖలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాపు ఉద్యమనేత ముద్రగడ దీక్షకు సంబంధించి సాక్షి టీవీ చేసిన ప్రసారాలు ఆయా సామాజికవర్గాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయన్నారు.

06/11/2016 - 03:48

హైదరాబాద్, జూన్ 10:సచివాలయం తరలింపువ్యవహారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ నేతల మధ్య చిచ్చుకు కారణమవుతోంది. తరలింపును కనీసం ఆరునెలల వరకూ వాయిదా వేయాలని సచివాలయ గెజిటెడ్ అధికారుల సంఘం కోరుతుండగా, నిర్ణీత గడువులోగా ఉద్యోగులు వస్తారని ఏపి ఎన్జీఓ నేత అశోక్‌బాబు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ చెబుతున్నారు.

06/11/2016 - 03:45

హైదరాబాద్, జూన్ 10: మైనింగ్ శాఖ అనుమతులు లేవు. హైకోర్టు ఆదేశాలకు విలువ లేదు. కాని విలువైన సున్నపు రాయి ఖనిజాన్ని తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే తన అనుచరులను ప్రేరేపించి అక్రమ మైనింగ్‌ను ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్ర ఖజానాకు గండిపడుతున్నా అధికార యంత్రాంగంలో ఉలుకు పలుకు లేదు.

06/11/2016 - 03:42

గుంటూరు, జూన్ 10: కృష్ణా పుష్కరాల తర్వాత ఏపి కేబినెట్ విస్తరణ జరపాలని తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పార్టీపరంగా మహానాడు, మహాసంకల్ప దీక్షలు, ఈ నెలలో రాజధానికి పాలనావ్యవస్థ తరలింపుప్రక్రియ పూర్తిచేసి, ఆపై విస్తరణ అంశంపై పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమాలోచనలు జరపనున్నట్లు తెలిసింది.

06/11/2016 - 03:39

రాజమహేంద్రవరం, జూన్ 10: కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో కొనసాగిస్తున్న దీక్ష శుక్రవారం నాటికి రెండో రోజుకు చేరుకుంది. కిర్లంపూడిలో ఆమరణ దీక్షను భగ్నం చేసిన అనంతరం ముద్రగడను పోలీసులు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించిన నేపథ్యంలో అక్కడ వైద్య పరీక్షలను నిరాకరించారు.

06/11/2016 - 03:31

హైదరాబాద్, జూన్ 10: అమరావతి రాజధాని నిర్మాణంలో మరో కీలక ఘట్టానికి ప్రభుత్వం తెరతీసింది. 900 ఎకరాల్లో ప్రభుత్వ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించేందుకు, త్వరితగతిన నిర్ణయాలు తీసుకునేందుకు ఆరుగురు సభ్యులతో ఉన్నతాధికార కమిటీని నియమించింది.

06/11/2016 - 03:46

విజయవాడ, జూన్ 10: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుకున్నది సాధించుకున్నారు. జూన్ 27 నాటికి ఉద్యోగులంతా అమరావతికి వచ్చితీరాలన్న ఆయన పట్టుదలను నెరవేర్చుకుంటున్నారు. స్థానికత, 30 శాతం హెచ్‌ఆర్‌ఏ, వౌలిక సదుపాయాల కల్పన వంటి అనేక సమస్యలను ఉద్యోగులు సాకుగా చూపి, అమరావతి రావడానికి మొరాయించారు. అయితే, ప్రభుత్వం ఈ సమస్యలను ఒక్కటొక్కటిగా పరిష్కరించుకుంటూ వచ్చింది.

06/10/2016 - 18:15

విజయవాడ: తుని విధ్వంసకాండకు సంబంధించి సిఐడి పోలీసులు అరెస్టు చేసిన వారిలో అమాయకులు ఎవరూ లేరని మంత్రి నారాయణ అన్నారు. రౌడీషీటర్లు, వైకాపాకు చెందిన వారు విధ్వంసంలో పాల్గొన్నందున వారినే అరెస్టు చేశారన్నారు. రౌడీషీటర్లు, నేరస్థులను విడిచి పెట్టాలని ముద్రగడ కోరడం తగదన్నారు. విధ్వంసానికి పాల్పడినవారందరిపైనా కేసులు తప్పవన్నారు.

06/10/2016 - 17:41

విశాఖ: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న గాజువాక సిఐ అప్పారావు, ఎస్‌ఐ సురేష్‌లను నగర పోలీస్ కమిషనర్ యోగానంద్ సస్పెండ్ చేశారు. విధి నిర్వహణలోనూ వీరు నిర్లక్ష్యంగా ఉన్నందున కేసుల సంఖ్య పేరుకుపోయిందని కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకోకుంటే సిబ్బందిపై చర్యలు తప్పవన్న సంకేతాలను ఆయన ఇచ్చారు.

Pages