S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/09/2016 - 12:13

కాకినాడ: తుని విధ్వంసకాండకు సంబంధించి అరెస్టు చేసిన వారిని తక్షణం విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తూ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం గురువారం ఉదయం కిర్లంపూడిలోని తన ఇంట్లో సతీసమేతంగా ఆమరణ దీక్ష ప్రారంభించారు. తనను అరెస్టు చేయడానికి పోలీసులు బలవంతంగా ఇంట్లోకి ప్రవేశిస్తే పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని ఆయన హెచ్చరించారు.

06/09/2016 - 07:28

అనంతపురం/కడప/కర్నూలు, జూన్ 8: ఎన్నికల హామీలు నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై రాయలసీమలోని అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో వైకాపా నాయకులు కేసులు నమోదుచేశారు. అనంతపురం జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో కేసులు నమోదయ్యాయి. అనంతలో జరిగిన జరిగిన రైతు భరోసాయాత్రలో జగన్ సిఎంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

06/09/2016 - 07:27

అమలాపురం, జూన్ 8:చట్టాన్ని ధిక్కరించినవారిపై చర్యలు తప్పవని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప హెచ్చరించారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం క్యాంపు కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముద్రగడ తీరుపై చినరాజప్ప నిప్పులు చెరిగారు.

06/09/2016 - 07:26

విజయవాడ, జూన్ 8: రెండేళ్ల తమ పరిపాలనలో ప్రతి గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నట్టు వచ్చే ఏడాదికల్లా ఇంటింటికీ వంట గ్యాస్ కనెక్షన్ ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. బుధవారం మహాసంకల్పం సందర్భంగా గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాస గృహం నుంచి ఆయన 4,800 మంది అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

06/09/2016 - 06:53

హైదరాబాద్, జూన్ 8: ఆంధ్రప్రదేశ్‌లో నివాసముండే ప్రతి కుటుంబానికి చెందిన ఆర్థిక, సామాజిక స్థితిపై సమగ్ర సర్వే నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ నెల 20నుంచి 30వ తేదీ వరకు, మళ్లీ వచ్చే నెల 6వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ సర్వేను నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళిక ఖరారు చేసింది. రెండు దశల్లో ఈ సర్వే ముగుస్తుంది. ఈ సర్వేలో ప్రతి కుటుంబాన్ని 75 ప్రశ్నలు అడుగుతారు.

06/09/2016 - 06:52

సిఎం రమ్మంటున్నారు.. కార్యదర్శులు వద్దంటున్నారు!
హైదరాబాద్‌లో ఇళ్లు ఖాళీ చేయాలా? వద్దా?
వస్తే లక్షలాది ఫైళ్లు ఎక్కడ పెట్టాలి? ఎలా తరలించాలి?
ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చాకే కదిలేదంటున్న ఉద్యోగులు

06/09/2016 - 06:25

నేటి నుంచి ప్రారంభం కిర్లంపూడిని దిగ్బంధించిన సాయుధ బలగాలు నేతల గృహ నిర్బంధానికీ రంగం సిద్ధం
మద్దతుగా ఎక్కడికక్కడే దీక్షలు అరెస్టు చేస్తే జైలులోనే దీక్ష తప్పదన్న కాపునేత అరెస్ట్ జరగవచ్చన్న చినరాజప్ప

06/09/2016 - 06:14

కడప, జూన్ 8: ఎవరెంతగా బెదిరించినా ప్రజలకు తప్ప ఎవరికీ తలవంచనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధే తన దృక్పథమని అన్నారు. బ్లాక్‌మెయిలింగ్‌లకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదని, జైలుకు వెళ్లలేదని, తనపై ఎలాంటి కేసులు లేవని బాబు స్పష్టం చేశారు.

06/08/2016 - 17:27

కడప: రాష్ట్ర విభజన ఫలితంగా తెలంగాణకు ఆస్తులు, ఎపికి అప్పులు మిగిలాయని, అయినప్పటికీ కష్టాలను ఎదుర్కొని అభివృద్ధి పథంలో పయనించేలా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.

06/08/2016 - 17:26

విజయవాడ: చీటికీ మాటికీ నిరాహార దీక్షలు చేస్తూ కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం బెదిరింపు రాజకీయాలకు దిగుతున్నారని ఎపి మంత్రి నారాయణ విమర్శించారు. ఎవరి కోసం దీక్షలు చేస్తున్నారో ముద్రగడ ప్రకటించాలన్నారు. రౌడీషీటర్లను, నేరస్థులను పోలీసులు చట్టప్రకారం అరెస్టు చేస్తుంటే ముద్రగడకు ఎందుకు అభ్యంతరమని ప్రశ్నించారు. కాపుల సంక్షేమం కోసమైతే ఆయన దీక్షలు చేయాల్సిన పనిలేదని నారాయణ అన్నారు.

Pages