S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/09/2016 - 17:57

విజయనగరం: జూన్‌ నెలాఖరులోగా బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజీ ఆదేశించారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

06/09/2016 - 17:03

కాకినాడ: తుని విధ్వంసకాండకు సంబంధించి అరెస్టు చేసిన వారిని తక్షణం విడిచి పెట్టాలని డిమాండ్ చేస్తూ కిర్లంపూడిలోని తన ఇంట్లో ఆమరణ దీక్షకు దిగిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను గురువారం సాయంత్రం పోలీసులు అరెస్టు చేశారు. ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆయనను అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అంతకుముందు ముద్రగడ అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకుని రాజమండ్రికి తరలించారు.

06/09/2016 - 17:01

విశాఖ: ఎపిలో నైరుతి రుతుపవనాలు గురువారం ప్రవేశించాయి. దీంతో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం, అనంతపురం, కడప జిల్లాల్లో పాక్షికంగా, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో పూర్తి స్థాయిలో రుతుపవనాలు ప్రవేశించాయి. రెండు రోజుల్లో మిగతా జిల్లాల్లోనూ ఇవి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

06/09/2016 - 17:01

విజయవాడ: ఎపిలో రైతులకు రెండో విడత రుణమాఫీ కింద 3,500 కోట్ల రూపాయలను విడుదల చేస్తామని సిఎం చంద్రబాబు గురువారం ఇక్కడ జరిగిన బ్యాంకర్ల సమావేశంలో ప్రకటించారు. రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రుణమాఫీ మొత్తాలను జమ చేస్తారు. నగదును ఖాతాల్లోనే ఉంచితే పది శాతం వడ్డీ చెల్లిస్తామన్నారు.

06/09/2016 - 15:42

కాకినాడ: వివిధ కేసులకు సంబంధించి ముద్రగడను అరెస్టు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నా ఆయన మాత్రం సహకరించడం లేదని తూ.గో. జిల్లా ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. కిర్లంపూడిలో ముద్రగడ గురువారం ఉదయం ఆమరణ దీక్ష ప్రారంభించాక జిల్లాలో నిషేధాజ్ఞలు విధించామన్నారు. కేసులకు సంబంధించిన పత్రాలన్నింటినీ ముద్రగడ లాయర్‌కు ఇచ్చామని, విచారణ చేపట్టని కేసుల్లో అరెస్టు చేయాలంటూ ముద్రగడ పట్టుబడుతున్నారని ఎస్పీ తెలిపారు.

06/09/2016 - 13:36

విజయవాడ: ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ పదవిని భర్తీ చేసేందుకు ఎపి సర్కారు కసరత్తు చేస్తోంది. ఎయులో కెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న గొల్లపల్లి నాగేశ్వరరావును వీసీగా నియమించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఆయన నియామకానికి సంబంధించి రెండు,మూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని తెలిసింది.

06/09/2016 - 13:35

విశాఖ: అన్ని విధాలుగా వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేలా ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగు సూచనలు చేయాలని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కోరారు. ఈ మేరకు ఆయన గవర్నర్‌కు సుదీర్ఘ లేఖ రాశారు. ఉత్తరాంధ్ర వాసుల ఆశలు ఫలించేలా ఇకనైనా పాలకులు గట్టి ప్రయత్నాలు చేయాలని ఆయన కోరారు.

06/09/2016 - 12:41

నెల్లూరు : నెల్లూరు జిల్లా తడ పోలీసులు తమిళనాడుకు ఎర్రచందనం తరలిస్తున్న రెండు వాహనాలను గురువారం తెల్లవారుజామున స్వాధీనం చేసుకున్నారు. 35 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. రెండు వాహనాలను సీజ్‌ చేసి తడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వాహనంలోని వ్యక్తులు పరారయ్యారు.

06/09/2016 - 12:15

కడప: కాపు కులస్థుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం సహకరించాలని సిఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఎవరో చెప్పిన మాటలు వినకుండా కాపుల ప్రగతి గురించి ముద్రగడ ఆలోచించాలన్నారు. కాపులకు రిజర్వేషన్ల కోసం కమిషన్‌ను నియమించామని, కాపు కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశామని ఆయన గుర్తు చేశారు. ‘కాపులకు ఏమీ చేయని వైఎస్ రాజశేఖరరెడ్డి దేవుడయ్యాడా?

06/09/2016 - 12:14

ఒంగోలు: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్ష ప్రారంభించడం వెనుక వైకాపా అధినేత జగన్ ప్రమేయం ఉందని ఎపి కాపు కార్పొరేషన్ అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. చీటికీ మాటికీ దీక్షలు చేస్తూ అభివృద్ధిని అడ్డుకునేందుకు ముద్రగడ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. జగన్ చెప్పినట్లు నడస్తూ ముద్రగడ కాపు కులస్థులకు అన్యాయం చేస్తున్నారన్నారు.

Pages