S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/10/2016 - 08:22

ఒంగోలు అర్బన్,జూన్ 9:ప్రభుత్వ ఆస్తులు ధ్వంసంచేస్తే కేసులు పెట్టరా అని రాష్ట్ర దేవాదాయశాఖమంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. గురువారం స్థానిక కాపుకల్యాణ మండపంలో భారతీయ జనతా పార్టీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో వికాసపర్వ్ సమావేశం జరిగింది. ఈసమావేశానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు పివి కృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు.

06/10/2016 - 08:22

హైదరాబాద్, జూన్ 9: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధికి దిశ, దశ మార్గనిర్దేశనం చేసే లక్ష్యంతో రానున్న 34 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని ఒక డాక్యుమెంట్‌ను రూపొందించే బాధ్యతను రాష్ట్రప్రభుత్వం ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థకు అప్పగించింది. ఈ సంస్థ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే అంశాలు, సామాజిక, ఆర్ధిక పరిస్థితులు, మానవ వనరులను దృష్టిలో పెట్టుకుని ఒక డాక్యుమెంట్‌ను త్వరలో విడుదల చేస్తుంది.

06/10/2016 - 08:21

కడప, జూన్ 9: కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం దీక్షలకు ప్రభుత్వం భయపడదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తూ ప్రశాంతంగా ఉన్న ప్రాంతాల్లో కాపులను రెచ్చగొడుతున్నారంటూ ఆయనపై విరుచుకు పడ్డారు. చీటికిమాటికీ ఉద్యమాలు, దీక్షలు చేపడుతున్నారని, వీటికి తాము తలవంచే ప్రసక్తేలేదన్నారు.

06/10/2016 - 08:19

హైదరాబాద్, జూన్ 9: కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ల కోసం కాపునేత ముద్రగడ పద్మనాభం చేస్తున్న దీక్షను భగ్నం చేసి, ఆయన్ను అరెస్టు చేసిన ప్రభుత్వం, బేషరతుగా ఆయన్ను వెంటనే విడుదల చేయాలని ఆలిండియా కాంపు సంఘం డిమాండ్ చేశారు. ముద్రగడ అరెస్టు నేపథ్యంలో సంఘం రాజధానిలో గురువారం సాయంత్రం అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది.

06/10/2016 - 08:19

ఒంగోలు, జూన్ 9 : తుని సంఘటనలో పాల్గొన్న నిందితులు, నేరస్థులను, శాంతి భద్రతలకు విఘాతం కల్పించిన వారిని విడిపించమని కాపు నేత ముద్రగడ పద్మనాభం అడగటం సమంజసమా అని కాపుకార్పోరేషన్ చైర్మన్ చలమశెట్టి రామానుజయ్య అన్నారు. గురువారం ఆయన ఒంగోలులో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ తుని ఘటనలో నిందితులను విడిపిస్తే హింసను ప్రేరేపించినట్లు అవుతుందన్నారు.

06/10/2016 - 08:18

అనంతపురం, జూన్ 9: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే రాష్ట్ర విద్యార్థులు అప్రమత్తతంగా వ్యవహరించాలని ఐటిశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సూచించారు. చేరబోయే విద్యాసంస్థలకు సంబంధించిన వివరాలను ఇంటర్‌నెట్ ద్వారా సమగ్రంగా తెలుసుకోవాలన్నారు. గురువారం అనంతపురంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ విదేశాలకు వెళ్లే విద్యార్థులు ముందుగా అక్కడి పద్ధతులు, వివరాలు తెలుసుకోవాలన్నారు.

06/10/2016 - 08:09

హైదరాబాద్, జూన్ 9: తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల ఫీజుల ఖరారు వ్యవహారం ఊపందుకుంది. ఇప్పటికే ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ ఇప్పటికే పలుమార్లు యాజమాన్యాల ప్రతినిధులతో సమావేశమై వారి అభిప్రాయాలను సేకరించింది. 20వేలు, 35వేలు ఫీజు ఉన్న కాలేజీలు సైతం లక్ష రూపాయల వరకూ ఫీజు పెంచాలని కోరగా, మరికొన్ని ప్రముఖ కాలేజీలు రెండు రెట్లు అదనంగా ఫీజును కోరాయి.

06/09/2016 - 18:10

గుంటూరు: నగరంలో కొత్తగా నిర్మించిన టిడిపి రాష్ట్ర కార్యాలయాన్ని ఆ పార్టీ యువనేత నారా లోకేష్ తొలిసారిగా గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. కార్యాలయంలోని పలు విభాగాలను సందర్శించి పార్టీ నేతలకు లోకేష్ కొన్ని సూచనలు చేశారు.

06/09/2016 - 18:09

విశాఖ: ఇక్కడి కోస్టల్ బ్యాటరీ వద్ద స్నానం చేసేందుకు గురువారం మధ్యాహ్నం సముద్రంలో దిగిన ఓ యువకుడు గల్లంతయ్యాడు. అలల వేగానికి కొట్టుకునిపోయిన ఆ యువకుడి ఆచూకీ కోసం గజఈతగాళ్లు సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు.

06/09/2016 - 18:08

విజయవాడ: కాపు విధ్వంసకాండకు సంబంధించి ఎలాంటి అరెస్టులు జరగవని ఎపి ప్రభుత్వం ఎపుడూ ఎవరికీ హామీ ఇవ్వలేదని టిడిపి ఎంపీ తోట త్రిమూర్తులు గురువారం మీడియాతో అన్నారు. అయితే, అలా హామీ ఇచ్చినట్టు కాపునాయకుడు ముద్రగడ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. కాపుల సంక్షేమానికి కృషి చేస్తున్న ప్రభుత్వానికి ముద్రగడ సహకరించాలన్నారు. ఉద్యమాలు జరిగినపుడు అరెస్టులు, కేసులు షరామామూలేనని ఆయన వ్యాఖ్యానించారు.

Pages