S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/26/2016 - 18:22

విజయవాడ: జూన్ 27 నాటికి హైదరాబాద్‌లో ఉన్న ఎపి ఉద్యోగులంతా అమరావతికి రావాల్సిందేనని, ఇందులో ఎవరికీ ఎలాంటి మినహాయింపులు ఉండవని సిఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధిత అధికారులే భవనాలను వెదుక్కోవాలని, అద్దెలు ఎక్కువగా ఉంటే రెంట్ కంట్రోల్ చట్టాన్ని అమలు చేస్తామన్నారు.

05/26/2016 - 18:17

కాకినాడ : రాజమండ్రిలో గురువారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం సంభవించి, మహిళా కళాశాల దగ్గర మూడు భారీ వృక్షాలు కూలిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. రాజమండ్రి-కాకినాడ మధ్య రాకపోకలు నిలిచాయి.

05/26/2016 - 18:02

సఖినేటిపల్లి : తూ.గో జిల్లా సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెంలో ఓఎన్జీసీ పైపులైన్ కేవీ 11 నుంచి గురువారం గ్యాస్ లీకేజీ అవడంతో స్థానికులు ఆందోళన చేశారు. దీంతో లీకేజీని అదుపు చేయడం కోసం ఓఎన్జీసీ అధికారులు రంగంలో దిగారు.

05/26/2016 - 16:54

విశాఖ: నగరంలోని పిఠాపురం కాలనీలో 11 నెలల బాలుడు కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. బాలుడి ఆచూకీ కోసం మూడో పట్టణ పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.

05/26/2016 - 16:53

విజయవాడ: ఆర్మీ, నేవీ, వాయుసేనలో చేరాలని ఆసక్తి చూపే యువతకు ఉచితంగా శిక్షణ ఇస్తామని ఎపి సిఎం చంద్రబాబు గురువారం ఇక్కడ తెలిపారు. ఎలాంటి ఫీజులు తీసుకోకుండా శిక్షణకు హాజరయ్యే వారికి వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు. యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచేందుకు కొత్త విధానానికి శ్రీకారం చుట్టామన్నారు. రక్షణ రంగంలో చేరాలనుకునే సుమారు 8వేల మందికి ఈ ఏడాది శిక్షణ ఇప్పిస్తామన్నారు.

05/26/2016 - 15:03

ఒంగోలు: వైకాపా నుంచి మరో ఎమ్మెల్యే టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు సమాచారం. ప్రకాశం జిల్లా గిద్దలూరు వైకాపా ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సన్నాహాలు జోరందుకున్నాయి. ఆయన గురువారం నాడు పార్టీ కార్యకర్తలు, ముఖ్య అనుచరులతో సమావేశమయ్యారు. కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఆయన కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

05/26/2016 - 15:01

విజయవాడ: ప్రధానిగా నరేంద్ర మోదీ రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా తాము సాధించిన విజయాలను ప్రజలకు వివరించేందుకు పలువురు కేంద్రమంత్రులు ఎపికి వస్తున్నారు. విశాఖ, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, అనంతపురం, తిరుపతి, నెల్లూరు నగరాల్లో జరిగే బహిరంగ సభల్లో కేంద్రమంత్రులు పాల్గొంటారు.

05/26/2016 - 14:59

హైదరాబాద్: ఎపి నుంచి రాజ్యసభకు వైకాపా అభ్యర్థిగా విజయసాయి రెడ్డి గురువారం అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ సమక్షంలో నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు జరిగిన పార్టీ సమావేశంలో ఆయన అభ్యర్థిత్వాన్ని వైకాపా అధినేత జగన్ ఖరారు చేశారు. నామినేషన్ వేసిన సందర్భంగా కొందరు వైకాపా నేతలు హాజరయ్యారు.

05/26/2016 - 14:59

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాటిపర్రు వద్ద ఓ కోళ్లఫారంలో దాచిన 200 కిలోల గంజాయిని ఎక్సయిజ్ అధికారులు గురువారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు.

05/26/2016 - 14:58

విశాఖ: ఎపికి ప్రత్యేకహోదా ఇవ్వలేకపోయినా రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం భారీగా నిధులను కేటాయిస్తోందని విశాఖ ఎంపీ హరిబాబు అన్నారు. ప్రధానిగా మోదీ రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా గురువారం ఇక్కడ బిజెపి నిర్వహించిన ఉత్సవాల్లో ఆయన మాట్లాడుతూ, ఎపికి త్వరలోనే రైల్వే జోన్ వస్తుందని, పోలవరం ప్రాజెక్టును కేంద్రమే పూర్తి చేస్తుందని తెలిపారు.

Pages