S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/26/2016 - 06:18

విజయవాడ, మే 25: రానున్న కాలంలో చేనేత, హస్తకళ వృత్తుల ప్రోత్సాహానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. బుధవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో ఈ శాఖపై జరిగిన చర్చిలో చంద్రబాబు మాట్లాడుతూ చేనేత రంగంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అధికారులకు దిశా, నిర్దేశం చేశారు.

05/26/2016 - 06:18

కాకినాడ, మే 25: కాపు జాతి మేలు కోసం తాను లేఖలు రాస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు భుజాలు తడుముకోవడం హాస్యాస్పదంగా ఉన్నదని మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యానించారు. ఇటీవల తాను రాసిన లేఖలపై ముఖ్యమంత్రి కోటరీ ద్వారా చేయిస్తున్న విమర్శలకు ముద్రగడ మరోసారి ప్రతివిమర్శలు చేశారు.

05/26/2016 - 06:16

విజయవాడ, మే 25: రాష్ట్ర విభజనతో ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయినప్పటికీ, రెండో ఏడాదికే అద్భుత పురోగతితో పరుగులు పెడుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. రెండు రోజులపాటు జరగనున్న కలెక్టర్ల సదస్సు మంగళవారం విజయవాడలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయా శాఖల అభివృద్ధి గణాంకాలతో కూడిన వివరాలను ముఖ్యమంత్రి విడుదల చేశారు.

05/26/2016 - 06:06

విజయవాడ, మే 25: కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం తన రాజకీయ ఉనికి కోసమే లేఖలు రాస్తున్నాడంటూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం నాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ కొందరు ఆడిస్తున్న నాటకంలో ముద్ర కూడా కీలుబొమ్మ అంటూ ఎద్దేవా చేశారు. కాపు రిజర్వేషన్‌పై తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

05/26/2016 - 06:03

విజయవాడ, మే 25: రెండేళ్ల ఎన్డీఏ పాలన పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రజలకు కల్పించిన వౌలిక సదుపాయాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు రాష్ట్రంలోని 7 వివిధ నగరాల్లో ‘వికాస్‌పర్వ్’ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపి కంభంపాటి హరిబాబు వెల్లడించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, ఇన్‌చార్జీల సమావేశం బుధవారం జరిగింది.

05/26/2016 - 05:28

విజయవాడ, మే 25: ‘మనం ఎన్ని మంచి పనులు చేసినా, అవి పూర్తిస్థాయిలో ఫలితాలను ఇవ్వడం లేదు. ప్రజల్లో రాజకీయ నాయకులపైన, అధికార యంత్రాంగంపైన నమ్మకం లేకపోవడమే ప్రధాన కారణం. కొన్ని శాఖలపై అవినీతి మచ్చ ఉంది. అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు స్వార్థంతో పనిచేస్తున్నారని, తమ గురించి ఆలోచించడం లేదనే అభిప్రాయం ప్రజల్లో ఉంది.

05/26/2016 - 01:20

గుంటూరు, మే 25: కేదారనాథ్ యాత్రలో తెలుగోళ్లు అడుగడుగునా అగచాట్లకు గురవుతున్నారు. గత కొద్దిరోజుల క్రితం బగ్గీల నిర్వాహకుల దాడితో బెంబేలెత్తిన సంఘటన మరువక ముందే ప్రైవేటు ట్రావెల్స్ సంస్థ నిర్వాకంతో తెలుగు యాత్రికులు నిలువుదోపిడీతో అవస్థలు పడుతున్నారు. భాషా భేదంతో పోలీసులు దళారులకు కొమ్ముకాయటంతో కొండలు, గుట్టల్లో ప్రాణాలరచేత పట్టుకుని బిక్కుబిక్కుమని కాలం గడుపుతున్నారు..

05/26/2016 - 05:13

విజయవాడ, మే 25: రాష్ట్రంలో జూన్ 30 నుంచి ఈ-ఆఫీస్‌లోనే ఫైళ్ళ నిర్వహణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్లను ఆదేశించారు. రెండురోజులపాటు జరగనున్న కలెక్టర్ల సదస్సు విజయవాడలో బుధవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఈ-ఆఫీస్ విధానంపై చంద్రబాబు సమీక్ష జరిపారు. ఈ-ఆఫీస్ విధానాన్ని అమలు చేయడానికి చిత్తూరు, విజయనగరం జిల్లాలకు జూలై 15 వరకూ గడువు ఇవ్వనున్నట్టు చెప్పారు.

05/26/2016 - 00:32

గుంటూరు, మే 25: ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి రహదార్లు, వౌలిక వసతులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ‘సచివాలయానికి దారేదీ’ అనే శీర్షికన ఆంధ్రభూమి ప్రధాన సంచికలో వెలువడిన వార్తాకథనంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు.

05/25/2016 - 18:16

విజయవాడ: పేదవర్గాల విద్యార్థులు ఐఐటిల్లో సీట్లు సాధించేలా వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఎపి సిఎం చంద్రబాబు సూచించారు. ఇక్కడ బుధవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సంక్షేమశాఖ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా ఆధునిక వృత్తివిద్య కోర్సులను ప్రవేశ పెట్టాలన్నారు.

Pages