S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/28/2016 - 07:00

తిరుపతి, మే 27: తెలుగుదేశం పార్టీ మహానాడు సంబరాలు శుక్రవారం తిరుపతిలో అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. టిడిపి ఆవిర్భవించి 34 సంవత్సరాలు పూర్తిచేసుకుని 35వ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా స్థానిక నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ క్రీడామైదానంలో మూడు రోజులపాటు జరిగే మహానాడు సభలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదయం 10 గంటలకు చేరుకున్నారు.

05/27/2016 - 18:05

విజయవాడ: సెల్‌ఫోన్ విషయమై స్నేహతుల మధ్య వివాదం ఓ నిండు ప్రాణాలను బలిగొన్న సంఘటన నగరంలోని లయోలా కాలేజీలో శుక్రవారం జరిగింది. ఇంటర్మీడియట్ బెటర్‌మెంట్ పరీక్షలు రాసేందుకు దిల్లీ నుంచి వచ్చిన కమల్ అనే విద్యార్థి కొద్ది రోజులుగా కాలేజీ హాస్టల్‌లో ఉంటున్నాడు. సెల్‌ఫోన్ విషయంలో హాస్టల్‌లో సహచర విద్యార్థులతో గొడవ ఫలితంగా కమల్ తీవ్ర మనస్తాపానికి లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

05/27/2016 - 18:04

శ్రీకాకుళం: రేగిడి మండలం సంకిలి వద్ద ఓ ప్రైవేటు సుగర్ ఫ్యాక్టరీలోని బాయిలర్‌లో పడి ముగ్గురు కార్మికులు శుక్రవారం మరణించారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం జరిగిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. తగిన నష్టపరిహారం ప్రకటించనంతవరకూ మృతదేహాలను తరలించే ప్రసక్తి లేదని బాధిత కుటుంబాల వారు ఫ్యాక్టరీ వద్ద ఆందోళనకు దిగారు.

05/27/2016 - 17:35

తిరుపతి: ఏపీ ఐసెట్‌లో 87.71 శాతం మంది అర్హత సాధించినట్లు గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఐసెట్‌-2016 పరీక్షా ఫలితాలను తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో మంత్రి ప్రకటించారు.

05/27/2016 - 17:29

తిరుపతి : తెలుగుదేశం పార్టీ నికర ఆస్తులు రూ.52కోట్లుగా మహానాడులో శుక్రవారం ప్రకటించారు. పార్టీ కోశాధికారి, మంత్రి రాఘవరావు ఈ మేరకు పార్టీ జమాఖర్చుల వివరాలను ప్రకటించారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పార్టీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను అన్నిటినీ ఆయన ప్రకటించారు. పార్టీ సభ్యత్వం, విరాళాల రూపంలో ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు వచ్చిన మొత్తం ఆదాయం రూ.15కోట్లు.

05/27/2016 - 15:56

విశాఖ: విశాఖ ఏజెన్సీలోని డుంబ్రిగుడ మండలం చాపరాయి వద్ద శుక్రవారం ఉదయం గెడ్డలో మునిగి ముగ్గురు చిన్నారులు మరణించారు. వేసవితాపం నుంచి ఉపశమనం పొందేందుకు వీరు గెడ్డలో దిగి ప్రాణాలు కోల్పోయారు.

05/27/2016 - 15:54

తిరుపతి: రాష్ట్ర విభజనను పురస్కరించుకుని వచ్చే నెల 2న నవనిర్మాణ దీక్షను చేపడతామని టిడిపి అధినేత, ఎపి సిఎం చంద్రబాబు ఇక్కడ జరుగుతున్న పార్టీ మహానాడులో తెలిపారు. 3 నుంచి 8వ తేదీ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా జనచైతన్య కార్యక్రమాలు ఉంటాయన్నారు. చివరి రోజున 8వ తేదీన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం మహాసంకల్పం నిర్వహిస్తామన్నారు.

05/27/2016 - 15:52

తిరుపతి: రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు తాను ప్రయత్నిస్తుండగా కొందరు వివిధ రూపాల్లో అరాచకాలు సృష్టిస్తున్నారని సిఎం చంద్రబాబు పరోక్షంగా వైకాపాపై విమర్శల దాడి చేశారు. ఇక్కడ శుక్రవారం ప్రారంభమైన టిడిపి మహానాడులో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎక్కడ అరాచకం జరిగినా అందులో వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యుల పాత్ర ఉంటోందని అన్నారు.

05/27/2016 - 13:43

హైదరాబాద్: ఎపికి ప్రత్యేకహోదా హామీని నెరవేర్చడంలో బిజెపి నేతలు విఫలమయ్యారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి శుక్రవారం ఆరోపించారు. ప్రత్యేకహోదాపై మాట మార్చిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఎపికి భారీగా నిధులు ఇస్తున్నట్లు చెప్పడంలో అర్థం లేదన్నారు. హోదా ఇవ్వడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని కూడా బిజెపి నేతలు అనడం దారుణమన్నారు.

05/27/2016 - 13:43

తిరుపతి: కార్యకర్తల కృషి, త్యాగాల వల్లనే ఎపిలో టిడిపి మళ్లీ అధికారంలోకి రాగలిగిందని ఆ పార్టీ అధినేత, సిఎం చంద్రబాబు శుక్రవారం ఇక్కడ ప్రారంభమైన మహానాడులో అన్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని ముందుకు నడిపించడంలో కార్యకర్తలు దీక్ష వహించాలన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేసేలా కార్యకర్తలు సహకరించాలన్నారు. తాను కూడా పార్టీలో ఓ సామాన్య కార్యకర్తనేనని ఆయన అన్నారు.

Pages