S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/28/2016 - 07:54

సంక్షేమమే ధ్యేయం..అభివృద్ధే లక్ష్యం అగ్రవర్ణ పేదలకూ రిజర్వేషన్లు ఆంధ్రను నెంబర్ 1 చేయడమే ఆశయం
కేంద్రం సహకరించాల్సిందే కార్యకర్తల త్యాగాలను మరువలేను టిడిపి 35వ మహానాడులో చంద్రబాబు

05/28/2016 - 07:59

మరో 40 ఏళ్లు అధికారంలో ఉండాలి ఓటమి మాట వినబడకూడదు పథకాలపై పార్టీ ముద్ర
బాబు దిశానిర్దేశం బిజెపిని తూర్పారబట్టిన నేతలు నోరు మెదపని పార్టీ అధినేత
ఓసీలనూ ఆకట్టుకునే ఎత్తుగడ తొలి రోజు మహానాడు సాగిందిలా...

05/28/2016 - 07:14

తిరుపతి, మే 27: పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం స్వార్థం కోసం అధికారాన్ని వినియోగించుకుందని టిడిపి జాతీయ అధ్యక్షులు,సిఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలకు టిడిపి నిస్వార్థంగా సేవ చేయాల్సిన అవసరాన్ని, ప్రజా విశ్వాసాన్ని పొందాల్సిన బాధ్యతను కార్యకర్తలకు బోధించారు.

05/28/2016 - 07:14

తిరుపతి, మే 27: ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరింత చైతన్యవంతం చేయడానికి, తెలుగుదేశం పార్టీని ప్రజలకు చేరువ చేయడానికి జూన్ 2న నవనిర్మాణ దీక్ష చేపట్టనున్నట్లు ఆంధ్రప్రదేశ్ సిఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శుక్రవారం తిరుపతి నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ క్రీడా మైదానంలో జరుగుతున్న మహానాడు సభలో తొలిరోజు ఆయన అధ్యక్షోపన్యాసం చేస్తూ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపైన ఉందన్నారు.

05/28/2016 - 07:13

తిరుపతి, మే 27:కడప జిల్లాలో హింసలేదు. అంతా వై ఎస్ జగన్మోన్ రెడ్డి, ఆయన కుటుంబంలోనే ఉంది. హింసతో భయపెట్టాలని చూస్తున్నారు. ఇలాంటి వారిని ఎందరినో చూశాను. నేను భయపడే ప్రసక్తేలేదు. ప్రజల కోసం నా ప్రాణాలను అడ్డుపెడతా’నని సిఎం చద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతిలో జరుగుతున్న టిడిపి మహానాడు సభలో కార్యకర్తలను చైతన్య పరిచేలా ప్రసగించిన చంద్రబాబు ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్‌పై విరుచుకుపడ్డారు.

05/28/2016 - 07:12

హైదరాబాద్, మే 27: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ మంచి మనిషి, తెలుగు సంస్కృతిని వికసింపజేశారని తమిళనాడు గవర్నర్ డాక్టర్ కె.రోశయ్య ప్రశంసించారు. శుక్రవారం రవీంద్ర భారతిలో మండలి బుద్ధ ప్రసాద్ షష్ట్యబ్దిపూర్తి ఉత్సవానికి రోశయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘బుద్ధ యా నం’ పుస్తకాన్ని గవర్నర్ ఆవిష్కరించారు.

05/28/2016 - 07:15

తిరుపతి, మే 27: తెలుగు దేశం పార్టీకోసం ప్రాణాలను అర్పించి, సర్వస్వం త్యాగం చేసి పార్టీ పటిష్ఠతకోసం పనిచేసిన, చేస్తున్న కార్యకర్తల పాదాలకు ఈ మహానాడు వేదికగా వందనం చేస్తున్నానని టిడిపి జాతీయ అధ్యక్షుడు నారాచంద్రబాబు నాయుడు ఉద్వేగంగా అన్నారు. శుక్రవారం తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ క్రీడా మైదానంలో మూడు రోజుల మహానాడు ప్రారంభ సభలో ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.

05/28/2016 - 07:11

తిరుపతి, మే 27:ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని నమ్మి తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసిన వ్యవస్థాపకుడు ఎన్‌టిఆర్ ఆశయాల సాధనకు తాను కట్టుబడి ఉన్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఎన్‌టిఆర్ ఆశాయాలను ముందుకు తీసుకువెళ్ళే దిశగానే అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు.

05/28/2016 - 07:02

తిరుపతి, మే 27: ఏపి ఐసెట్ 2016 పరీక్షా ఫలితాలను రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం తిరుపతిలోని ఎస్వీ యూనివర్శిటీ సెనెట్ హాల్లో ఆవిష్కరించారు. ఈనెల 16న జరిగిన పరీక్షలకు 64,490 మంది హాజరుకాగా, 54,498 మంది అర్హత సాధించారు. ఇందులో పురుషులు 40,711(63.12 శాతం) ఉత్తర్ణీత సాధించగా, మహిళలు 23,779(36.88 శాతం) ఉత్తీర్ణత సాధించారు.

05/28/2016 - 07:01

రేగిడి, మే 27: శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం సంకిలి ప్యారీ చక్కెర కర్మాగారంలో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. కర్మాగారంలోని బాయిలర్‌ను శుభ్రం చేయడానికి లోపలకు దిగిన ముగ్గురు కార్మికులు మృతి చెందారు. ఈ విషయం మిగిలిన కార్మికులకు తెలియడంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతులంతా రేగిడి మండలం లక్ష్మీపేట గ్రామానికి చెందిన వారు.

Pages